ETV Bharat / spiritual

శని బాధలు పోవాలా? సకల శుభాలు కలగాలా? శనివారం ఇలా చేస్తే చాలు! - SHANI REMEDIES IN TELUGU

ఏలినాటి శని, అర్దాష్టమ శని, అష్టమ శని బాధల నివారణకు పరిహారాలు

shani remedies in telugu
shani remedies in telugu (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : April 18, 2025 at 5:54 PM IST

3 Min Read

Shani Remedies In Telugu : హిందూ సంప్రదాయం ప్రకారం శనివారం ఎంతో ప్రత్యేకమైనది. శనివారాన్ని స్థిరవారమని కూడా అంటారు. గ్రహాల గమనం వలన ఏలినాటి శని, అర్ధాష్టమ శని వచ్చినప్పుడు మనం అనుకున్న పనులు ఆలస్యం కావడం కానీ, ఆరోగ్య సమస్యలు ఏర్పడడం గాని జరుగుతుంటాయి. ఇవన్నీపెద్ద సమస్యలు కానప్పటికీ, మన నిత్య జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలాంటప్పుడు శని బాధలు పోగొట్టుకొని సకల శుభాలు పొందాలంటే శనివారం ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

శనివారం విశిష్టత
వారంలో ఏడో రోజైన శనివారానికి చాలా ప్రత్యేకత ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం శనివారం శనిదేవుని ఆరాధనకు ప్రధానమైనదిగా భావిస్తారు. అంతే కాదు, ఈ రోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామికి, ఆంజనేయస్వామికి ఎంతో ప్రీతికరమైనది అంటారు. ఇంతటి విశిష్టమైన శనివారాన్ని కొందరు చెడు దినంగా భావించి కొత్త పనులను ప్రారంభించరు.

కర్మఫలాన్ని అందించే శనిదేవుడు
ఈ సందర్భంగా మనం ఒక విషయాన్ని గ్రహించాలి. హిందూ పురాణాల ప్రకారం శని దేవుడిని కర్మ, న్యాయాధిపతిగా పరిగణిస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అన్నింటి కంటే నెమ్మదిగా ప్రయాణించేది శని గ్రహమే. అందుకే శనికి మందగమనుడు అనే పేరు కూడా ఉంది. శని దేవుడు మంచి చేసిన వారికి మంచి, చెడు చేసిన వారికి చెడు ఫలితాలను ఇస్తుంటాడు. అంతేకాదు పూర్వజన్మల కర్మల ఆధారంగా శుభ అశుభ ఫలితాలను ఇచ్చేది కూడా శనిదేవుడే!

శని అంటే భయం వద్దు
చాలా మంది శని దేవుని పేరు చెబితే భయపడిపోతుంటారు. ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని నమ్ముతారు. కానీ మనం అనుభవించే కష్ట సుఖాలు మనం చేసిన కర్మల ఆధారంగా వస్తాయి కానీ, శని వలన కాదన్న విషయాన్ని గ్రహించాలి. నిజాన్ని శని కష్టాలను ఇవ్వడం ద్వారా మన పాపాలను తొలగించి పునీతుల్ని చేస్తాడు.

శని దోషాలకు పరిహారాలు
ఏలినాటి శని, అర్దాష్టమ శని, అష్టమ శని ప్రభావం వలన కలిగే చెడు ఫలితాలను తగ్గించడానికి శనివారం కొన్ని విశేషమైన కార్యక్రమాలను చేయాలని శాస్త్రం చెబుతోంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం

  • శనివారం నాడు నలుపు రంగు దుస్తులు ధరించి నవగ్రహాలున్న ఆలయంలో శనీశ్వరునికి తైలాభిషేకం చేయిస్తే మంచిది.
  • శనీశ్వరుని వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించి, గుడం అంటే బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ నైవేద్యాన్ని ఇంటికి తీసుకెళ్లకూడదు.
  • నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వల్ల శని అనుగ్రహానికి పొందవచ్చు.
  • శనివారం వేంకటేశ్వరుని పూజిస్తే శని దేవుని అనుగ్రహం ఉంటుంది. ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించి వేంకటేశ్వరుని ఆలయాన్ని సందర్శించి కొబ్బరికాయ కొట్టి మొక్కుకుంటే మొక్కులు నెరవేరుతాయి.
  • హిందూ పురాణాల ప్రకారం శనివారం ఆంజనేయ స్వామిని కొలిచిన వారికి శని బాధలు ఉండవని అంటారు.
  • శనివారం ఆంజనేయస్వామికి 11 ప్రదక్షిణాలు చేయాలి. వీలుంటే హనుమంతునికి శనివారం వడమాల సమర్పిస్తే శని బాధలు తొలగిపోతాయని నమ్మకం.
  • శనివారం ఆంజనేయునికి ఆకుపూజ చేయిస్తే ఎలాంటి కష్టాలు అయినా పోతాయి.
  • శనివారం పరమేశ్వరునికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైనది. ఒక నియమం ప్రకారం అయిదు శనివారాలు కానీ తొమ్మిది శనివారాలు కానీ శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం.
  • శనివారం శివాలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు కింద దీపం పెట్టి, రావి చెట్టు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలంగా పీడిస్తున్న సమస్యలు తొలగిపోతాయని గురువులు చెబుతారు.
  • శనివారం నాడు ఇనుము వస్తువులు, నల్ల నువ్వులు, నూనె, ఉప్పు వంటి పదార్ధాలు కొనరాదని పెద్దలు చెబుతారు.
  • శనివారం ఈ నియమాలు పాటించడం వలన ఏలినాటి శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుందని శాస్త్రవచనం. శుభం భూయాత్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.