ETV Bharat / spiritual

ఆ రాశి ఉద్యోగులకు ఈ వారంలో శుభవార్త- ఖర్చుల విషయంలో బీకేర్ ఫుల్! - WEEKLY HOROSCOPE

జూన్ 8వ తేదీ నుంచి జూన్ 14వ​ తేదీ వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : June 8, 2025 at 12:02 AM IST

6 Min Read

Weekly Horoscope From 8th June To 14th June 2025 : జూన్ 8వ తేదీ నుంచి జూన్ 14వ​ తేదీ వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు చేటు చేస్తాయి. వ్యాపారంలో, అతి విశ్వాసం ఇబ్బందులకు దారితీయవచ్చు. ఆర్థిక అంశాలలో జాగ్రత్తగా ఉండండి. సొంత నిర్ణయాలు తీసుకోకండి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించే వారు నూతన అవకాశాలు అందుకుంటారు. అధిక ఖర్చులు ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చు. విద్యార్థులు చంచల బుద్ధితో గొప్ప అవకాశాలు కోల్పోయే ప్రమాదముంది. ప్రేమ వ్యవహారాల్లో అహాన్ని పక్కన పెట్టడం ముఖ్యం. జీవిత భాగస్వామితో అపార్ధాలు రాకుండా జాగ్రత్త పడండి. కాలానుగుణ మార్పుల వల్ల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండవచ్చు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి. ఆదిత్య హృదయం పారాయణ సత్ఫలితాన్నిస్తుంది.

.

వృషభం (Taurus) : ఈ వారం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం సాధిస్తారు. కష్టపడి పనిచేస్తే అంచనాలకు మించిన శుభ ఫలితాలు ఉంటాయి. మీ శక్తియుక్తులతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులు గణనీయమైన ప్రగతిని, ఆర్థిక లాభాలను సాధిస్తారు. భాగస్వాముల సహకారంతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఆర్థికంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత విద్యను అభ్యసించే వారికి ఈ వారం ఆశాజనకంగా కనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో నిజాయితీ ముఖ్యం. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శనం శుభకరం.

.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. ఆర్థికంగా పరిస్థితులు మెరుగు పడతాయి. తక్కువ ఖర్చులు, పెరిగిన ఆదాయంతో మంచి ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తారు. వ్యాపారులు వ్యాపారంలో వృద్ధి, ఆర్థిక లాభాలు సాధిస్తారు. వ్యాపారంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడతారు. విద్యార్థులు తమ చదువులకు సంబంధించి కొంత అనిశ్చితిని ఎదుర్కోవచ్చు. సరైన మార్గదర్శకత్వంతో ముందుకెళ్లడం మంచిది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొంటాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈ వారం ప్రశంసలు, జీతం పెరుగుదల, పదోన్నతులకు అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు కీలక వ్యహారాల్లో ఇతరులను సంప్రదించడం మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ముఖ్యం. ఆర్థిక పరిస్థితి ఆందోళన కలిగించవచ్చు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. విద్యార్థులు విజయం సాధించాలంటే దృఢ సంకల్పం ఉండాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. ప్రేమికులు పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తే మంచిది. జీవిత భాగస్వామి అభిప్రాయానికి విలువ ఇవ్వడం అవసరం. కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త వహించాలి. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో ప్రయత్నపూర్వక విజయం ఉంటుంది. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ఈ వారం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు దూరంగా ఉండండి. వ్యాపారులు నూతన రుణాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగులకు పనిఒత్తిడి, శ్రమ పెరగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ నమ్మవద్దు. ఆచి తూచి నడుచుకోవాలి. కుటుంబంలో అనవసర అపార్థాలు నివారించడానికి ప్రయత్నించండి. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత పెంచాలి. ఆరోగ్యం సమస్యాత్మకంగా ఉంటుంది. సూర్య ఆరాధనతో పరిస్థితులు చక్కబడతాయి.

.

కన్య (Virgo) :కన్య రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో సమస్యలు ఎదుర్కొంటారు. సహనంతో ఉండడం అవసరం. వ్యాపారంలో నష్టాలు రాకుండా ముందుచూపుతో నడుచుకోవాలి. భాగస్వామ్య ఒప్పందాలు మేలు చేస్తాయి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో వినయంతో నడుచుకోవాలి. ప్రేమ వ్యవహారాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. తగినంత విశ్రాంతి అవసరం. బడ్జెట్‌ను తెలివిగా నిర్వహించడం చాలా అవసరం. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో సవాళ్లు ఎదురవుతాయి. సందర్భానుసారంగా నడుచుకుంటే సవాళ్లను అధిగమించవచ్చు. ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. విద్యార్థులకు ఈ వారం సవాలుగా ఉంటుంది. కష్టపడితే తప్ప ఆశించిన ఫలితం ఉండదు. చెడు స్నేహాలకు దూరంగా ఉంటే మంచిది. భూమి, ఇల్లు కొనుగోలు వంటి నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. వైవాహిక బంధాలలో అపార్ధాలకు అవకాశం ఉంది. సన్నిహితులతో విహార యాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. కొత్త సంబంధాలు పెరుగుతాయి. ఫలితంగా, వ్యాపారం వృద్ధి చెందుతుంది. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఇది మీ సంపాదనలో పెరుగుదలకు దారితీస్తుంది. ఉద్యోగులకు ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. గతం కంటే మెరుగైన ఉద్యోగ అవకాశాలను అందుకుంటారు. రుణభారం తగ్గుతుంది. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత పెంచాలి. జీవిత భాగస్వామి అభిప్రాయాలను గౌరవించాలి. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు వారం ప్రారంభంలో కొత్త బాధ్యతలు చేపడతారు. కొంత కఠిన శ్రమతోనే బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది. స్దానచలనం సూచన ఉంది. వ్యాపారులకు ప్రయాణాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయం భవిష్యత్ కు మేలు చేస్తుంది. ఆర్థిక పురోగతిని సాధిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. జీవిత భాగస్వామితో మనస్పర్థలకు అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శివారాధన శ్రేయస్కరం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ఆరంభంలో అన్ని రంగాల వారికి తీవ్రమైన పని ఒత్తిడి ఉన్నప్పటికినీ సమర్ధవంతంగా అధిగమిస్తారు. ఉద్యోగులు చేపట్టిన నూతన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. వ్యాపార విస్తరణ కోసం సుదూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. స్థిరాస్తి రంగం వారికి ఆశించిన ప్రయోజనాలు కోసం తీవ్రంగా శ్రమించాలి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు చికాకు పెడతాయి. జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సాహసోపేతమైన విజయాలు సాధిస్తారు. ఎవరి అంచనాలకు అందనంత ఎత్తుకు ఎదుగుతారు. వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం సమన్వయము చేసుకుంటూ ముందుకెళ్తూ అందరి అభిమానాన్ని పొందుతారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అనురాగం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు పొందుతారు. ఆశించిన దానికన్నా ఎంతో ఎక్కువగా ఆదాయం వృద్ధి చెందుతుంది. విదేశాలకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. కుటుంబ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబలో శుభకార్యాలు జరుగుతాయి. దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఊహించని విధంగా సంపదలు కలిసి వస్తాయి. శ్రీ దుర్గాస్తుతి పారాయణ శుభకరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో గత కొంతకాలంగా ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. వారం ప్రధమ భాగం అదృష్టదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల మద్దతు, సహోద్యోగుల సహకారాన్ని అందుకుంటారు. వ్యాపార పరంగా చేసే పర్యటనలు అనుకూలిస్తాయి. కొత్తగా చేపట్టిన ప్రాజెక్ట్‌లు సజావుగా సాగి మంచి ఫలితాలను తెస్తాయి. వారం ద్వితీయార్ధంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. శని శ్లోకాలు పఠించడం శ్రేయస్కరం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.