ETV Bharat / sports

IPLలో మ్యాచ్​ ఫిక్సింగ్​? ప్లేయర్లకు హైదరాబాద్​ వ్యాపారవేత్త ఖరీదైన గిఫ్ట్​లు! ఫ్రాంచైజీలకు BCCI వార్నింగ్! - BCCI WARNING TO IPL TEAMS

ఐపీఎల్​లో మ్యాచ్​ ఫిక్సింగ్​ ఆందోళన! ప్లేయర్లు, కోచ్​లను ప్రలోభపెడుతున్న హైదరాబాద్​కు చెందిన వ్యాపార్తవేత్త- అన్ని టీమ్​లకు వార్నింగ్ ఇచ్చిన బీసీసీఐ

BCCI WARNING TO IPL TEAMS
BCCI WARNING TO IPL TEAMS (ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : April 16, 2025 at 4:40 PM IST

Updated : April 16, 2025 at 5:23 PM IST

2 Min Read

BCCI Warning to IPL Teams : ఇండియన్ ప్రీమియల్​ లీగ్​-ఐపీఎల్​కు ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. ప్రపంచ క్రికెట్​లో ఈ పొట్టి ఫార్మాట్​ లీగ్​కు ప్రత్యేక స్థానం ఉంది. ఏడాది కొకసారి ఈ లీగ్ జరుగుతున్న సమయంలో భారత్​తో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు దీని గురించే మాట్లాడుకుంటారు. ఐపీఎల్ సీజన్​లో క్రికెట్​ను ఎంజాయ్​ చేసేవారు ఉన్నట్లే, లీగ్ వచ్చిందంటే బెట్టింగ్ మాఫియా కూడా రెచ్చిపోతుంది. అప్పుడప్పుడు ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఓ సంచలన వార్త క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఐపీఎల్​ సీజన్​లో ఫిక్సింగ్​కు ప్రయత్నాలు జరుగుతున్నట్లు బయటపడింది. దీంతో అప్రమత్తమైన బోర్డ్​ ఆఫ్​​ కంట్రోల్ క్రికెట్ ఇన్ ఇండియా- బీసీసీఐ, ఐపీఎల్​లోని 10 ఫ్రాంచైజీలకు వార్నింగ్​ నోటీసులు ఇచ్చింది.

హైదరాబాద్​ బిజినెస్​మ్యాన్
హైదరాబాద్​కు చెందిన ఓ బిజినెస్​మ్యాన్ జట్ల ఆటగాళ్లు, కోచ్​లు, సపోర్ట్​ స్టాఫ్​​, కామెంటేటర్లనూ వదలకుండా ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు బీసీసీఐకి చెందిన యాంటీ కరప్షన్ సెక్యూరిటీ యూనిట్- ACSUకి సమాచారం అందింది. పుంటెర్స్, బుకీలతో అతడికి సంబంధం ఉన్నట్లు తెలిసింది. అతడు ఇప్పటికే పలు అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు రికార్డులు ఉన్నాయని సమాచారం అందింది. అలాంటి వ్యక్తి ఐపీఎల్​ టీమ్​లతో సంబంధం ఉన్న వ్యక్తులను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎసీఎస్​యూకు తెలిపింది. వ్యాపారవేత్తతో ఏవైనా సంభాషణలు జరిపితే తమకు నివేదించాలని ACSU కోరుంది. జాగ్రత్తగా ఉండాలని ఐపీఎల్ భాగస్వాములకు సూచించింది.

ఖరీదైన గిఫ్ట్​లతో బుట్టలో వేస్తాడు!
ఆ వ్యాపారవేత్త ఖరీదైన గిఫ్ట్​లు, ఆభరణాలతో బుట్టలో పడేస్తాడని ఏసీఎస్​యూ తెలిపింది. కాగా, ఇప్పటికే ఆ వ్యాపారవేత్త కొంతమంది ప్లేయర్లకు, కోచ్​లను కలిసి ఖరీదైన గిఫ్ట్​లు ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. అభిమానిని అని చెప్పుకుంటూ ఆటగాళ్లు బస చేస్తోన్న హోటల్స్​కు వెళ్తాడని తెలిసింది. ఇప్పటికే అలా కొంతమందిని కలిశాడని, వారిని ప్రైవేటు పార్టీలకు కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఆటగాళ్ల కుటుంబాలను కూడా కలిసి ఖరీదైన బహుమతులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో ట్రాప్!
సదరు వ్యాపారవేత్త- ప్లేయర్లు, కోచ్‌లకు ఉన్న బంధువులను సోషల్ మీడియా ద్వారా కూడా సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అందుకే సామాజిక మాధ్యమాల్లో కూడా ఎవరైన వ్యక్తి సంప్రదిస్తే- జాగ్రత్తగా ఉండాలని, వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని బీసీసీఐ కోరింది. ఇలాంటి ఆన్​లైన్ కాంటాక్ట్స్‌ ఫిక్సింగ్‌కు దారితీసే అవకాశం ఉందని ACSU కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఐపీఎల్​ వేళ బెట్టింగ్ దందాలు - ఒక్కసారి దిగారంటే ఊబిలో చిక్కుకుపోయినట్లే!

ఐపీఎల్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్ - రూ. 43లక్షల సొమ్ము స్వాధీనం

Last Updated : April 16, 2025 at 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.