ETV Bharat / sports

నాకు టీమ్​ లీడర్​గా ఉండడం ఇష్టం: శ్రేయస్ అయ్యర్​ - SHREYAS IYER CAPTAINCY

శ్రేయస్ సారథ్యం వహించిన టీమ్స్ అన్నీ ఫైనల్​కు- ఆ అనుభూతిని ఆస్వాదిస్తాని వ్యాఖ్య

Shreyas Iyer
Shreyas Iyer (AFP)
author img

By ETV Bharat Sports Team

Published : June 11, 2025 at 12:25 PM IST

1 Min Read

Shreyas Iyer Captaincy : ఏ జట్టుకైనా నాయకత్వం వహించడం తనకెంతో ఇష్టమని పంజాబ్​ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్​ అయ్యర్​ అన్నాడు. టీమ్​ను లీడ్​ చేయడం వల్ల తనలోని అత్యుత్తమ ప్రతిభ బయటకు వస్తుందని శ్రేయస్​ తెలిపాడు. అతడి కెప్టెన్సీలో సోబో ముంబయి ఫాల్కన్స్ టీమ్ టీ20 ముంబయి లీగ్​ ఫైనల్​కు చేరుకుంది. గత సంవత్సరం శ్రేయస్ కెప్టెన్సీ వహించిన అన్ని టీమ్స్ ఫైనల్​కు చేరుకోవడం విశేషం.

రంజీ ట్రోఫీ, ఐపీఎల్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అన్ని లీగ్స్​లోనూ శ్రేయస్ నాయకత్వం వహించిన జట్లు ఫైనల్​కు చేరుకున్నాయి. ఐపీఎల్​ గత సీజన్​లో కోల్​కతా నైట్​రైడర్స్​కు కెప్టెన్​గా ట్రోఫీ అందించాడు. ఈ ఏడాది సీజన్​ పంజాబ్​ కింగ్స్​ను రన్నరప్​గా నిలిపాడు. 22 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుంచి సారథిగా వ్యవహరిస్తున్నందున తనకు మంచి అనుభవం ఉందని భావిస్తున్నట్లు తెలిపాడు. ఆ అనుభూతిని ఆస్వాదిస్తానని చెప్పాడు.

శ్రేయస్ అయ్యర్​ తన జట్లను ఫైనల్స్​కు తీసుకెళ్లిన తీరు చూస్తుంటే అతడిలో దాగి ఉన్న ప్రతిభ కనిపిస్తుంది. గత ఐపీఎల్​ 2024లో కోల్​కతా నైట్​ రైడర్స్ విజయంతో ఆయన హిట్ ట్రాక్​ మొదలైంది. శ్రేయాస్​ తన నాయకత్వంతో ముంబయి టీమ్​ను సయ్యద్​ ముష్తాక్​ అలీ ట్రోఫీ, పంజాబ్​ కింగ్స్​ను ఐపీఎల్​ ఫైనల్​కు తీసుకెళ్లాడు.

ఆ రికార్డ్ సాధించిన తొలి కెప్టెన్​ శ్రేయస్! టైటిల్‌ లక్ష్యంగా పరుగులు!

'సర్పంచ్ సాబ్ ఈసారి గెలిపించు- పంజాబ్​లో రోడ్డుకు నీ పేరు పెట్టేస్తా!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.