ETV Bharat / spiritual

మోక్షాన్ని ప్రసాదించే పంచారామాలు- క్షేత్రాల విశేషాలివే! - PANCHARAMALU IN TELUGU

పంచారామాలు ఎక్కడెక్కడ ఉన్నాయి?

Pancharamalu In Telugu
Pancharamalu In Telugu (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : June 16, 2025 at 2:19 AM IST

3 Min Read

Pancharamalu In Telugu : భోళాశంకరునికి దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో జ్యోతిర్లింగాలు, పంచభూతలింగాలు, పంచారామాలు ప్రసిద్ధి చెందినవి. ప్రత్యేకించి ఈ పంచారామాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం విశేషం. మోక్షద్వారాలుగా పేరుగాంచిన పంచారామాలు అసలు ఎక్కడ ఉన్నాయి? ఆ క్షేత్రాల విశేషాలు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

పంచారామాలు అంటే ఏమిటి? అవి ఎన్ని?
స్కాందపురాణం ప్రకారం, శివుడు తారకాసురుడిని సంహరించినప్పుడు, అతడి గొంతులోని ఆత్మలింగం ఐదు ముక్కలైంది. ఆ ఐదు ముక్కలను దేవతలు ఐదుచోట్ల ప్రతిష్ఠించారని నమ్ముతారు. ఈ ఐదింటిని పంచారామ క్షేత్రాలని అంటారు.

పంచారామాలు ఎక్కడెక్కడ ఉన్నాయి?
దాక్షారామం : పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని "భీమేశ్వరుడు" అని పిలుస్తారు. స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పై అంతస్తు నుండి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు మరియు సగభాగం నలుపుతో ఉంటుంది. ఇక్కడ దక్షప్రజాపతి దక్షయజ్ఞం నిర్వహించాడు కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చినదని అంటారు.

అమరారామం : పంచారామల్లో రెండవదైన 'అమరారామం' గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానదీ తీరములో వెలసి ఉంది. ఇక్కడ స్వామిని "అమరేశ్వరుడు" అని పిలుస్తారు. గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో, తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది. అమరేశ్వరుడైన 'ఇంద్రుడు' ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి, ఈ ఆలయానికి తన నగరమైన అమరావతి పేరునే పెట్టారు అని పురాణాల ద్వారా తెలుస్తోంది.

క్షీరారామం : క్షీరారామం పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు. ఇక్కడ స్వామిని "క్షీరారామలింగేశ్వర స్వామి" అని పిలుస్తారు. ఈ స్వామివారిని త్రేతాయుగ కాలంలో 'సీతారాములు' కలిసి ప్రతిష్ఠించారట. ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కథ ఉంది. 'శివుడు' తన బాణాన్ని భూమిలోనికి వెయ్యగానే భూమి నుండి పాలధార వచ్చిందట. క్షీరం అనగా పాలు, దీనిమూలంగా ఈ ప్రాంతానికి క్షీరారామమని, క్షీరపురి అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఇదే 'పాలకొల్లుగా' మార్పు చెందింది. ఇక్కడి స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఆలయం 125 అడుగుల ఎత్తులో '9' గోపురాలుతో అత్యంత సుందరంగా ఉంటుంది.

సోమారామం : పంచరామాల్లో నాల్గవదైన "సోమారామము". పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో ఉంది. ఇక్కడ స్వామి వారిని "సోమేశ్వరుడు" అని పిలుస్తారు. ఇచ్చట 'శివలింగానికి' ఒక ప్రత్యేకత ఉంది. మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే 'శివలింగం', అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది. ఇక్కడ స్వామిని 'చంద్రుడు' ప్రతిష్ఠించాడు. కాబట్టి దీనికి 'సోమారామము' అని పేరు వచ్చింది.

కుమారభీమారామం : పంచారామాల్లో ఐదవది చివరిదైన 'కుమారభీమారామము', తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు. ఇక్కడ స్వామిని "కాల బైరవుడు" అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన, చాళుక్య రాజయిన భీముడు ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటేరకంగా, నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుందని స్థానికులు అంటారు.

పంచారామాలు ఒకే రోజు దర్శించడం వల్ల మోక్షం ప్రాప్తిస్తుందని స్కంద పురాణం ద్వారా తెలుస్తోంది. అందుకే కార్తికమాసం, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో భక్తులు ఈ పంచారామాలు విశేషంగా దర్శిస్తుంటారు.

మోక్షాన్ని కోరుకునే ప్రతి ఒక్కరు తప్పక దర్శించాల్సిన క్షేత్రాలు ఈ పంచారామాలు.

ఓం నమః శివాయ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.