Google 2024 Search Trends Sports Events : భారతీయులకు క్రీడల మీద ప్రత్యేక ఆసక్తి ఉంటుందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్రికెట్ విషయానికొస్తే అభిమానులు టీవీలకు అతుక్కుపోతుంటారు. లేదంటే స్మార్ట్ ఫోన్లలో క్రికెట్ అప్డేట్స్ను ఫాలో అవుతుంటారు. తమకు నచ్చిన మ్యాచ్ గురించో, లేదంటే ఇతర క్రీడల గురించో చకచకగా వెతికేసి స్కోర్లను తెలుసుకుంటుంటారు.
అలా, 2024లో 'స్పోర్ట్స్ ఈవెంట్ల'లో మన భారతీయులు ఎక్కువగా దేని గురించి వెతికారో మీకు తెలుసా? తాజాగా దానిపై గూగుల్ ఓ జాబితాను విడుదల చేసింది. ఇందులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఇంకా గూగుల్ ఓవరాల్ జాబితాలోనూ ఐపీఎల్‌దే అగ్ర స్థానం.
ఇంకా దీంతో పాటే టీ 20 ప్రపంచ కప్, ఒలింపిక్స్, ఇండియన్ సూపర్ లీగ్, ప్రోకబడ్డీ లీగ్, కోపా అమెరికా, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, యూఈఎఫ్‌ఏ యూరో, దులీప్ ట్రోఫీ, అండర్-19 ప్రపంచ కప్ ఈవెంట్ల గురించి కూడా ఎక్కువగా వెతికేశారు.
ఇక కేవలం క్రికెట్ మ్యాచ్‌ల విషయానికొస్తే 'ఇండియా vs బంగ్లాదేశ్', 'ఇండియా Vs జింబాబ్వే', 'శ్రీలంక vs ఇండియా', 'ఇండియా vs అఫ్గానిస్థాన్', 'ఇండియా vs దక్షిణాఫ్రికా', ‘'ఇండియా vs పాకిస్థాన్', 'పాకిస్థాన్ vs ఇంగ్లాండ్',‘ 'రాయల్ ఛాలెంజర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్', 'చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్' మ్యాచ్‌ల గురించి ఎక్కువగా వెతికారట.
గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ 2024 - టాప్లో పవన్ కల్యాణ్, IPL!
ఒకే ఫ్యామిలీ నుంచి నలుగురు ఇంటర్నేషనల్ స్టార్స్! - బరిలోకి దిగనున్న సామ్ సోదరుడు