IND vs BAN Test Series 2024: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు కోసం ప్రకటించిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీకి చోటు దక్కలేదు. సీనియర్ అయిన షమీని కాదని సెలక్టర్లు ఈ ప్లేయర్లవైపు మొగ్గు చూపకుండా కొత్త కుర్రాడు దయాళ్‌కు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న జస్ర్పీత్ బుమ్రాను మాత్రం ఎంపిక చేశారు. అయితే అతడికి విశ్రాంతి టైమ్ కొనసాగించి, గాయం నుంచి కోలుకున్న షమీని తీసుకుంటారని చాలామంది భావించారు. కానీ, అలా జరగలేదు.
కారణం అదేనా?
2023 వరల్డ్‌కప్ తర్వాత షమీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకొని కొన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ కూడా ప్రారభించాడు. ఈ క్రమంలోనే బంగ్లాతో టెస్టు సిరీస్‌కు షమీని పరిగణలోకి తీసుకుంటామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఓ సందర్భంలో చెప్పాడు. దీంతో షమీ ఎంట్రీ ఖాయమని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే ప్రస్తుతం టీమ్ఇండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలంటే డొమెస్టిక్‌లో ఆడాలన్న రూల్ ఉంది. కానీ, షమీ దులీప్ ట్రోఫీలో ఆడడం లేదు. ఇక అక్టోబర్‌లో రంజీ ప్రారంభం కానుంది. అందులో ఆడతానని షమీ చెప్పాడు. దీంతో అక్కడ నిరూపించుకొని సెలక్టర్ల దృష్టిలో పడాలని అనుకున్నట్లు ఉన్నాడు.
ఇక బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు. ఇక బీసీసీఐ అతడిని పూర్తిగా పక్కన పెట్టేస్తుందని ఊహించారు. కానీ, దూలీప్ ట్రోఫీలో ఓ జట్టుకు కెప్టెన్‌గా అవకాశం ఇచ్చింది. దీంతో అయ్యర్ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడని భావించారు. కానీ, బంగ్లాతో తొలి టెస్టుకు మాత్రం అయ్యర్‌ను దూరం పెట్టారు. అయితే టెస్టు ఫార్మాట్లో అయ్యర్ నిలకడగా ఆడలేడు అన్న వాదన వినిపిస్తుంటుంది. తాజాగా దులీప్ ట్రోఫీలోను తొలి మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 9 పరుగులకే ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 54 పరుగులతో రాణించాడు. అంతకుముందు బుచ్చిబాబు ట్రోఫీలోనూ పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇక తర్వాత మ్యాచ్‌లో ఆకట్టుకుంటే రెండో టెస్టుకు ఎంపికయ్యే ఛాన్స్ ఉంది.
బంగ్లాతో తొలి టెస్టుకు భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.
దులీప్ ట్రోఫీలో ఇండియా C బోణీ- 7 వికెట్లతో సత్తా చాటిన మానవ్ సుతార్ - Duleep Trophy 2024