ETV Bharat / spiritual

వైశాఖ పురాణం 17వ అధ్యాయం- ఈ వ్రతం ఆచరిస్తే విష్ణులోకం ప్రాప్తి! - VAISAKHA PURANAM 17TH CHAPTER

వైశాఖ పురాణం పదిహేడవ అధ్యాయం మీ కోసం

Vaisakha Puranam 17th Chapter
Vaisakha Puranam 17th Chapter (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 14, 2025 at 12:47 AM IST

3 Min Read

Vaisakha Puranam 17th Chapter in Telugu : యమధర్మరాజు తన విచారాన్ని, బాధను బ్రహ్మదేవునికి ఎలా విన్నవించాడో వైశాఖ పురాణం పదిహేడవ అధ్యాయంలో శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకు వివరించిన విధానాన్ని నారద అంబరీషుల సంవాదం ద్వారా ఈ కథనంలో తెలుసుకుందాం.

శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుల సంవాదం
శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో "రాజా! యమధర్మరాజు తన దీనస్థితిని బ్రహ్మకు ఈ విధంగా వివరించసాగాడు" అంటూ వైశాఖ పురాణం పదిహేడవ అధ్యాయాన్ని ప్రారంభించాడు.

యమధర్మరాజు విచారం
వాయుదేవుడు చేసిన ఉపచారాలతో కొంత సేదతీరిన యముడు బ్రహ్మతో "స్వామీ! సర్వలోకపితామహా! బ్రహ్మ! నేను నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించలేకుండా ఉన్నాను. మీ ఆజ్ఞానుసారం నేను జీవుల పాపపుణ్యాలు విచారించి, వారికి తగిన శిక్షణాలను విధిస్తూ ఉండేవాడిని. కాని యిప్పుడు మీ ఆజ్ఞను పూర్వము వలే పాటించలేని స్థితిలో ఉన్నాను. భూలోకంలో కీర్తిమంతుడను రాజు వల్ల నేను నా కార్యమును నిర్వర్తింపలేకున్నాను.

కీర్తిమంతుడు సముద్ర పర్యంతంగా ఉన్న ఈ భూమండలాన్ని వైశాఖమాస వ్రత ధర్మయుక్తముగ పరిపాలించుచున్నాడు. అతని ఆజ్ఞ అనుసరించి అన్ని ధర్మములను విడిచినవారు, తండ్రిని పూజింపనివారు, పెద్దలను గౌరవింపనివారు, తీర్థయాత్రలు మున్నగు మంచి పనులు చేయని వారు, ప్రాణాయామము చేయని వాడు, హోమాలు చేయనివారు, అనేక పాపాలు చేసినవారు వైశాఖమాస వ్రత ధర్మములను పాటించి వారి తండ్రులు, తాతలతోబాటు విష్ణులోకమును చేరుచున్నారు.

ఇది మాత్రమే కాదు! వైశాఖ వ్రతం ఆచరించిన వారి భార్యవైపు వారును, తండ్రి వల్ల ఇతర స్త్రీలకు పుట్టినవారు కూడా నా పాప పట్టికలోని పాపాలు తుడిచి వేసి విష్ణులోకాన్ని చేరుతున్నారు. సామాన్యముగ ఒక వ్యక్తి చేసిన కర్మ ఫలం ఆ ఒక్కరికే చెందుతుంది. కానీ వైశాఖమాస వ్రతము వంశంలో ఒకడు చేస్తే, అతనితోపాటు అతని తండ్రి వైపువారు, తల్లి వైపువారు మొత్తము ఇరవైఆరు తరాలవారు వారు చేసిన పాపాలను పోగొట్టుకుని విష్ణులోకము చేరుచున్నారు.

వీరితో పాటు వైశాఖవ్రతమును చేసిన వారి భార్యల వైపు వారును, భర్తల వైపువారును విష్ణులోకమును చేరుచున్నారు. యజ్ఞ యాగాదులు చేసిన వారికి, తీర్ధయాత్రలు చేసిన వారికి, ప్రయాగాది తీర్ధాలలో స్నానం చేసిన వారికి, కాశీక్షేత్రమున మరణించిన వారికి కూడా లభించని విష్ణులోకం వైశాఖ వ్రతం ఆచరించిన వారికి కలుగుతోంది.

వైశాఖమున ప్రాతఃకాల స్నానము చేసి విష్ణుపూజ చేసి వైశాఖ మహత్మ్యమును విని యధాశక్తి దానములు చేసి జీవులు సులభముగ విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖవ్రతము చేసిన పాపాత్ములు కూడా విష్ణులోకము చేరుట సరైనదిగా నాకు అనిపించుటలేదు. కీర్తిమంతుని ఆజ్ఞచే వైశాఖ వ్రతము పాటించి మంచి కర్మలు చేసినవారు, చేయనివారు, శుద్ధులు, అపరిశుద్ధులు, వారువీరు అననేల అందరును శ్రీహరి లోకమును చేరుచున్నారు.

ఓ సృష్టికర్తా!
ఇలా ఉపేక్షిస్తూ పోతే స్వర్గ నరకాలు శూన్యములై పోతాయి. పలుమార్లు తుడవబడిన యీ పాప పట్టిక, యమదండము వీనిని మీ పాదాల వద్ద ఉంచుతున్నాను. వీనిని యేమి చేస్తారో మీ యిష్టము.

కీర్తిమంతుని వంటి పుత్రుని కన్న వాని తల్లి వీరమాత. ఇందులో సందేహము లేదు. కీర్తిమంతుడు సామాన్యుడు కాదు. నా తలరాతనే మార్చినాడుకదా! ఇప్పటి వరకు ఇలా నా తలరాతను ఎవరూ మార్చలేదు. ఇది అపూర్వము! కీర్తిమంతుడు అందరిచే వైశాఖ వ్రతాన్ని ఆచరింపచేసి, స్వయముగా తాను కూడా హరి భక్తుడై జనులందరిని విష్ణులోకమునకు పంపించి ఘనకీర్తిని సాధించాడు. ఇట్టివారు మరొకరు లేరు" అని యముడు తన బాధను బ్రహ్మకు వివరించెను.

శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో "రాజా! ఈ విధంగా యమరాజు బ్రహ్మతో తన విచారాన్ని వ్యక్తం చేసాడు. ఈ సమస్యను బ్రహ్మ ఈ విధంగా పరిష్కరించాడో ముందు ముందు తెలుసుకుందాం" అని అంటాడు.

నారదుడు అంబరీషునితో ఈ కథను ఇక్కడవరకు చెప్పి వైశాఖ పురాణం పదిహేడవ అధ్యాయాన్ని ముగించాడు.

వైశాఖ పురాణం పదిహేడవ అధ్యాయం సమాప్తం.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.