Rottern Coconut in Pooja is it a Bad or Good Sign : మనం ఇంట్లో పూజ చేసినప్పుడు లేదా దేవాలయాలకు వెళ్లినప్పుడు కొబ్బరికాయలను కొడుతుంటాం. హిందూ సంప్రదాయం ప్రకారం భగవంతుని పూజలైనా, ఇంట్లో శుభకార్యాలు అయినా కొబ్బరికాయ కొట్టనిదే పూజ పూర్తి కాదు. అందుకే పూజ లేదా శుభకార్యంలో టెంకాయను కచ్చితంగా యూజ్ చేస్తుంటాం. ఇక కొబ్బరికాయనే వివిధ పేర్లతో కూడా పిలుస్తుంటాం.
అయితే, కొన్నిసార్లు పూజ చేసే క్రమంలో కొబ్బరికాయలో పువ్వు రావడం లేదా కుళ్లిపోవడం కనిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే చాలా మందిలో కొబ్బరికాయ కుళ్లిపోతే అశుభానికి సంకేతమా? పువ్వు వస్తే దేనికి సంకేతం? వంటి చిన్నచిన్న సందేహాలు వస్తుంటాయి. ఇంతకీ, దేవుడి కోసం కొట్టే కొబ్బరికాయ కుళ్లిపోతే మంచిదా? చెడుకు సంకేతమా? పువ్వు వస్తే ఏం జరుగుతుంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

పూజల్లో భాగంగా టెంకాయను కొట్టినప్పుడు పువ్వు వచ్చినా, కుళ్లిపోయినా అశుభానికి సంకేతమా? అనే దానిపై ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త కాకునూరి సూర్యనారాయణమూర్తి ఇలా వివరణ ఇస్తున్నారు. కొబ్బరికాయకు 3 కన్నులు ఉంటాయి. దీనికి శాస్త్రంలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ‘నారికేళ సముద్భూత త్రినేత్ర హరసమ్మత - శిఖయా దురితం సర్వం పాపం పీడాంచ మేనుద’ అని పేర్కొంటారు. ఇది మనకు ఎప్పటికీ యౌవనాన్ని ప్రసాదించేదని అర్థం. ఎప్పటికీ నారికేళం కాయగానే ఉంటుంది. అలాంటి కొబ్బరికాయను దేవుని నైవేద్యంగా సమర్పించే క్రమంలో ఒక్కోసారి టెంకాయ కుళ్లిపోవచ్చు లేదా అందులో పువ్వు కనిపించొచ్చు.
"దీపారాధన విషయంలో ఈ తప్పులు చేస్తే - పనుల్లో ఆటంకాలు" - ఈ నియమాలు తప్పనిసరి!

కొబ్బరికాయ కుళ్లిపోతే ఏం జరుగుతుందంటే?
పూజా కార్యక్రమాల సమయంలో కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు కనిపిస్తే ఏం భయపడనక్కర్లేదంటున్నారు ఆధ్యాత్మిక ప్రవచనకర్త సూర్యనారాయణమూర్తి. దాన్ని పక్కనపెట్టేసి మరో కొబ్బరికాయతో పూజను పూర్తి చేయాలని సలహా ఇస్తున్నారు. అయితే, శుభకార్యాల సమయంలో పువ్వు కనిపిస్తే ఇంట్లోకి పసిబిడ్డ రాబోతున్నదనీ, త్వరలోనే బారసాల చేస్తారనే నమ్మకం కూడా ఉందని చెబుతున్నారు.
ఇక, కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కుళ్లిపోయినా అశుభమేమీ కాదంటున్నారు. అలా కుళ్లిపోవడం "శుభసూచకం" అని కూడా అంటారని చెబుతున్నారు. ముఖ్యంగా దిష్టి తీసే క్రమంలో టెంకాయ కుళ్లిపోతే మంచిదనే విశ్వాసం చాలా ప్రాంతాల్లో ఉందంటున్నారు ఆధ్యాత్మిక ప్రవచనకర్త కాకునూరి సూర్యనారాయణమూర్తి.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
పనిలో ఆటంకాలా? ఈ గణేశుడి పూజతో అంతా సెట్!
ఆదివారం ఈ తప్పులు చేస్తున్నారా? అనారోగ్యం పట్టి పీడిస్తుంది జాగ్రత్త!