ETV Bharat / spiritual

ఆ రాశివారికి ఈవారంలో లవ్​ మ్యారేజ్- స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పవ్​! - WEEKLY HOROSCOPE

మే 18వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 18, 2025 at 12:01 AM IST

6 Min Read

Weekly Horoscope From 18th May To 24th May 2025 : మే 18వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో కొత్త సవాళ్లు ఎదురవుతాయి. చిత్తశుద్ధి, ఏకాగ్రత ఉంటే ఆటంకాలు అధిగమించవచ్చు. వ్యాపారస్థులకు ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. కొత్త పరిచయాలతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. సమిష్టి నిర్ణయాలతో భాగస్వామ్య వ్యాపారాలలో రాణిస్తారు. లాభాలు కూడా ఆశించిన మేరకు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఈ వారం అంత ఆశాజనకంగా ఉండదు. రుణభారం పెరిగే అవకాశం ఉంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ప్రేమ వ్యవహారాలు ఆనందదాయకంగా ఉంటాయి. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. పెద్దల జోక్యంతో సమస్యలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు ఏకాగ్రతతో, పట్టుదలతో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కొరవడుతోంది. ఇష్ట దేవతారాధనతో ప్రశాంతత కలుగుతుంది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ వారం ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కొన్ని రకాల చట్ట పరమైన కార్యకలాపాల కోసం డబ్బు మంచినీళ్లలా ఖర్చవుతుంది. వృత్తి ఉద్యోగాలలో పనిభారం, అధిక ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారంలో లాభాల ఆర్జన కోసం తీవ్రంగా శ్రమించాలి. అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు మనోధైర్యాన్ని కోల్పోవద్దు. కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితులు ఉండవచ్చు. ఆదాయం ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్ధాలకు తావు లేకుండా చూసుకోండి. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం అవసరం. అనారోగ్య సమస్యలు తీవ్రం కాకముందే చికిత్స తీసుకోవడం మంచిది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి పరంగా అనేక అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటే గొప్ప ప్రయోజనాలు ఉంటాయి. పదోన్నతులకు అవకాశం ఉంది. మీ ప్రతిభతో ముఖ్యమైన పనులు అవలీలగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో వ్యూహాత్మకంగా నడుచుకుని విజయం సాధిస్తారు. రాబడి పెరుగుతుంది. ఆర్థికంగా, ఆదాయం పెరుగుతుంది. పొదుపుపై దృష్టి పెడతారు. ప్రేమ వ్యవ్యహారాల్లో ఒత్తిడి పెరగవచ్చు. కుటుంబ సమస్యలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కెరీర్‌లో కీలక పురోగతి ఉంటుంది. ఉద్యోగ రీత్యా దూరప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్థులకు ఈ వారం గొప్ప ప్రయోజనకరంగా ఉంటుంది. గణనీయమైన లాభాలు అందుకుంటారు. పెట్టుబడులు కూడా పెరుగుతాయి. స్టాక్ మార్కెట్‌లో, స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టినవారు మంచి ఫలితాలు పొందవచ్చు. ప్రేమ వ్యవహారంలో ఉన్నవారు శుభవార్తలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. విహార యాత్రలకు వెళ్తారు. విందు వినోదలాలో పాల్గొంటారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెట్టాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ సత్ఫలితాన్నిస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించే వారు శుభవార్తలు వింటారు. వ్యాపారస్థులు తమ వ్యాపారాన్ని అంతర్జాతీయంగా విస్తరించేందుకు అవకాశాలు లభిస్తాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. ప్రేమలో ఉన్నవారు వైవాహిక జీవితంలో అడుగు పెడతారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి రుణాలు తీసుకోవద్దు, ఇవ్వొద్దు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులు చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు పొందవచ్చు. పాత అనారోగ్య సమస్యలు మళ్లీ తలెత్తవచ్చు కాబట్టి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, యోగా లేదా వ్యాయామంతో ఒత్తిడిని తగ్గించాలి. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో శుభ ఫలితాలు ఉంటాయి.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. వ్యాపారస్థులు వ్యాపారాన్ని విస్తరించడంలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు మంచి అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సోదరుల మధ్య కొనసాగుతున్న విభేదాలు ముగుస్తాయి. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత పెట్టాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ప్రేమ వ్యవహారాల్లో ఆనందం ఉంటుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళతారు. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఎదగడానికి చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కెరీర్ విజయపథంలో దూసుపోవడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, కోరుకున్న స్థానానికి బదిలీ పొందే అవకాశం ఉంది. ఆదాయం పదింతలు పెరుగుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కుటుంబ విషయాలలో జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇస్తే కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. కొన్ని ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం కెరీర్ పరంగా మంచి అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగులు కొన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశముంది. కానీ పట్టుదలతో వ్యవహరిస్తే విజయాన్ని సాధించవచ్చు. వ్యాపారస్థులు వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు. అయితే కీలక పెట్టుబడులు వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక నిర్వహణ విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులు అడ్డంకులను అధిగమించి విజయానికి చేరువవుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. వారం ఆరంభంలో ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ప్రేమ విషయాల్లో స్థిరత్వం ఉంటుంది. జీవిత భాగస్వామితో మధుర క్షణాలను గడుపుతారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృతి వ్యాపారాలలో మెరుగైన ప్రయోజనాలు పొందాలంటే తీవ్ర కృషి అవసరం. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. నూతన ఆదాయ వనరులు అందుకుంటారు. అనారోగ్య సమస్యల కారణంగా ఏ పనిపై దృష్టి సారించలేకపోతారు. వ్యాపారస్థులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. ఆర్థిక సంబంధిత విషయాలలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మేలు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు న్యాయపరమైన సలహాలు తీసుకోండి. చట్టపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులు ఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కుటుంబ శ్రేయస్సు కోసం కృషి చేస్తారు. నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ వారం ఫలప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారస్థులు కొత్త ప్రాజెక్ట్‌లు, భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించేందుకు అనువైన సమయం. ఆర్థిక వృద్ధి ఉంటుంది. రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టడం అవసరం. ఆరోగ్యంగా ఉండేందుకు స్వీయ సంరక్షణ అవసరం. వారం చివరిలో ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆచి తూచి వ్యవహరించాలి. కెరీర్ పరంగా, ఉద్యోగులు తమ పనిలో స్థిరత్వాన్ని పొందుతారు. కొత్త అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు సత్ఫలితాలు అందుకుంటారు. వ్యాపారస్థులు అధిక లాభాల కోసం నూతన వ్యూహాలను అనుసరించాలి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. లేకపోతే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఎవరితోనూ వాదనలు చేయవద్దు. కుటుంబంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అవివాహితులకు వివాహ సూచన ఉంది. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా, ఉద్యోగులు కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉంటుంది. వ్యాపారంలో ఈ వారం స్థిరమైన వృద్ధిని ఆశించవచ్చు. ముఖ్యంగా కొత్త ఒప్పందాలు, వ్యాపార విస్తరణ మెరుగైన అవకాశాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఖర్చులు అదుపులో ఉంచాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు విజయం సాధించాలంటే పట్టుదల, ఏకాగ్రత అవసరం. పాత అనారోగ్య సమస్యలు తిరగబెట్టే అవకాశం ఉంది, కాబట్టి అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాలు అనుకూలం కాదు కాబట్టి ముఖ్యమైన ప్రయాణాలను వాయిదా వేయడం ఉత్తమం. జీవిత భాగస్వామితో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. సిద్ధి గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.