ETV Bharat / sports

పంజాబ్​కు షాకిచ్చిన దిల్లీ- విజయంతో 18వ సీజన్​కు వీడ్కోలు - IPL 2025 DC VS PBKS

ఐపీఎల్ 2025ను విజయంతో ముగించిన దిల్లీ క్యాపిటల్స్- పంజాబ్ కింగ్స్​పై విజయం

IPL 2025
IPL 2025 (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2025 at 11:50 PM IST

1 Min Read

IPL 2025 DC VS PBKS : ఐపీఎల్​ 2025 సీజన్​ను దిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయంతో ముగించింది. పాయింట్స్ టేబుల్​లో టాప్​ ప్లేస్​పై కన్నేసిన పంజాబ్​ కింగ్స్​ టీమ్​కు షాకిచ్చింది. శనివారం రాత్రి ఆ టీమ్​తో జరిగిన మ్యాచ్​​లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే ప్లేఆఫ్స్​కు దిల్లీ దూరమైన విషయం తెలిసిందే.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ భారీ స్కోరు రాబట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. జోష్‌ ఇంగ్లిస్ (32; 12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (28; 18 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడు ప్రదర్శించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (53; 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో అదరగొట్టారు. చివర్లో స్టాయినిస్ (44*; 16 బంతుల్లో3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. ప్రియాంశ్ ఆర్య (6) నిరాశపర్చాడు. నేహల్ వధేరా (16), శశాంక్ సింగ్ (11) పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ 3, కుల్‌దీప్ యాదవ్ 2, విప్రాజ్ నిగమ్ 2, ముకేశ్‌ కుమార్ ఒక వికెట్ పడగొట్టారు.

పంజాబ్​ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని దిల్లీ 4 వికెట్లు కోల్పోయి 3 బంతులు మిగిలుండగా ఛేదించింది. సమీర్ రిజ్వీ (58*; 25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు అర్ధ శతకంతో దుమ్మురేపాడు. కరుణ్‌ నాయర్ (44; 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి స్కోరు బోర్డు పరిగెత్తించాడు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (35; 21 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), ఫాప్ డుప్లెసిస్ (23; 15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభం అందించారు. సెథిఖుల్లా అటల్ (22; 16 బంతుల్లో 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 2, మార్కో యాన్సెన్, ప్రవీణ్ దూబె ఒక్కో వికెట్ తీశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.