ETV Bharat / sports

CSK ఫ్యాన్స్​కు కిక్ ఇచ్చే న్యూస్- టీమ్​లోకి 'బేబీ ABD'- ధోనీ మాస్టర్ ప్లాన్! - IPL 2025

చెన్నై రిప్లేస్​మెంట్- జట్టులోకి ముంబయి చిచ్చర పిడుగు- మాస్టర్​మైండ్ ధోనీ!

CSK Replacement
CSK Replacement (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : April 18, 2025 at 4:29 PM IST

2 Min Read

CSK Replacement : చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు అదిరే న్యూస్. గాయం కారణంగా టోర్నీకి దూరమైన పేసర్ గుర్జప్​నీత్ సింగ్​కు రిప్లేస్​మెంట్ ప్రకటించింది. అతడి స్థానాన్ని సౌతాఫ్రికా 21 ఏళ్ల యంగ్ బ్యాటర్ డివాల్డ్ బ్రెవిస్ భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. బ్రెవిస్​ను చైన్నై రూ.2.2 కోట్ల ధరకు తీసుకుంది. దీంతో ప్రస్తుత సీజన్​లో మిగిలిన మ్యాచ్​లకు బ్రెవిస్ చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

81 టీ20లు ఆడిన బ్రెవిస్ 1787 పరుగులు చేశాడు. ఇందులో 162 స్కోర్ అత్యధికం. ఇక 2022లో ఐపీఎల్​లో అడుగుపెట్టిన బ్రెవిస్ మూడు సీజన్లలో ముంబయి ఇండియన్స్​కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్​లో మొత్తం 10మ్యాచ్​ఆడిన ఈ యంగ్ డైనమిక్ 230 పరుగులు చేశాడు. టీ 20ల్లో దూకుడుగా ఆడడం బ్రెవిస్ స్పెషాలిటీ. క్రీజులో ఉన్నంతసేపు ధనాధన్ షాట్లతో అలరిస్తుంటాడు. దీంతో ఈ చిచ్చర పిడుగు బ్రెవిస్​కు 'బేబీ ఏబీడీ' అనే పేరు వచ్చింది.

బ్రెవిస్ రాకతో చెన్నై జట్టు బ్యాటింగ్ బలం పెరగనుంది. అటు ఫ్యాన్స్ కూడా హ్యీపీగా ఫీలవుతున్నారు. ఇకపై ఆడనున్న మ్యాచ్​ల్లో అద్భుతంగా రాణించాలని ఆశిస్తున్నారు. అయితే గతేడాది జరిగిన మెగా వేలంలో డివాల్డ్ బ్రెవిస్​ను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు. దీంతో ఈ యంగ్ స్టర్ అన్​సోల్డ్​గా మిగిలిపోయాడు. తాజాగా గుర్జప్​నీత్ సింగ్ గాయంతో దూరం కాగా, బ్రెవిస్​కు మళ్లీ ఐపీఎల్ అడే ఛాన్స్ దక్కింది. అయితే రిప్లేస్​మెంట్​లో బ్రెవిస్​ను తీసుకోవాలన్నది ధోనీ ఆలోచన అని తెలుస్తోంది!

కాగా, చెన్నై తమ తదుపరి మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ను ఢీ కొట్టనుంది. ఆదివారం (ఏప్రిల్ 20) వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్​ జరగనుంది. ప్రస్తుత ఐపీఎల్​లో చెన్నై పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకు 7 మ్యాచ్​లు ఆడగా, అందులో సీఎస్కే రెండే విజయాలు నమోదు చేసింది. ఫలితంగా 4 పాయింట్లతో పట్టికలో అట్టడుగు (10వ స్థానం)లో ఉంది. ఈ సీజన్​లో చెన్నై ఇప్పటికే సగం మ్యాచ్​లు ఆడేసింది. ఇక ప్లే ఆఫ్స్​కు అర్హత సాధించాలంటే ఇకపై ఆడనున్న ఏడు మ్యాచ్​ల్లో కనీసం ఆరింట్లో నెగ్గాల్సిందే!

ఒక్క మ్యాచ్​తోనే 11ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన ధోనీ

లఖ్​నవూపై చెన్నై విజయం- 5 ఓటములు తర్వాత గెలుపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.