ETV Bharat / sports

వరుణుడు వచ్చేశాడు- ముగిసిన మూడో రోజు- భారత్ స్కోర్ ఎంతంటే? - IND VS ENG FIRST TEST

ఇంగ్లాండ్ - భారత్ జట్ల మధ్య తొలి టెస్టు- ముగిసిన మూడో రోజు ఆట

Ind Vs Eng
Ind Vs Eng (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : June 22, 2025 at 11:24 PM IST

Updated : June 22, 2025 at 11:57 PM IST

1 Min Read

Ind Vs Eng First Test : ఇంగ్లాండ్ - భారత్ జట్ల మధ్య తొలి టెస్టు మూడో రోజు ఆట కాస్త ముందుగానే ముగిసింది. వర్షం కారణంగా అంపైర్లు ఆటను కొన్ని ఓవర్లు మిగిలి ఉండగానే నిలివేశారు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో టీమ్​ఇండియా రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (47 బ్యాటింగ్; 75 బంతుల్లో 7 ఫోర్లు), శుభ్‌మన్‌ గిల్ (6 బ్యాటింగ్; 10 బంతుల్లో 1ఫోర్) ఉన్నారు.

తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) తొందరగానే పెవిలియన్​కు చేరాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్‌ (30; 48 బంతుల్లో 4ఫోర్లు) మాత్రం ఈ సారి ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం భారత్ 96 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 465 పరుగులు చేసింది.

అయితే తొలి ఇన్నింగ్స్‌లో 209/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్‌, భారత్‌ స్కోరుకు కేవలం ఆరు పరుగుల దూరంలో నిలిచింది. రెండో రోజు సెంచరీ హీరో ఓలీ పోప్ (106; 137 బంతుల్లో 14 ఫోర్లు) ఆట మొదలైన కాసేపటికే పెవిలియన్​కు చేరాడు. ఆ తర్వాత హ్యారీ బ్రూక్ (99; 112 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్క పరుగుతో సెంచరీ మిస్ చేసుకున్నాడు.

సెంచరీ ముందు ప్రసిద్ధ్‌ కృష్ణ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్‌ లెగ్‌లో శార్దూల్ ఠాకూర్‌కు చిక్కాడు. జేమీ స్మిత్ (40; 52 బంతుల్లో 3 ఫోర్లు), క్రిస్‌ వోక్స్ (38; 55 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. బెన్‌ స్టోక్స్ (20), బ్రైడన్ కార్స్ (22), జోష్ టంగ్ (11) పరుగులు సాధించారు. భారత బౌలర్లలో బుమ్రా (5/83), ప్రసిద్ధ్‌ కృష్ణ 3, సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు.

Last Updated : June 22, 2025 at 11:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.