ETV Bharat / spiritual

ఈ వారం మీ రాశిఫలం ఎలా ఉందో చూసుకున్నారా? - WEEKLY HOROSCOPE

మే 25వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 25, 2025 at 12:00 AM IST

7 Min Read

Weekly Horoscope From 25th May To 31th May 2025 : మే 25వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు కెరీర్​పై శ్రద్ధ పెట్టాల్సిన సమయం. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు. స్థానచలనం కూడా ఉండవచ్చు. వ్యాపారులు వ్యూహాత్మకంగా నడుచుకుంటే మంచి లాభాలను పొందగలరు. ఆస్తులు, భూములు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువుపై దృష్టి పెడితే పోటీల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వైవాహిక జీవితంలో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆర్థిక ఒత్తిడి పెద్దగా ఉండదు. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు బెడిసి కొడతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త పడాలి. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయం గడపడం వల్ల సామరస్యం పెరుగుతుంది. ఆదాయ వనరులు పెరగడంతో ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనే వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు ప్రయోజనకరంగా ఉంటాయి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు పనిఒత్తిడి అధికంగా ఉండవచ్చు. చేపట్టిన పనుల్లో నిర్లక్ష్యం లేకుండా చూసుకోండి. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత పెంచాలి. అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు చికాకు పెడతాయి. ఉద్యోగులు కష్టించి పనిచేస్తే ప్రమోషన్‌కు అర్హత పొందే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్త పరిచయాల ద్వారా వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆదాయానికి సరిపడా ఖర్చులు ఉంటాయి. నూతన ఆదాయ వనరుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపడం ద్వారా గృహ జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రేమ వ్యవహారాల్లో నిజాయితితో లేకపోతే సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మళ్లీ తలెత్తే అవకాశం ఉంటుంది, కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. కొన్ని సంఘటనల కారణంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉండొచ్చు. వృత్తి పరంగా కొత్త అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగంలో పనిభారం ఉన్నప్పటి సహచరుల సహకారంతో ఒత్తిడిని అధిగమిస్తారు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుభవజ్ఞుల సలహా మేరకు నడుచుకుంటే మంచిది. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. రుణభారం, ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యపరంగా చూస్తే కొన్ని పాత రోగాలు తిరగబెట్టవచ్చు. సకాలంలో చికిత్స అవసరం. ఆదిత్య హృదయం పరాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు రావడం కష్టతరమవుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో, సామరస్యంగా మెలగాల్సి ఉంటుంది. వ్యాపారులకు స్టాక్ మార్కెట్‌లో మంచి లాభాలు కనిపించవచ్చు కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. వ్యాపార నిర్వహణలో పాత ప్రణాళికలను నిర్లక్ష్యం చేస్తే నష్టాలు సంభవించవచ్చు. ఉద్యోగులు సకాలంలో పనులు పూర్తి చేయడానికి సహోద్యోగుల సహకారం అవసరం. విద్యార్థులకు గట్టి కృషితో ప్రయత్నిస్తే మంచి ఫలితాలు రావచ్చు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సంబంధాలపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో నిర్లక్ష్యం తగదు. ముఖ్యంగా ఉద్యోగులు నూతన బాధ్యతలపై శ్రద్ధ వహించాలి. నైపుణ్యాలు మెరుగు పరచుకోవడంపై దృష్టి సారించాలి. వ్యాపారులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని అంతర్జాతీయంగా విస్తరించే అవకాశాలున్నాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపితే మంచిది. పెరిగే ఖర్చులకు అనుగుణంగా ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి సారించాలి. లేదంటే భవిష్యత్తులో ఆర్ధిక సమస్యలు ఏర్పడవచ్చు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెంచాలి. ఆరోగ్యం పరంగా దీర్ఘకాలిక సమస్యలు తీవ్రతరం కాకుండా శ్రద్ధ పెట్టాలి. బంధువుల ఇంట శుభకార్యాలలో పాల్గొంటారు. శివారాధన శ్రేయస్కరం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయటా కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. పెరిగే ఖర్చులు ఆందోళన కలిగించవచ్చు. వ్యాపారులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో అధిక లాభాలు కోసం రచించే ప్రణాళికలు, అనుసరించే వ్యూహాలు సత్ఫలితాన్నిస్తాయి. ఆస్తుల కొనుగోలు కోసం రుణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యపరంగా, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. విజయం సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలి. లక్ష్య సాధనపై దృష్టి మరలకుండా జాగ్రత్త వహించాలి. కుటుంబంలో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. వృధా ఖర్చులు నివారించండి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కారణంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడిని సమర్థంగా అధిగమించడం ముఖ్యం, అనవసరమైన ఆందోళనకు లోనవ్వకండి. అందరు ఉన్నా ఒంటరితనం భావనతో ఉంటారు. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపితే, సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థికంగా ఊహించిన దానికన్నా ఖర్చులు పెరిగే అవకాశముంది. విహారయాత్రలు, సామాజిక కార్యక్రమాల కోసం అధిక ధనవ్యయం ఉండవచ్చు. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారులు కలిసివస్తాయి. వృత్తి నిపుణులు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టడం అవసరం. సమాచారలోపం లేకుండా జాగ్రత్త పడండి. ఉద్యోగులకు స్థానచలనానికి పూర్తి అవకాశముంది. కాబట్టి మార్పులకు సిద్ధంగా ఉండాలి. విద్యార్థులు ఆటంకాలు అధిగమించాలి. ఈ వారం తీసుకునే కొన్ని ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించండి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ సుబ్రహమణ్యస్వామి భుజంగ స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారులు లాభదాయకంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. కొత్త వ్యాపార అవకాశాలు ఎదురవుతాయి. ఈ వారం ఉద్యోగులకు కూడా అనుకూల సమయం. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి మంచి అవకాశం రావచ్చు. పనిపట్ల బాధ్యతగా, చిత్తశుద్ధితో ఉంటే ప్రమోషన్ ఖాయం. చేపట్టిన పనిలో ఇతరుల సహాయం, సలహాలు తీసుకోండి. విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టాలి. కుటుంబ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, సమస్యల పరిష్కారానికి ప్రయత్నించండి. ప్రేమలో అపార్థాలు తలెత్తవచ్చు. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఆంజనేయస్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో మార్పులు చోటు చేసుకోవచ్చు. వ్యాపారంలో సుస్థిరమైన ప్రగతి సాధిస్తారు. ఊహించని విధంగా లాభాలు కూడా పెరుగుతాయి. ఉద్యోగులు తమ పురోగతితో పూర్తి సంతృప్తి చెందుతారు. పదోన్నతికి అవకాశముంది. పని పట్ల శ్రద్ధ పెంచాలి. ఆర్ధిక పరిస్థితి మెరుగు పడడంతో ఆందోళన తగ్గుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు కలవరపెడతాయి. విద్యార్థులు మంచి ప్రతిభ కనబరచి ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు నష్టం కల్గిస్తాయి. వ్యాపారులు తొందరపడి పెద్ద పెట్టుబడులు పెడితే ఆర్థిక సమస్యలు ఏర్పడవచ్చు. ఉద్యోగులు పదోన్నతులు అందుకునే అవకాశముంది. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని సమస్యలున్నా అనుకూలంగానే ఉంటాయి. విద్యార్థులు క్రమశిక్షణతో చదవడం అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో మెరుగైన అవకాశాలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా చూస్తే ఆదాయం ఖర్చులు సరిసమానంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాల కారణంగా వ్యయం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఖర్చులు సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో సవాళ్లు ఉండవచ్చు. చర్చించడం ద్వారా సంబంధాన్ని మెరుగుపరచవచ్చు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టగలుగుతారు. శారీరక, మానసిక ఆరోగ్యాలపై శ్రద్ధ పెట్టాలి. యోగా, ధ్యానం చేయడం మంచిది. గణపతి ఆలయ సందర్శన శుభకరం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.