Afghanistan Cricket Ban: క్రికెట్ ప్రపంచంలోకి అఫ్గానిస్థాన్ జట్టు పసికూనగా ఎంట్రీ ఇచ్చి రోజురోజుకూ ప్రదర్శన మెరుగుపర్చుకుంటుంది. కొంతకాలంగా ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐసీసీ టోర్నీల్లో అద్భుత విజయాలు నమోదు చేస్తూ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటుంది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంక లాంటి బలమైన జట్లను ఓడించి అద్భుతం సృష్టించిన అఫ్గాన్, ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో అస్ట్రేలియాను మట్టి కరిపించి ఔరా అనిపించింది.
రషీద్ ఖాన్, రహ్మానుల్లా గుర్బాజ్, నవీన్ ఉల్ హక్, గుల్బాదిన్ నైబ్, మహ్మద్ నబీ వంటి ప్లేయర్లు సైతం స్టార్లుగా మారారు. ఇలా క్రికెట్లో ఎప్పటికప్పుడు పురోగతి సాధిస్తున్న అఫ్గానిస్థాన్ క్రికెట్ ఇప్పుడు ప్రమాదంలో పడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనేక అంశాలపై ఆంక్షలు విధించిన అక్కడి తాలిబన్ ప్రభుత్వం, తాజాగా క్రికెట్‌పై కూడా నిషేదం విధించాలని భావిస్తోందట. ఈ మేరకు పలు కథనాలు వెలువడుతున్నాయి.
అఫ్గాన్‌లో క్రికెట్ క్రీడను బ్యాన్ చేయాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోందట. దేశంలో క్రమంగా క్రికెట్‌ను బ్యాన్ చేయాలని తాలిబన్ సుప్రీం లీడర్ ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే అఫ్గాన్‌లోని పలు నగరాల్లో డొమెస్టిక్ క్రికెట్ ఆడడం బ్యాన్ చేశారని ఆ కథనాల్లో ఉంది. అలాగే ప్రభుత్వంలోని కొందరు నాయకులకు కూడా క్రికెట్ అంటే ఇష్టం లేదని అంటున్నారు. అయితే ఇప్పటికే అఫ్గాన్‌లో మహిళలు క్రికెట్ ఆడడంపై నిషేధం ఉంది. దీంతో ఈ వార్తల్లో వాస్తవం ఉండవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఈ విషయంపై తాలిబన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
BREAKING:
— Current Report (@Currentreport1) September 12, 2024
The Supreme Leader of Afghanistan's Taliban, Hibatullah Akhundzada has announced that he will introduce a gradual ban on cricket in the country.
The Taliban cleric believes cricket has harmful influence on the country and is against Sharia law. pic.twitter.com/vHi1rnjRY5
🚨Shocking News🚨
— Cricket Manchurian (@Cric_man07) September 11, 2024
One Leader of Taliban Mulla Habitullah does not like cricket so he ban the Cricket.
Cricket is the only game in Afghanistan give happiness of Afghanes. #Cricket #CricketUpdate #AFGvNZ #Afghanistan pic.twitter.com/u9zoFG5j6J
ఆ నగరంలో క్రికెట్ ఆడితే ఫైన్
ఉత్తర ఇటలీలోని మోన్ ఫాల్కోన్ పట్టణం ఇటీవల క్రికెట్‌పై బ్యాన్ విధించింది. ఒకవేళ ఈ కట్టుబాటును ఉల్లంఘించి క్రికెట్ ఆడినవారికి 100 యూరోలు (భారత కరెన్సీలో రూ. 9,325) వరకు జరిమానా వేస్తామని హెచ్చరించింది. ఈ విషయాన్ని మోన్ ఫాల్కోన్ పట్టణ మేయర్ అన్నా మారియా సిసింట్ ప్రకటించారు. ఈ మేరకు బీబీసీ ఓ కథనాన్ని ప్రచురించింది.