స్మృతి మంధాన, శ్రీ చరణి అదుర్స్- తొలి టీ20లో ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
తొలి టీ20లో ఇంగ్లాండ్‌పై భారత్ విజయం

Published : June 28, 2025 at 11:10 PM IST
Ind Vs Eng Women T20 2025 : ఇంగ్లాండ్ మహిళల జట్టుతో ఐదు టీ20ల సిరీస్‌ను టీమ్ఇండియా మహిళల జట్టు గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది. తొలి టీ20 మ్యాచ్‌లో విజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 97 పరుగుల తేడాతో గెలుపొందింది. స్మృతి మంధాన సెంచరీతో అదరగొట్టగా, శ్రీ చరణి నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. స్మృతి మంధాన (112 ; 62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకంతో అదరగొట్టింది. స్టార్టింగ్ నుంచి బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డు పరిగెత్తించింది. 51 బంతుల్లో టీ20ల్లో తొలి సెంచరీ అందుకుంది. హర్లీన్ డియోల్ (43; 23 బంతుల్లో 7 ఫోర్లు) దూకుడుగా ఆడింది. షెఫాలీ వర్మ (20), రిచా ఘోష్ (12) పరుగులు రాబట్టారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లారెన్ బెల్ 3, ఆర్లోట్, ఎకిల్‌స్టోన్ చెరో వికెట్ తీశారు.
ఆ తర్వాత లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ 14.5 ఓవర్లలోనే 113 పరుగులకు ఆలౌటైంది. నాట్ సీవర్ (66; 42 బంతుల్లో 10 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. బ్యూమాంట్ (10), ఆర్లోట్ (12) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. భారత బౌలర్లలో శ్రీ చరణి (4/12) అదరగొట్టింది. దీప్తి శర్మ 2, రాధా యాదవ్ 2, అమన్‌జ్యోత్, అరుంధతి రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు.

