ETV Bharat / sports

ఎక్కడైనా, ఎప్పుడైనా టీమ్ఇండియా భయపడట్లే!: రికీ పాంటింగ్ - 2024 Border Gavaskar Trophy

2024-25 Border Gavaskar Trophy: కొంతకాలంగా టీమ్ఇండియా విదేశీ మైదానాల్లో ఆడేందుకు బెదరడం లేదని ఆశీస్ మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్ అన్నాడు.

author img

By ETV Bharat Sports Team

Published : Sep 12, 2024, 1:29 PM IST

Ricky Ponting
Ricky Ponting (Source: Getty Images)

2024-25 Border Gavaskar Trophy: 2024- 25 బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి భారత్- ఆస్ట్రేలియా జట్లు సంసిద్ధమవుతున్నాయి. ఆస్ట్రేలియా వేదికగా నవంబర్​లో ఈ ప్రతిష్ఠాత్మకమైన ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఆతిథ్య ఆసీస్​తో టీమ్ఇండియా 5 మ్యాచ్​లు ఆడనుంది. అయితే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో నెం 1, నెం 2 స్థానాల్లో ఉన్న ఈ రెండు అత్యుత్తమ జట్ల మధ్య హై వోల్టేజ్ పోటీని చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్​ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఆసీస్ గడ్డపై జరిగిన గత రెండు ఎడిషన్లలో (2018- 19), (2020- 21) టీమ్ఇండియా విజయం సాధించింది. ఈసారి కూడా ఇదే జోరులో విజయ సాధించాలని భారత్ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమ్ఇండియా కొంత కాలంగా విదేశీ గడ్డలపై ఆడేందుకు బెదరడం లేదని అన్నాడు.

'2020- 21లో భారత్ గబ్బా మైదానంలో జయ కేతనం ఎగురవేసింది. ఆ మైదానంలో భారత్ నెగ్గడం అదే తొలిసారి. ఈ మధ్య కాలంలో టీమ్ఇండియా విదేశాల్లోనూ అద్భుతంగా రాణిస్తోంది. ఆ జట్టు బ్యాటర్లు విదేశీ పిచ్​ల పరిస్థితులను బాగా అర్థం చేసుకుంటున్నారు. ఒకప్పటిలా కాకుండా గబ్బా, ఓవర్ పిచ్​లపై కూడా అదరగొడుతున్నారు. బహుశా అది జట్టు ఎంపికపై ఆధారపడి ఉంటుందేమో' అని పాంటింగ్ ఓ స్పోర్ట్స్​ ఛానెల్​ ప్రజెంటేషన్​లో అన్నాడు.

IPLనే వరల్డ్​కప్​లా భావిస్తారు
'చాలా మంది యంగ్ ప్లేయర్లు ఐపీఎల్​నే వరల్డ్​కప్​లా భావిస్తూ,​ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. వాళ్ల బ్యాటర్లు ఎక్కడ కూడా భయం లేకుండా, ఎంతో అగ్రెసివ్​గా ఆడుతున్నారు. ఇది నేను గత 10ఏళ్లుగా ఐపీఎల్​లో గమనిస్తున్నా' అని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.

6-7ఏళ్లుగా స్ట్రాంగ్ లీడర్​షిప్
గత 6-7ఏళ్లుగా టీమ్ఇండియా నాయకత్వం కూడా బలంగా ఉందని పాంటింగ్ అన్నాడు. 'వాళ్లకు లోతైన ఫాస్ట్ బౌలింగ్ ఉంది. 6 - 7 ఏళ్ల నుంచి లీడర్​షిప్ కూడా పటిష్ఠంగా ఉంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీతో జట్టులో కీలక పాత్ర పోషించాడు. గత నాలుగేళ్లుగా ద్రవిడ్ కూడా అదే కొనసాగిస్తున్నారు. వాళ్ల జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉండడం కూడా అదనపు బలం' అని పాంటిగ్ తెలిపాడు.

దిల్లీ షాకింగ్ డెసిషన్- పాంటింగ్​పై వేటు- కొత్త కోచ్​గా సీనియర్! - Ricky Ponting Delhi Capitals

ఆఫర్ రిజెక్ట్ చేసిన రికీ పాంటింగ్​ - మరి స్టీఫన్​ ఫ్లెమింగ్‌ ఏం అంటున్నాడంటే? - TeamIndia Head coach

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.