ETV Bharat / sports

ధోనీ రోజుకు 5 లీటర్ల పాలు తాగుతాడా?- ఇది నిజమేనా బ్రో - IPL 2025

ధోనీ రోజుకు 5 లీటర్ల పాలు తాగుతాడా?- ఇదిగో క్లారిటీ

Dhoni Drink Milk Per Day
Dhoni Drink Milk Per Day (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : April 22, 2025 at 7:47 PM IST

Updated : April 22, 2025 at 8:09 PM IST

1 Min Read

Dhoni Drink Milk Per Day : క్రికెటర్లు, సెలబ్రిటీలపై రూమర్స్ రావడం​ మామూలు విషయమే. తమపై వచ్చే పుకార్లపై ఏదో సందర్భంలో సెలబ్రిటీలు స్పందించి క్లారిటీ ఇస్తుంటారు. అయితే గతంలో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ మహేంద్రసింగ్ ధోనీపై కూడా చాలా రూమర్స్ వచ్చాయి. తనపై వచ్చిన ఓ ఫన్నీ రూమర్​పై ధోనీ తాజాగా స్పందించాడు.

ధోనీ రీసెంట్​గా సీఎస్కే ఈవెంట్​లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్​లో హోస్ట్ అడిగిన పలు ప్రశ్నలకు ధోనీ సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలోనే తనపై వచ్చిన రూమర్స్​లో ఫన్నీగా అనిపించింది ఏంటని అడగ్గా, ధోనీ ఆన్సర్ ఇచ్చాడు. రోజుకు 5 లీటర్ల పాలు తాగుతానని తనపై వచ్చిన రూమర్ చాలా ఫన్నీగా అనిపించిందని తెలిపాడు.

'రోజుకు 5 లీటర్ల పాలు తాగుతానని నాపై వచ్చిన రూమర్ సరదాగా అనిపించింది. నేను రోజుకు ఎక్కువలో ఎక్కువ ఒక లీటర్ పాలు తాగుతానేమో. ఇంకా నాలుగు లీటర్లు తాగాలంటే ఎవరికైనా అసాధ్యమే' అని ధోనీ పేర్కొన్నాడు. అయితే ఈ రూమర్ 2005లో వచ్చిందని చెప్పాడు.

కాగా, ప్రస్తతం ఐపీఎల్​లో ధోనీ చెన్నై జట్టుకు కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు. సీఎస్కే వరుస ఓటములతో సతమతమౌతోంది. ఇప్పటివరకు చెన్నై 8 మ్యాచ్​ల్లో కేవలం రెండే విజయాలు నమోదు చేసింది. ప్లేఆఫ్స్​కు చేరాలంటే ఇకపై ఆడే అన్ని మ్యాచ్​ల్లోనూ నెగ్గాల్సిందే! అంతేకాకుండా నెట్​ రన్​రేట్ కూడా మైనస్​లో ఉండడం వల్ల చెన్నైకు ఒకట్రెండు భారీ విజయాలు కావాలి. ఇక సీఎస్కే తమ తదుపరి మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 25న చెపాక్​లో జరగనుంది.

Last Updated : April 22, 2025 at 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.