Rishabh Pant Injured: భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జూన్ 20న ఫ్రారంభం కానుంది. టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో లార్డ్స్‌లో ప్రాక్టీస్ సెషన్ మొదలయ్యింది. ఈ ప్రాక్టీస్ సెషన్ నుంచి భారత క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.
భారత క్రికెట్ టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ ప్రాక్టీస్ సెషన్లో గాయపడ్డాడు. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, బంతి పంత్ ఎడమ చేతికి తగిలింది. దీంతో పంత్ గాయపడ్డాడు. నొప్పితో బాధపడుతున్నాడు. వెంటనే ఫిజియో రంగంలోకి దిగి చికిత్స అందించారు. ఆ గాయం తర్వాత పంత్, మళ్లీ ప్రాక్టీస్ చేయలేదు. అలాగే పంత్ కోలుకున్నట్లుగా ఎటువంటి సమాచారం అధికారికంగా రాలేదు.
దీంతో పంత్ తొలి టెస్ట్ ఆడతాడా అనే ప్రశ్నలు తలెతుతున్నాయి. రిషభ్ పంత్ ఇంగ్లాండ్‌తో హెడింగ్లీ మైదానంలో జరగనున్న తొలి టెస్ట్‌లో ఆడతాడా, లేదా అనే ప్రశ్నలు తలెతుత్తున్నాయి. టీమ్ ఇండియా మొదటి టెస్ట్ ప్రారంభానికి ఇంకా 11 రోజులు మిగిలి ఉన్నాయి. పంత్ ప్లేయింగ్-11లో భాగం కాలేకపోతే, ధృవ్ జురెల్ టీం ఇండియాలో అవకాశం పొందుతాడు.
టీమ్ ఇండియా టెస్ట్ జట్టు
శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్,వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
ఇంగ్లండ్ టీమ్
ఇంగ్లాండ్ - బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రౌలీ, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్. (ఇంగ్లాండ్ ఇప్పటివరకు ఒకే ఒక టెస్ట్ కోసం జట్టును ప్రకటించింది.
టెస్ట్ సిరీస్ కోసం యూకేకు చేరుకున్న టీమిండియా
ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం- జట్టుకు కొత్త కోచ్!