PSL Hair Dryer: పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ జేమ్స్ వీన్స్‌కు వింత అనుభవం ఎదురైంది. ప్రత్యర్థిపై సెంచరీ సాధించి జట్టను గెలిపించిన వీన్స్‌కు ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా అతడికి ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ హెయిర్ డ్రయర్ బహుమతిగా ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో పీఎల్ఎల్పై ట్రోల్స్ షురూ అయ్యాయి. ఇంత దానికి ఇంకా ఐపీఎల్‌తో పోల్చుకోవడం ఎందుకని? నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.
ఇదీ జరిగింది
పీఎస్ఎల్ 2025లో భాగంగా రీసెంట్గా ముల్తాన్ సుల్తాన్- కరాచీ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముల్తాన్ నిర్దేశించిన 235 పరుగుల లక్ష్యాన్ని కరాచీ 19.2 ఓవర్లలోనే ఛేదించి 4 వికెట్ల తేడాతో నెగ్గింది. ఛేదనలో కరాచీ ప్లేయర్ వీన్స్ (43 బంతుల్లోనే 101 పరుగులు) సూపర్ సెంచరీతో అదరగొట్టారు. దీంతో అతడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
అయితే మ్యాచ్ అనంతరం వీన్స్ సెంచరీ ప్రదర్శనను మేనేజ్మెంట్ ప్రశంసించింది. డ్రెస్సింగ్ రూమ్‌లో వీన్స్‌కు 'మోస్ట్ రిలయబుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అనే పేరుతో హెయిర్ డ్రయర్ గిఫ్ట్‌గా ఇచ్చింది. దీంతో వీన్స్ షాకయ్యాడు. అతడి సహచర ఆటగాళ్లంతా ఒక్ససారిగా నవ్వుకున్నారు. ఈ వీడియోను స్వయంగా కరాచీ ఫ్రాంచైజీ తమ అఫీషియల్ సోషల్ మీడియాలో అకౌంట్లో షేర్ చేసింది.
James Vince turned up the heat and rightly earned the Hair Dryer for his game-changing PSL performance!🤗😛
— अघोरी 👹 (@anghori_29) April 14, 2025
इससे अच्छा तो हमारी कॉलेज टूर्नामेंट में प्राइज मिल जाता 🤣🤣🤣🤣#PSL2025 #HBLPSL #jamesvince pic.twitter.com/pENaMYsjS8
ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు పీఎస్ఎల్ను ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. 'వర్షం వల్ల పిచ్ తడిసిపోతే, ఆ డ్రయర్‌తో ఆరబెట్టండి', 'నెక్ట్స్ వాటర్ బాటిల్ ఇవ్వండి', 'ప్లేయర్లకు గిఫ్ట్‌లు ఇవ్వలేరు కానీ ఐపీఎల్లో పోలికా?', 'స్కూళ్లో చిన్న పిల్లలకు ఆటల్లో గెలిస్తే అంతకంటే మంచి గిఫ్ట్ ఇస్తారు' అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
James Vince is the Dawlance Reliable Player of the Match for his game-changing performance against the Multan Sultans! 💙❤️#YehHaiKarachi | #KingsSquad | #KarachiKings pic.twitter.com/PH2U9FQl5a
— Karachi Kings (@KarachiKingsARY) April 13, 2025
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీకి బైక్?
అంతేకాకుండా మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో ఓ బైక్‌ను గిఫ్ట్ స్పాట్లో ఉంచారు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన ప్లేయర్‌కు బైక్ ఇస్తారేమో అంటూ చర్చజరుగుతుంది. అలాగే ఈ టోర్నీకి ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. స్డేడియాలు దాదాపు సగం ఖాళీగానే ఉంటున్నాయి.
Just to add -
— Sandeep Parkhi (@sparkhi) April 13, 2025
Player of the match gets hair dryer and Man of the series gets a bike in PSL. Stadiums in Karachi and Pindi were almost empty. 😂😂😂 https://t.co/K0zgFicOdH pic.twitter.com/aJGqfsPIk8
ముంబయి ఇండియన్స్ ప్లేయర్‌కు బిగ్ షాక్- లీగ్ నుంచి ఏడాది బ్యాన్!
ఒకేసారి ఐపీఎల్, పీఎస్ఎల్ - ఆ సమస్యలు తప్పవా? - IPL PSL Clash