ETV Bharat / sports

గ్వాలియర్​లో 14ఏళ్ల తర్వాత ఇంటర్నేషనల్​ మ్యాచ్- సచిన్ డబుల్ సెంచరీ చేసింది అక్కడే! - India Vs Bangladesh 1st T20

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ నగరంలో 14 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. అక్టోబరు 6న భారత్-బంగ్లా జట్లు గ్వాలియర్ వేదికగా తొలి టీ20లో తలపడనున్నాయి.

India Vs Bangladesh 1st T20
India Vs Bangladesh 1st T20 (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 4, 2024, 5:33 PM IST

India Vs Bangladesh 1st T20 : ఇటీవలే బంగ్లాదేశ్​తో జరిగిన రెండు టెస్టుల సిరీస్​ను టీమ్​ఇండియా వైట్ వాష్ చేసింది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న టీ20 సిరీస్​పై కూడా కన్నేసింది. అక్టోబరు 6న గ్వాలియర్‌ నగరంలో కొత్తగా నిర్మించిన 'శ్రీమంత్‌ మాధవరావు సింధియా క్రికెట్‌ స్టేడియం'లో భారత్, బంగ్లాదేశ్‌ జట్లు తొలి టీ20లో తలపడనున్నాయి. అయితే 14 ఏళ్ల తర్వాత గ్వాలియర్ నగరంలో ఇంటర్నేషల్ క్రికెట్ మ్యాచ్ జరగనుండటం గమనార్హం.

సచిన్ డబుల్ సెంచరీ తర్వాత నో మ్యాచ్
గ్వాలియర్ నగరంలో 14 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగబోతోంది. ఇక్కడ చివరి మ్యాచ్ 2010లో జరిగింది. రూప్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన ఆ మ్యాచ్​లో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో టీమ్ ఇండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్​లో మొదటి డబుల్ సెంచరీని చేశాడు. దీంతో టీమ్​ఇండియా 153 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే గ్వాలియర్‌ లో సుదీర్ఘకాలం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుండటం వల్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

షెడ్యూల్ మార్పుతో గ్వాలియర్​కు అవకాశం
అయితే తొలుత భారత్- బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20ని హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో నిర్వహించాలని బీసీసీఐ భావించింది. అక్కడ స్టేడియం పునరుద్ధరణ పనులు జరుగుతుండడం వల్ల వేదికను ఇటీవలే మార్చింది. గ్వాలియర్ లోని 'శ్రీమంత్‌ మాధవరావు సింధియా క్రికెట్‌ స్టేడియం'లో నిర్వహించేందుకు సిద్ధమైంది. దీంతో 14 ఏళ్ల తర్వాత గ్వాలియర్ నగరంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుంది.

గ్వాలియర్​లో 10 వన్డేలు ఆడిన భారత్
గ్వాలియర్ నగరంలోని రూప్ సింగ్ స్టేడియంలో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ 1988లో జరిగింది. ఆ మ్యాచ్ లో భారత్ పై వెస్టిండీస్ 73 పరుగుల తేడాతో విజయం సాధించింది. గ్వాలియర్‌ లో ఇప్పటివరకు టీమ్ ఇండియా మొత్తం 10 వన్డేలు ఆడగా, అందులో 8 గెలిచింది. రెండింట్లో ఓటమిపాలైంది.

గ్వాలియర్‌ లోని కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌ లు :
1988 - భారత్​పై 73 పరుగుల తేడాతో విండీస్ విజయం

1989 - ఇంగ్లాండ్​పై 26 పరుగుల తేడాతో వెస్టిండీస్ గెలుపు

1991 - దక్షిణాఫ్రికాపై 38 పరుగుల తేడాతో భారత్ గెలుపు

1993 - 3 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై భారత్ విజయం

1993 - ఇంగ్లాండ్​పై భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపు

1996 - విండీస్​పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం

1997 - శ్రీలంకపై పాకిస్థాన్ 30 పరుగుల తేడాతో గెలుపు

1998 - భారత్​పై 69 పరుగుల తేడాతో కెన్యా సంచలన విజయం

1999 - న్యూజిలాండ్ పై 14 పరుగుల తేడాతో భారత్ గెలుపు

2003 - ఆస్ట్రేలియాపై 37 పరుగుల భారత్ విజయం

2007 - పాకిస్థాన్​పై టీమ్ ఇండియా విజయం

2010 - సౌతాఫ్రికాపై భారత్ 153 పరుగుల తేడాతో భారీ గెలుపు

T20 వరల్డ్​కప్​లోగా వారణాసి స్టేడియం నిర్మాణం పూర్తి- ఆ ఒక్క మ్యాచ్​కు ఆతిథ్యం ఇక్కడే! - Varanasi stadium

బంగ్లాతో తొలి టీ20 తుది జట్టు - తెలుగు కుర్రాడికి నో ఛాన్స్​! - IND VS BAN First T20

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.