స్మిత్, బ్రూక్ సెంచరీల మోత- 14ఏళ్లలో రేర్ రికార్డ్- ఇంగ్లాండ్ స్ట్రాంగ్ రిప్లై
ఇంగ్లాండ్ ధీటైన జవాబు- సెంచరీలతో అదరగొట్టిన బ్రూక్, స్మిత్

Published : July 4, 2025 at 8:57 PM IST
Ind vs Eng 2nd Test 2025 : ఎడ్జ్‌బాస్టన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఇంగ్లాండ్ ధీటుగా బదులిస్తోంది. మూడో రోజు టీ బ్రేక్ సమయానికి 355-5తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. యంగ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్ (140), జేమీ స్మిత్ (157) క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటు స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలోనే సెంచరీల కూడా పూర్తి చేసుకున్నారు. దీంతో స్మిత్, బ్రూక్ అరుదైన రికార్డులు సాధించారు.
మూడో బ్యాటర్‌గా రికార్డ్ : 24ఏళ్ల స్మిత్ ఈ మ్యాచ్‌లో అదిరే ఘనత సాధించాడు. స్టోక్స్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన స్మిత్ దూకుడుగా ఆడాడు. ఎడాపెడా బౌండరీలతో టీమ్ఇండియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 80 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. ఇందులో 17 ఫోర్లు ఉండడం విశేషం. ఈ క్రమంలోనే టెస్టు క్రికెట్ హిస్టరీలో ఇంగ్లాండ్ తరఫున వేగవంతమైన శతకం బాదిన మూడో బ్యాటర్‌గా రికార్డ్ కొట్టాడు. ఈ లిస్ట్‌లో గిల్బెర్ట్ జెసిప్ (76 బంతుల్లో), జానీ బెయిర్ స్టో (77 బంతుల్లో) సెంచరీలు నమోదు చేశారు.
Delivering on his incredible talent! 😍
— England Cricket (@englandcricket) July 4, 2025
Sensational from Jamie Smith! 🙌@IGcom | 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/jJoCMGn89O
అలాగే ఇంగ్లాండ్ వికెట్ కీపర్ భారత్‌పై టెస్టుల్లో సెంచరీ చేయడం గత 14ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. 14ఏళ్ల తర్వాత టీమ్ఇండియాపై సెంచరీ బాదిన బ్యాటర్‌గా కీపర్ స్మిత్ ఘనత సాధించాడు. చివరిసారిగా భారత్‌పై 2011లో లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్ మ్యాట్ ప్రియర్ (103 పరుగులు) సెంచరీ నమోదు చేశాడు.

బ్రూక్ ఈ రికార్డులు : స్మిత్ మాత్రమే కాదు ఈ ఇన్నింగ్స్‌లో బ్రూక్ సైతం సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అతడు కూడా సెంచరీ బాదాడు. తన కెరీర్లో ఇది అతడికి తొమ్మిదో శతకం నమోదు చేశాడు. ఈ క్రమంలోనే బ్రూక్ టెస్టుల్లో 2500 పరుగులు పూర్తి చేసుకన్నాడు. 44 ఇన్నింగ్స్‌ల్లో బ్రూక్ 2832 బంతుల్లోనే ఈ మైలురాయి అందుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ తరపున అత్యంత వేగంగా (బంతుల పరంగా) 2500 టెస్టు పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డ్ కొట్టాడు.
అలాగే ఇంగ్లాండ్ తరఫున అత్యంత వేగంగా 9 సెంచరీలు బాదిన మూడో బ్యాటర్‌గానూ నిలిచాడు. బ్రూక్ 44 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ లిస్ట్‌లో బ్రూక్ కంటే ముందు డెనిస్ కామ్ప్టన్ (37), సట్‌క్లిఫ్ (43) ఉన్నారు.

84-5 నుంచి 355-5కు : ఓవర్‌నైట్ స్కోర్ 77-3తో మూడో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ తొలుత తడబడింది. తొలి సెషన్లో ఒకే ఓవర్లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. సిరాజ్ సంధించిన 22వ ఓవర్లో మూడో బంతికి సీనియర్ బ్యాటర్ జో రూట్ (22) క్యాచౌట్ కాగా, ఆ తర్వాత బంతికే కెప్టెన్ బెన్ స్టోక్స్ (0) పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లాండ్ 84-5తో పీకల్లోతు కష్టాల్లో పడింది.
Sailing past the 200 partnership ⛵️
— England Cricket (@englandcricket) July 4, 2025
Both on hundreds. Both scoring at a rapid pace. What a partnership 🤝 pic.twitter.com/6R53eNQnlx
ఈ దశలో స్మిత్‌తో కలిసి బ్రూక్ అద్భుత భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ ఇద్దరూ టీ బ్రేక్ సమయానికి 271* పార్ట్నర్షిప్ నమోదు చేశారు. ఈ క్రమంలో స్మిత్ 144 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేశాడు. ఈ జోడీని విడగొట్టకుంటే ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేయడం ఖాయం!
" a real talent!" 👌
— England Cricket (@englandcricket) July 4, 2025
test century number nine for @Harry_Brook_88! 🏏@IGcom | 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/mFBnrH8w5x
'మేం గ్రౌండ్లో పెరిగిన గడ్డి చూసేందుకు రాలేదు- ఆట మధ్యలో ఆ తమాషా ఏంటి?'
భారత్ 587 పరుగులు చేసినా ఇంగ్లాండ్ గెలుస్తుందా? గత గణాంకాలు ఏం చెబుతున్నాయి?

