Michael Hussey On CSK : ఐపీఎల్ చరిత్రలో రెండే జట్లు ఐదేసి టైటిళ్లు గెలిచాయి. అందులో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. అయితే ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో సీఎస్కే ప్రదర్శన అంత బాగోలేదు. మొదటి మ్యాచ్ మినహా ఆ తర్వాత ఒక్కదాంట్లోను గెలుపొందలేదు. సీఎస్కే వరుసగా ఐదోసారి ఓడిపోయినప్పటికీ, బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ జట్టుకు మద్దతుగా నిలిచాడు. ఛాంపియన్లుగా నిలిచిన జట్టులో 'సరైన ఆటగాళ్లు' ఉన్నారన్నాడు. ఇప్పటికీ వాళ్లు ఓటమిని ఒప్పుకోలేదని చెప్పాడు.
'డిఫరెంట్‌గా ఆడమని చెప్పను'
"మన దగ్గర సరైన ఆటగాళ్లు ఉన్నారని నేను ఇప్పటికీ అనుకుంటున్నాను. కొంత ఆత్మవిశ్వాసం, స్థిరత్వం కనుగొనడంలో ప్లేయర్లకు మేము సహాయం చేయాలి. అలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మేము ఎదగగలమని ఆశిస్తున్నాను. ఆటతీరు గురించి చాలా చర్చ జరుగుతోంది. ప్లేయర్లు సహజమైన ఆట ఆడుతున్నారు. వారిని పూర్తిగా భిన్నమైన రీతిలో ఆడమని మేము ఆడగాలనుకోవడం లేదు. ప్లేయర్లు తమదైన రీతిలో బాగా ఆడటం వల్లే ఐపీఎల్‌లోకి వచ్చారు. నేను కచ్చితంగా వారు వేరే విధంగా ఆడేలా ప్రయత్నించే వ్యక్తిని కాదు. వారు ఆడే విధానం అలాగే ఉంది కాబట్టి, వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నారు" అని హస్సీ మ్యాచ్ తర్వాత మీడియాతో అన్నారు.
'ఇప్పుడే వాళ్లు ఎక్కువ ఆడుతున్నారు'
సీఎస్కే యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం లేదని, ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లను కలిగిఉందనే మాటలను హస్సీ తోసిపుచ్చారు. అయితే సీఎస్కే మిడిల్ ఆర్డర్లో ప్లేయర్లు రాహుల్ త్రిపాఠి, శివం దుబే, విజయ్ శంకర్, దీపక్ హుడా ఈ సీజన్‌లో సమష్టిగా విఫలమయ్యారు. అయితే జట్టులోని కొంతమంది ప్లేయర్లు వారి ప్రైమ్ టైమ్ కంటే బాగా ఉన్నారని హస్సీ వాదించారు.
"కేరీర్ ముగింపు సమయంలో ఉన్నప్పుడు CSKకి వచ్చి ఆడిన ఆటగాళ్లు ఉన్నారు. అందులో షేన్ వాట్సన్, అజింక్య రహానె వంటి ప్లేయర్లు ఉన్నారు. వారు జట్టుకోసం నిజంగా బాగా రాణించారు. మా దగ్గర ఉన్న ఆటగాళ్లు ముందు ఇంకా మంచి క్రికెట్ భవిష్యత్ ఉంది. వారు మాకు చాలా అందించగలరని నేను ఇప్పటికీ అనుకుంటున్నాను. మనం వారి అత్యుత్తమ ప్రదర్శనలను కనుగొనగలం. వారి నుంచి కొన్ని గొప్ప ప్రదర్శనలను చూడగలం." అని హస్సీ తెలిపారు.
యువకుల విషయానికొస్తే, వారు ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వారిని ఎంచుకోవాలని అనుకుంటున్నట్లు హస్సీ తెలిపారు. అలా అవకాశం కోసం వేచి ఉన్న కొంతమంది మంచి ఆటగాళ్లు తమ దగ్గర చెప్పారు.
"కొన్నిసార్లు జట్లు ఆశలు వదులుకుని 'మనం ఇకపై టోర్నీ గెలవలేము, ఇప్పుడు యువకులతో ప్రయత్నిస్తాము' అని అనుకుంటాయి. కానీ ఇప్పుడ మేము టోర్నమెంట్లో ఉన్నాము. సాధ్యమైనంతవరకు పురోగతి సాధించడానికి ఇక్కడ ఉన్నాము. ఇంకా ఓటమిని ఒప్పుకుని తెల్ల జెండాను ఎగురవేయలేదు" అని మైకెల్ హస్సీ అన్నాడు.
'కెప్టెన్ ఈజ్ బ్యాక్'- ధోనీ సెట్ చేసిన రికార్డ్స్- ఇప్పట్లో ఎవ్వరూ టచ్ చేయలేరు
తలా కమ్‌బ్యాక్ - మళ్లీ CSK కెప్టెన్‌గా ధోనీ - రుతురాజ్‌ను ఎందుకు తీసేశారంటే?