IPL 2025 new schedule : భారత్ - పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్‌ను వాయిదా వేశారు. అయితే మే 17న తిరిగి ప్రారంభించననుట్లు బీసీసీఐ వెల్లడించింది. అందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది.
ఐపీఎల్ 2025లో మిగిలిన 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది బీసీసీఐ. మే 17 నుంచి తిరిగి ప్రారంభం కాగా, మొత్తం ఆరు వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. బెంగళూరు, జైపుర్, దిల్లీ, ముంబయి, లఖ్‌నవూ, అహ్మదాబాద్ వేదికల్లో నిర్వహించనున్నారు. భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరం షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. మే 29 క్వాలిఫయర్ 1, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫయర్ 2, జూన్ 3న ఫైనల్ నిర్వహించనున్నారు. అయితే, ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు వేదికలు ఎక్కడ అనేది ఇంకా ఖరారు చేయలేదు. భారత్-పాక్ ఉద్రిక్తతలు కారణంగా మధ్యలోనే ఆగిన పంజాబ్- దిల్లీ మ్యాచ్ కూడా నిర్వహించనున్నారు. అయితే మొదటి నుంచి నిర్వహిస్తారా? లేకపోతే అప్పటికే పూర్తి చేసిన ఒక ఇన్నింగ్స్ కొనసాగిస్తారా అనేది స్పష్టం చేయలేదు.
BCCI is pleased to announce the resumption of the TATA IPL 2025. A total of 17 matches will be played across 6 venues, starting May 17, and culminating in the final on June 3. The revised schedule includes two double-headers, which will be played on two Sundays. The playoffs are… pic.twitter.com/2QiA3cKhEg
— ANI (@ANI) May 12, 2025
షెడ్యూల్ వివరావలివే
- బెంగళూరు VS కోల్‌కతా : మే 17, శనివారం (బెంగళూరు వేదికగా రాత్రి 7.30గంటలకు)
- రాజస్థాన్ VS పంజాబ్: మే 18, ఆదివారం (జైపుర్ వేదికగా మధ్యాహ్నం 3.30గంటలకు)
- దిల్లీ VS గుజరాత్: మే 18, ఆదివారం (దిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు)
- లఖ్‌నవూ VS హైదరాబాద్: మే 19, సోమవారం (లఖ్‌నవూ వేదికగా రాత్రి 7.30 గంటలకు)
- చెన్నై VS రాజస్థాన్: మే 20, మంగళవారం (దిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు)
- ముంబయి VS దిల్లీ: మే 21, బుధవారం (ముంబయి వేదికగా రాత్రి 7.30 గంటలకు)
- గుజరాత్ VS లఖ్‌నవూ: మే 22, గురువారం (అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు)
- బెంగళూరు VS హైదరాబాద్: మే 23, శుక్రవారం (బెంగళూరు వేదికగా రాత్రి 7.30 గంటలకు)
- పంజాబ్ VS దిల్లీ: మే 24, శనివారం (జైపుర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు)
- గుజరాత్ VS చెన్నై: మే 25, ఆదివారం (అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు)
- హైదరాబాద్ VS కోల్‌కతా: మే 25, ఆదివారం (దిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు)
- పంజాబ్ VS ముంబయి: మే 26, సోమవారం (జైపుర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు)
- లఖ్‌నవూ VS బెంగళూరు: మే 27, మంగళవారం (లఖ్‌నవూ వేదికగా రాత్రి 7.30 గంటలకు)
- తొలి క్వాలిఫయర్: మే 29, గురువారం (వేదిక ఖరారు కాలేదు, రాత్రి 7.30 గంటలకు)
- ఎలిమినేటర్: మే 30, శుక్రవారం (వేదిక ఖరారు కాలేదు, రాత్రి 7.30 గంటలకు)
- రెండో క్వాలిఫయర్: జూన్ 1, ఆదివారం (వేదిక ఖరారు కాలేదు, రాత్రి 7.30 గంటలకు)
- ఫైనల్ : జూన్ 3, మంగళవారం (వేదిక ఖరారు కాలేదు, రాత్రి 7.30 గంటలకు)