ఉత్కంఠ మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం- ఇంగ్లాండ్‌తో సిరీస్ సమం
భారత్- ఇంగ్లాండ్ ఐదో టెస్టు- హోరాహోరా మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం

Published : August 4, 2025 at 4:30 PM IST
Ind vs Eng 5th Test 2025 : లండన్ ఓవల్ టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. ఐదో మ్యాచ్‌లో నెగ్గాలంటే 35 పరుగులు కాపాడుకుంటూ, నాలుగు వికెట్లు పడగొట్టాల్సిన దశలో టీమ్ఇండియా అద్భుతంగా పోరాడింది. 339-6తో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌ను 367 పరుగులకే ఆలౌట్ చేసింది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమం అయ్యింది.
339-6తో ఐదో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్, మరో 28 పరుగులు చేసి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 367 స్కోర్‌కే ఆలౌటైంది. ఐదో రోజు ఇంగ్లాండ్ చేతిలో నాలుగు వికెట్లతో, 35 పరుగులు కావాల్సిన దశలో ఆట ప్రారంభించింది. ఈ దశలో టీమ్ఇండియా ఐదో రోజు తొలి ఓవర్లోనే జెమీ స్మిత్ వికెట్ తీసింది. ఆ తర్వాత జెమ్మీ ఓవర్టన్, జోష్ టంగ్ వికెట్లు కూడా తొందరగానే కూల్చినా, గస్ అట్కిసన్ (29 బంతుల్లో 17 పరుగులు) పోరాడాడు.
మరోవైపు, గాయపడిన వోక్స్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ దశలో అట్కిసన్ పోరాడాడు. వీలుచికినప్పుడల్లా పరుగులు సాధిస్తూ, టీమ్ఇండియా అభిమానుల్లో గబులు రేపాడు. కానీ, చివర్లో సిరాజ్ అద్భుత బంతికి అట్కిసన్ను బౌల్డ్ చేసి జట్టుకు విజయం ఖరారు చేశాడు. టీమ్ఇండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 5, ప్రసిద్ధ్ కృష్ణ 4, ఆకాశ్ దీప్ 1 వికెట్ దక్కించుకున్నారు.
SIRAJ WILL BE REMEMBERED FOR HIS LION-HEARTED SHOW. 🦁🇮🇳 pic.twitter.com/IM4VSKd98u
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2025
కాగా, ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నెగ్గాగ, ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఇక ప్రతిష్ఠాత్మక లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమ్ఇండియా పోరాడి ఓడింది. నాలుగో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మరోసారి భారత్‌పై పైచేయి సాధించి నెగ్గింది. దీంతో నాలుగు టెస్టులు ముగిసేసరికి ఇంగ్లాండ్ 2-1తో లీడ్‌లోకి వెళ్లింది. తాజాగా లండన్ వేదికగా జరిగిన ఐదో మ్యాచ్‌లో టీమ్ఇండియా అద్భుతంగా పోరాడి 6 పరుగుల విజయం సాధించింది. దీంతో సిరీస్ 2-2తో సమం అయ్యింది.
గిల్ కెప్టెన్సీలో టై
టీమ్ఇండియా కొత్త కెప్టెన్‌గా గిల్ ఈ సిరీస్‌తో కొత్త శకాన్ని ప్రారంభించాడు. తన కెప్టెన్సీలో తొలి పర్యటను టై గా ముగించింది టీమ్ఇండియా. అటు గిల్ కెప్టెన్సీతోనే కాకుండా బ్యాటర్‌గానూ ఆకట్టుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో కలిపి 754 పరుగులు బాది జట్టును ముందుండి నడిపించాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి.
Describe the victory at the Oval in one word ✍️
— BCCI (@BCCI) August 4, 2025
Scorecard ▶️ https://t.co/Tc2xpWNayE#TeamIndia | #ENGvIND pic.twitter.com/MDpE2ND15C
స్కోర్లు
- భారత్- 224 & 396
- ఇంగ్లాండ్- 247 & 367
బుమ్రా మ్యాటర్లో ట్విస్ట్- వర్క్‌లోడ్ కాదు, వెళ్లిపోయింది అందుకే!

