IPL 2025 CSK vs LSG : వరుస ఓటములకు బ్రేక్ ఇస్తూ చెన్నై సూపర్ కింగ్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జరిగిన 5 వికెట్లు కోల్పోయి గెలిచింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై మూడు బంతులు మిగిలి ఉండగా టార్గెట్‌ను చేధించింది. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబెకు (43*; 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధోనీ (26*; 11 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌లు) మెరుపులు తోడయ్యాయి. రచిన్ రవీంద్ర (37), షేక్ రషీద్ (27) కూడా రాణించడంతో 5 వరుస ఓటముల తర్వాత విజయం దక్కింది. ఇక లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్ 2, అవేశ్ ఖాన్, మార్‌క్రమ్, దిగ్వేశ్ ఒక్కో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. లఖ్‌నవూ రిషభ్ పంత్ (63; 49 బంతుల్లో - 4 ఫోర్లు - 4 సిక్స్‌లు) అర్ధశతంతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్‌కు దిగిన తొలి ఓవర్లోనే లఖ్‌నవూకు షాక్ తగిలింది. ఖలీల్ బౌలింగ్‌లో చివరి బంతికి మార్‌క్రమ్ (6) క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత నాలుగో ఓవర్లో హిట్టర్ పూరన్ (8) అన్షుల్ కంబోజ్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ దశలో మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ (30: 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో జట్టు కట్టిన రిషబ్ పంత్ (63: 49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత వచ్చిన ఆయుష్ బదోనీ (22: 17 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లు), అబ్దుల్ సమద్ (20: 11 బంతుల్లో 2 సిక్స్‌లు)తో రాణించారు. ఇక చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 2, పతిరన 2, ఖలీల్ అహ్మద్, అన్షుల్ చెరో వికెట్ పడగొట్టారు.