India Tour Of Bangladesh 2025 : టీమ్ఇండియా ప్లేయర్లంతా ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్నారు. మరో నెల రోజుల పాటు ఫ్రాంచైజీ లీగ్‌లోనే మన ఆటగాళ్లు ఉర్రూతలూగించనున్నారు. అయితే ఈ టోర్నమెంట్ తర్వాత భారత్ ఆయా దేశాలతో మూడు ఫార్మాట్ల క్రికెట్ ఆడాల్సి ఉంది. ఇందులో భాగంగానే ఆగస్టులో బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ టూర్లో వైట్ బాల్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజాగా ఈ పర్యటన షెడ్యూల్ ప్రకటించింది.
ఈ పర్యటనలో ఆతిథ్య బంగ్లాదేశ్‌తో టీమ్ఇండియా వన్డే, టీ20 సిరీస్‌ల్లో ఆడనుంది. కాగా, ఇరు దేశాల మధ్య సిరీస్ ఆగస్టు 17న ప్రారంభమై 31న ముగియనుంది. ఇందులో మూడు వన్డేలు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ పోటీపడనుంది. అయితే ఇంగ్లాండ్ పర్యటన తర్వాత ఈ సిరీస్‌లకు జట్లను ప్రకటించే అవకాశం ఉంది.
భారత్- బంగ్లాదేశ్ వన్డే షెడ్యూల్
- తొలి వన్డే - ఆగస్టు 17 (మీర్పూర్)
- రెండో వన్డే - ఆగస్టు 20 (మీర్పూర్)
- మూడో వన్డే - ఆగస్టు 23 (చిట్టగాంగ్)
భారత్- బంగ్లాదేశ్ టీ20 షెడ్యూల్
- తొలి టీ20 మ్యాచ్ - ఆగస్టు 26 (చిట్టగాంగ్)
- రెండో టీ20 మ్యాచ్ - 29 ఆగస్టు (మీర్పూర్)
- మూడో టీ20 మ్యాచ్ - ఆగస్టు 31 (మీర్పూర్)
అయితే ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత్ జట్టు ఇంగ్లాండ్ పయనమవ్వనుంది. జూన్‌లో ప్రారంభం కానున్న ఈ పర్యటనలో భారత్ 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ఆగస్టు 4న ముగుస్తుంది. ఈ సిరీస్ తర్వాత టీమ్ఇండియా బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది.
భారత్- ఇంగ్లాండ్ టెస్టు షెడ్యూల్
- తొలి టెస్టు- జూన్ 20 నుంచి 24 వరకు
- రెండో టెస్టు- జులై 02 నుంచి -06 వరకు
- మూడో టెస్టు- జులై 10 నుంచి- 14 వరకు
- నాలుగో టెస్టు- జులై 23 నుంచి- 27 వరకు
- ఐదో టెస్టు- జులై 31 నుంచి- ఆగస్టు 04 వరకు
ఇదే ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో టీమ్ఇండియా వరుసగా వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లతో మూడు ఫార్మట్ల సిరీస్‌లో తలపడనుంది.
హోమ్ సిరీస్‌కు టీమ్ఇండియా రెడీ - షెడ్యూల్ విడుదల చేసిన BCCI - వైజాగ్‌లో మ్యాచ్ ఎప్పుడంటే?