ETV Bharat / spiritual

దత్తాత్రేయ స్వామి అనుగ్రహం- గురుభక్తిని తెలిపే విష్ణు దత్తుడి కథ మీకు తెలుసా? - Vishnu Dutt Story

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 8, 2024, 4:35 AM IST

Vishnu Dutt Story : ప్రతి వ్యక్తికి జీవితంలో గురువు మార్గదర్శకుడు. భగవంతుని అనుగ్రహం పొందాలంటే అది గురువుతోనే సాధ్యం. భగవంతుడి చేరే మార్గాన్ని చూపేది కూడా గురువే. అయితే ఒకరిని మనం గురువుగా స్వీకరించిన తర్వాత ఆ గురువు పట్ల భక్తి శ్రద్ధలు ఒక్కటే ఉంటే సరిపోదు. వారి పట్ల ఎప్పటికీ సడలని విశ్వాసం తప్పనిసరిగా ఉండాలి. గురువు పట్ల మనకు ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడానికి వాళ్లు ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటాడు. వాటన్నంటిని తట్టుకొని గురువు పాదాలను విడవకుండా పట్టుకోవాలన్న నీతిని చెప్పే విష్ణు దత్తుడిని కథను ఈ కథనంలో తెలుసుకుందాం.

Vishnu Dutt Story
Vishnu Dutt Story (Getty Iamges)

Vishnu Dutt Story : శ్రీగురు చరిత్రలోని విష్ణు దత్తుని కథ మనకు అసలైన గురుభక్తిని సూచిస్తుంది. ఒక ఊర్లో విష్ణు దత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు శ్రీ దత్తాత్రేయుని భక్తుడు. సర్వకాల సర్వావస్థల్లోనూ దత్తాత్రేయుని ఆరాధిస్తూ ఉండేవాడు. ఈ విష్ణు దత్తునికి జీవితంలో ఒక్కసారైనా దత్తాత్రేయుని దర్శనం చేసుకొని, తరించాలని తపన ఉండేది. ప్రతిరోజూ అతడు సంధ్య వార్చుకొని, ఆ నీళ్లు తన ఇంటి ముందు ఉన్న రావి చెట్టు మొదల్లో పోసేవాడు.

విష్ణు దత్తుని భార్య సుశీలమ్మ పరమ సాధ్వి. భర్తకు తగిన భార్య అయిన ఆమె తన ఇంటికి వచ్చిన అతిథులను ఆదరించి, భోజనం పెట్టి పంపేది. అయితే వారి ఇంటి ముంగిట్లో ఉండే రావి చెట్టు మీద ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడు. విష్ణు దత్తుడు రోజూ సంధ్య వార్చిన నీళ్లు చెట్టు మొదట్లో పోసినందున వల్ల గాయత్రీ మంత్రం ప్రభావం చేత ఆ రాక్షసునికి శాపం తీరి తన లోకానికి వెళ్లిపోతూ, విష్ణు దత్తుడి పిలిచి ఇలా అంటాడు. స్వామీ మీదయ వల్ల నాకు శాపం తీరింది మీకు ఏదైనా ఒక ఉపకారం చేసి పోవాలని అనుకుంటున్నాను. మీ కోరిక ఏమిటో చెప్పండి అని అడిగాడు. దానికి విష్ణుదత్తుడు, నాయనా నాకు శ్రీ దత్తుడి దర్శించుకోవాలనే కోరిక వుంది నీకు చేతనైతే అది చేయించు చాలు అన్నాడు.

దత్తుడిని నువ్వే గుర్తుపట్టాలి!
బ్రహ్మరాక్షసుడు విష్ణు దత్తుడితో నేను నీకు మూడు సార్లు మాత్రమే దత్తుడి చూపిస్తాను. నీవు అతడిని గుర్తుపట్టక పోతే నేనేమి చేయలేను అని అనగా అందుకు విష్ణుదత్తుడు ఒప్పుకుంటాడు. అప్పుడు బ్రహ్మరాక్షసుడు విష్ణు దత్తుని తనతో తీసుకెళ్లి ఒక తాగుబోతును చూపించి అతడే దత్తుడు నీవు వెళ్లి కాళ్ల మీద పడు అని చెప్పాడు. కానీ విష్ణు దత్తునికి ఆ తాగుబోతును చూస్తే అసహ్యం కలిగి, అతని దగ్గరికి పోకుండా తిరిగి ఇంటికి వెళ్లి పోతాడు.

నా లోకానికి వెళ్లిపోతా!
రాక్షసుడు విష్ణు దత్తుడితో ఏమి తిరిగి వచ్చినావు అంటే నాకు దత్తుడి చూపించమంటే తాగుబోతును చూపించావు అందుకే తిరిగి వచ్చేశానని అంటాడు. అప్పుడు బ్రహ్మరాక్షసుడు రెండోసారి విష్ణు దత్తుడి తీసుకెళ్లి ఒక స్త్రీని తన తొడమీద కూర్చో బెట్టుకొని ముచ్చట్లాడుతున్న ఓ వ్యక్తిని చూపి అతడే దత్తుడు వెళ్లి అతని పాదాలపై పడి శరణు వేడుకో అంటాడు. కానీ కామానికి వశుడై ఉన్న అతడిని చూసి అతడే దత్తాత్రేయుడంటే విష్ణు దత్తుడికి నమ్మకం కలుగ లేదు. మళ్లి తిరిగి వచ్చేస్తాడు. చివరకు బ్రహ్మరాక్షసుడు విష్ణుదత్తుడితో ఇలా అంటాడు ఇదే నీకు చివరి అవకాశం. దత్తాత్రేయుడు తన భక్తులకు పరీక్ష పెడుతుంటాడు. నీవు ఈసారి దత్తుడి శరణు కోరకుంటే నేను ఇక ఏమి చేయలేను నా లోకానికి వెళ్లిపోతాను అంటాడు. బ్రహ్మరాక్షసుడు, విష్ణుదత్తుడు ఇద్దరూ కలిసి శ్మశానానికి వెళ్తారు. అక్కడ శవాలతో ఉన్న ఓ వ్యక్తిని చూపి బ్రహ్మరాక్షసుడు ఆయనే దత్త ప్రభువు అని చెప్పుతాడు. విష్ణు దత్తుడు వెళ్లి భక్తితో అయన కాళ్లు గట్టిగా పట్టుకుంటాడు.

నిజరూపంలో దర్శనం
అప్పుడు దత్తాత్రేయస్వామి విష్ణుదత్తుడికి తన నిజరూప దర్శనం ఇచ్చి భక్తా ఏమి కావాలో కోరుకో అని అడుగాడు. కానీ, విష్ణు దత్తుడికి ఏమీ కోరాలో తెలియక ప్రభూ నేను ఇప్పుడే ఇంటికి వెళ్లి నా భార్యను అడిగి వస్తానని వెళ్ళాడు. తన భార్య సుశీలమ్మకు దత్తుడు దర్శనం గురించి చెప్పి ఆయనను ఏమి కోరుకుందామని అడుగగా ఆమె మరో రెండు రోజుల్లో మీ తండ్రి గారి ఆబ్దికం వస్తుంది కదా దానికి దత్త స్వామిని భోక్తగా రమ్మని పిలవండి అని చెప్పుతుంది.

సుశీలమ్మ ఆనందం
విష్ణు దత్తుడు దత్తాత్రేయుని వద్దకు వచ్చి స్వామికి నమస్కరించి, తన భార్య చెప్పినట్లుగా స్వామీ మీరు మా ఇంటికి భోక్తగా రావాలి అని కోరుతాడు. అందుకు దత్త ప్రభువు సరే వస్తాను నీవు వెళ్ళి ఏర్పాట్లు చేసుకో అని అభయమిస్తాడు. విష్ణు దత్తుడు, సుశీలమ్మ సాక్షాత్తూ ఆ దత్తుడే తమ ఇంటికి భోక్తగా వస్తున్నందుకు పరమ సంతోషంతో అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు. చివరకు ఆబ్దికం రోజు రానే వస్తుంది. మధ్యాహ్నం వేళ దత్త ప్రభువు భోక్తగా విష్ణు దత్తుడికి ఇంటికి రాగా సుశీలమ్మ విష్ణు దత్తుడు ఎంతో ఆనందముతో స్వామికి కాళ్లు కడిగి ఇంట్లోకి ఆహ్వానిస్తారు.

దంపతులను దీవించిన దత్తుడు
దత్తుడు వచ్చి పీట మీద కూర్చుని మిగతా ఇద్దరు భోక్తలు ఎక్కడ? అని అడిగితే, అప్పుడు ఆ దంపతులకు దత్త ప్రభువు వస్తున్నారనే సంతోషంతో మిగతా ఇద్దరినీ పిలవటం మరచిపోయామని గుర్తుకు వచ్చింది. ఆ సమయంలో మహాసాధ్వి అయిన సుశీలమ్మ అగ్ని దేవుణ్ణి ప్రార్థించగా ఆయన భోక్తగా వచ్చారు. రెండో భోక్తగా సూర్య దేవుడిని పిలువగా ఆయన వచ్చారు. ఆబ్దికం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భోక్తలు ముగ్గురూ దంపతులను దీవించి వెళ్లారు. చివరగా దత్తప్రభువు ఆ దంపతులను ఆశీర్వదిస్తూ మీరు ఇహలోకంలో ధార్మిక జీవనాన్ని గడిపి అంత్యమున వైకుంఠానికి వస్తారని అనుగ్రహిస్తారు. శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో విష్ణు దత్తుడు, సుశీలమ్మ జీవితమంతా ధార్మికంగా గడిపి ఆఖరున విష్ణు సాయుజ్యం పొందారు.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

కోరిన కోర్కెలు తీర్చే మహిమాన్విత 'చింతామణి' గణపతి క్షేత్రం- ఎక్కడ ఉందో తెలుసా? - Chintamani Ganpati Temple

కల్యాణ ప్రాప్తిని కలిగించే 'ఆదిపూరం'! భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే శీఘ్ర వివాహం! - Andal Jayanthi 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.