ETV Bharat / sports

8ఏళ్ల తర్వాత ఛాంపియన్స్‌ ట్రోఫీ- ఫేవరెట్​గా భారత్- ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయంటే? - ICC CHAMPIONS TROPHY 2025

1996 తర్వాత పాకిస్థాన్​ ఆతిథ్యంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ - 8 జట్ల విజయావకాశాలు ఎలా ఉన్నాయంటే?

ICC Champions Trophy 2025
ICC Champions Trophy 2025 (Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 16, 2025, 10:13 PM IST

ICC Champions Trophy 2025 : 8 ఏళ్ల విరామం తర్వాత ఈ నెల 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగనుంది. టైటిల్‌ కోసం 8 జట్లు పోటీపడుతున్నాయి. 1996 తర్వాత ఈ టోర్నీకి తొలిసారి పాకిస్థాన్​ జట్టు ఆతిథ్యమిస్తోంది. భారత్‌ ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌ వేదికగా జరగనున్నాయి. ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఏ జట్టు విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో చూద్దాం.

ఈ నెల 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో టైటిల్‌ కోసం మొత్తం 8 జట్లు పోటీపడుతున్నాయి. గ్రూప్‌-ఏలో భారత్‌, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ ఉండగా, గ్రూప్‌ బిలో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్​, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రియా తలపడనున్నాయి. గ్రూప్‌ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు నాకౌట్‌ దశకు అర్హత సాధిస్తాయి.

గ్రూప్​ Aలో ఇలా

  • భారత్ : ఛాంపియన్స్‌ ట్రోఫీ మొదలైన దగ్గర నుంచి భారత జట్టు నాలుగు సార్లు టోర్నీ ఫైనల్‌కు చేరుకుంది. రెండు సార్లు టైటిల్‌ నెగ్గింది. చివరిసారిగా 2013లో మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని భారత జట్టు ఛాంపియన్స్‌ ట్రోఫీలో విజేతగా నిలిచింది. 2017లో రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో జగజ్జేతగా నిలిచిన టీమ్ఇండియా అదే జోరులో ఛాంపియన్స్‌ ట్రోఫీని కూడా దక్కించుకోవాలని కోరుకుంటోంది. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.
  • ఈ టోర్నీకి ముందు సీనియర్‌ క్రికెటర్లు రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లీ గాడిలో పడటం కలిసి వచ్చే అంశం. మరోవైపు ఛాంపియన్స్‌ ట్రోఫీని మూడుసార్లు నెగ్గిన జట్టుగా చరిత్ర సృష్టించాలని భారత జట్టు కోరుకుంటోంది. అయితే సీనియర్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా లేని లోటు టీమ్ఇండియాను ఆందోళనకు గురి చేస్తోంది. మరో సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ పునరాగమనం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
  • పాకిస్థాన్ : ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఈ టోర్నీ ఆరంభానికి ముందు ఆ జట్టు గోల్డెన్‌ పిరియడ్‌లో ఉంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై సిరీస్‌ విజయాలతో పాక్​ జట్టు జోరుమీదుంది. మహమ్మద్‌ రిజ్వాన్‌ కెప్టెన్సీ ఆకట్టుకుంటుండగా, పాక్‌ పేస్‌ బౌలింగ్‌ విభాగం బలంగా ఉంది. బ్యాటింగ్‌లోనూ మంచి ఫామ్‌లో ఉన్న టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ సాయిమ్ అయూబ్ లేకపోవడమే ఆ జట్టుకు ప్రతికూలాంశం.
  • బంగ్లాదేశ్‌ : 2023 ప్రపంచకప్‌ తర్వాత వన్డేల్లో బంగ్లాదేశ్‌ పెర్ఫామెన్స్​ ఏమంత ఆశాజనకంగా లేదు. 12 మ్యాచుల్లో కేవలం నాలుగింటిని మాత్రమే నెగ్గింది. షాకిబ్‌ గైర్హాజరీలో బంగ్లా స్పిన్‌ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. కానీ పేస్‌ బౌలింగ్‌తో పాటు, బ్యాటింగ్‌ మిడిల్‌ఆర్డర్‌లో బలంగా ఉండటం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం.
  • న్యూజిలాండ్ : ఛాంపియన్స్‌ ట్రోఫీలో డార్క్‌ హార్సెస్‌గా బరిలో ఉన్న న్యూజిలాండ్‌ ఒకసారి ఈ టైటిల్‌ నెగ్గింది. 2009లో రన్నరప్‌గా నిలిచింది. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్‌ జట్టు టైటిల్‌ రేసులో ఉంది.

గ్రూప్‌- Bలో ఇలా

  • ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా జట్టు 2006, 2009లో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ నెగ్గింది. ప్రస్తుతం వన్డేల్లో ఆ జట్టు వరల్డ్‌ ఛాంపియన్‌గా ఉంది. గత మూడు ఐసీసీ టోర్నీల్లో రెండింటిలో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియాను కొన్ని సమస్యలు వేధిస్తున్నాయి. ప్రస్తుతం ఆసీస్‌ పేస్‌ బౌలింగ్‌ అంత మెరుగ్గా లేదు. గతంలోలాగా సత్తా చాటడం ఆస్ట్రేలియాకు కొంచెం కష్టమే.
  • ఇంగ్లాండ్ : ఇంగ్లాండ్‌ పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆ జట్టు వైట్‌వాష్‌కు గురైంది. పవర్‌ప్లే ఓవర్లలో ఇంగ్లాండ్‌ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నా, సరైన అనుభవం లేక మిడిల్‌ ఆర్డర్‌లో చేతులెత్తేస్తున్నారు. జట్టులో సమతుల్యం కనిపిస్తున్నా ప్రణాళికలను అమలు చేయడంలో ఆ జట్టు విఫలమవుతోంది.
  • సౌతాఫ్రికా : ఛాంపియన్స్‌ ట్రోఫీ మొదటి ఎడిషన్‌లో విజేతగా నిలిచిన సౌతాఫ్రికా జట్టు అప్పటి నుంచి రెండో టైటిల్‌ కోసం ఎదురు చూస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్‌, 2024 టీ20 ప్రపంచకప్‌లలో సఫారీల పెర్ఫామెన్స్​ బాగుంది. అయితే ఒత్తిడికి గురై మ్యాచ్‌లను కోల్పోయే సమస్య ఆ జట్టును ఎప్పటి నుంచో వేధిస్తోంది.
  • అఫ్గానిస్థాన్ : అఫ్గాన్​ ఇటీవల కాలంలో మంచి జట్టుగా ఎదుగుతోంది. గత ఏడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌ వరకు చేరుకుంది. రెండో ఇన్నింగ్స్‌ల్లో అఫ్గాన్‌ బ్యాటర్లకు మెరుగైన రికార్డులు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌ల్లో మాత్రం వారు ఇబ్బంది పడుతున్నారు. కొందరు ఆల్‌రౌండర్ల కారణంగా బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో డెప్త్‌ ఉండటం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం.

విన్నర్​కు రూ. 20.8 కోట్లు, రన్నరప్​కు రూ. 10.4 కోట్లు - ఛాంపియన్స్ ట్రోఫీ భారీ నజరానా!

ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్​ - జైస్వాల్ ప్లేస్​లో మరో స్టార్ - తుది జట్టులో కీలక మార్పులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.