ETV Bharat / spiritual

స్కంద షష్ఠి వ్రత మహత్యం - భక్తిశ్రద్ధలతో కుమార స్వామిని పూజిస్తే - సంతాన, సౌభాగ్యాలు లభ్యం!

స్కంద షష్ఠి పూజా విధానం - ఉపవాస వత్రం - పూజాఫలం వివరాలు మీ కోసం!

Kumara Swamy
Skanda (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 6, 2024, 6:51 PM IST

Skanda Shasti Significance : స్కంద షష్ఠి వ్రతం ప్రతినెలా హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగ. ఈ రోజున వేకువజామునే లేచి భక్తులు ఉపవాస వ్రతాన్ని పాటిస్తారు. అసలు స్కంద షష్ఠి ఎందుకు జరుపుకుంటారు? దాని ప్రాముఖ్యత ఏమిటి? కార్తిక మాసంలో స్కంద షష్ఠి ఎప్పుడు వచ్చింది? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

స్కంద షష్ఠి విశిష్టత
స్కంద షష్ఠి అనేది హిందువులు జరుపుకునే ఒక ముఖ్యమైన పర్వదినం. ఈ స్కంద షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు. దీన్ని ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాలలో ఎక్కువగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసం పాటించి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తారు. అసలేంటీ స్కంద షష్ఠి? ఎందుకు జరుపుకుంటారు? దాని ప్రాముఖ్యత ఏంటి? కార్తిక మాసంలో స్కంద షష్ఠి ఎప్పుడు వచ్చింది? స్కంద షష్ఠి పూజా విధానమేమిటి? అనే వివరాలు తెలుసుకుందాం.

ప్రతి మాసంలో స్కంద షష్ఠి
ప్రతి నెలా శుక్ల పక్షంలోని శుద్ధ షష్ఠి రోజున స్కంద షష్ఠి జరుపుకుంటారు. కార్తిక మాసంలో స్కంద షష్ఠి నవంబర్ 7వ తేదీ(గురువారం)న వచ్చింది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు పూజకు శుభసమయం.

స్కంద షష్ఠి వెనుక పౌరాణిక గాథ
వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం, తారకాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని నుంచి వరాలను పొంది అపారమైన శక్తిని కూడగట్టుకొని భూలోకంలో విధ్వంసం సృష్టించడం ప్రారంభించాడు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు శివుని ఆజ్ఞ ప్రకారం దేవ గణాలతో కలిసి 6 రోజుల పాటు యుద్ధం చేసి అతనిని ఓడిస్తాడు. సుబ్రహ్మణ్యుడు తారకాసురుని సంహరించిన రోజు శుక్లపక్ష షష్ఠి తిథి కావడంతో ఆ నాటి నుంచి ప్రతి మాసం శుక్లపక్ష షష్ఠి రోజు కార్తికేయ విజయాన్ని పురస్కరించుకొని స్కంద షష్ఠి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

స్కంద షష్ఠి పూజా విధానం
స్కంద షష్ఠి రోజు ఉదయాన్నే నిద్ర లేచి తలారా స్నానం చేసి పూజామందిరంలో సుబ్రహ్మణ్యుని చిత్రపటాన్ని గంధం, కుంకుమలతో అలంకరించి ఆవునెయ్యితో దీపారాధన చేయాలి. ఈ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి. స్కంద షష్ఠి రోజున కార్తికేయుడితో పాటు ఆది దంపతులైన శివపార్వతులను కూడా పూజించాలి. అష్టోత్తర శతనామాలతో పూజను ముగించి పండ్లు, కొబ్బరికాయ, బెల్లం అన్నం నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం కార్తికేయ కథను చదువుకుని శిరస్సున అక్షింతలు వేసుకోవాలి. సమీపంలోని ఆలయానికి వెళ్లి నాగ ప్రతిష్టకు క్షీరాభిషేకం చేసి 11 ప్రదక్షిణలు చేయాలి.

ఉపవాస విరమణ
సాయంత్రం తిరిగి స్నానం చేసి యథావిధిగా పూజ పూర్తి చేసుకుని నక్షత్ర దర్శనం చేసి భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి.

స్కందషష్టి పూజాఫలం
ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష షష్ఠి రోజు స్కంద షష్ఠి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. అలాగే సంతానం ఉన్నవారికి సంతానం సుఖసంతోషాలతో దీర్ఘాయువుతో ఉంటారు. సుబ్రహ్మణ్యుడు తారకాసురునిపై విజయం సాధించిన రోజున జరుపుకునే స్కందషష్ఠి వ్రతం ఆచరించే వారికి చేపట్టిన పనిలో విజయం సిద్ధిస్తుంది. రానున్న స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్యుని మనం కూడా పూజిద్దాం. సంతాన సౌభాగ్యాలను పొందుదాం.

ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.