Ashada Masam 2025 Festivals : తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు మాసాలలో నాలుగో మాసం ఆషాఢం. ఈ మాసంలో శుభకార్యాలు జరగనప్పటికీ దైవారాధనకు ఆషాఢం ఎంతో శ్రేష్టం. సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణం సాగించడంతో ఈ ఆషాఢ మాసం నుంచి దక్షిణాయణం ప్రారంభమవుతుంది. ఆషాఢంలో రానున్న పండుగలు, పుణ్య తిథులు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
అన్నీ విశేషాలే!
సాధారణంగా ఒక మాసంలో ఒకటో రెండో పండుగలు, కొన్ని విశేష తిథులు ఉంటాయేమో కానీ ఆషాఢంలో మాత్రం నెలంతా విశేషాలే! ప్రతిరోజూ ఉత్సవమే! ఈ మాసంలో ఉన్న ప్రత్యేకమైన తిథులు, పండుగల గురించి తెలుసుకుందాం.
- జూన్ 26 గురువారం ఆషాఢ శుద్ధ పాడ్యమి: ఆషాఢమాసం ప్రారంభం. వారాహి నవరాత్రులు ప్రారంభం.
- జూన్ 27 శుక్రవారం ఆషాఢ శుద్ధ విదియ: చంద్రోదయం, పూరీ జగన్నాధుని రథయాత్ర ప్రారంభం.
- జులై 1 మంగళవారం ఆషాఢ శుద్ధ షష్టి: స్కంద షష్టి
- జులై 6 ఆదివారం ఆషాఢ శుద్ధ ఏకాదశి: తొలిఏకాదశి, శయనేకాదశి, చాతుర్మాస వ్రతం ఆరంభం, శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం, మొహరం పండుగ
- జులై 7 సోమవారం ఆషాఢ శుద్ధ ద్వాదశి: వాసుదేవ ద్వాదశి
- జులై 9 బుధవారం ఆషాఢ శుద్ధ చతుర్దశి: ఆడిపూరం, శ్రీ ఆండాళ్ జయంతి
- జులై 10 గురువారం ఆషాఢ శుద్ధ పౌర్ణమి: గురుపౌర్ణమి, వ్యాస పౌర్ణమి
- జులై 14 ఆదివారం ఆషాఢ బహుళ చవితి: సంకష్ట హర చతుర్థి
- జులై 17 గురువారం ఆషాఢ బహుళ సప్తమి: భోగ సప్తమి, కర్కాటక సంక్రమణం, దక్షిణాయణం పుణ్యకాలం ప్రారంభం
- జులై 19 శనివారం ఆషాఢ బహుళ నవమి: తిరుపతి శ్రీ కోదండ రామస్వామి పుష్పయాగం
- జులై 20 ఆదివారం ఆషాఢ బహుళ దశమి: ఆడికృత్తిక
- జులై 21 సోమవారం ఆషాఢ బహుళ ఏకాదశి: కామదా ఏకాదశి, మతత్రయ ఏకాదశి
- జులై 22 మంగళవారం ఆషాఢ బహుళ త్రయోదశి: పక్షప్రదోషం, భౌమ ప్రదోషం
- జులై 23 బుధవారం ఆషాఢ బహుళ చతుర్దశి: మాసశివరాత్రి, బాలగంగాధర్ తిలక్ జయంతి
- జులై 24 గురువారం ఆషాఢ బహుళ అమావాస్య: చౌడేశ్వరి జయంతి, ఆషాఢ అమావాస్య
- జులై 24 గురువారంతో ఆషాఢ మాసం సమాప్తమవుతుంది.
విశేషాల సమాహారమైన ఆషాఢంలో పంచాంగంలో సూచించిన పండుగలు, పుణ్య తిథులు శాస్త్రోక్తంగా జరుపుకుందాం. సకల శుభాలు పొందుదాం.
శుభం భూయాత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.