Mysterious Shiva Temple : మన దేశంలో అనేక ప్రాచీనమైన ఆలయాలున్నాయి. వాటిల్లో కొన్ని సైన్స్‌కు అందని మిస్టరీలతో శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతున్నాయి. అలాంటి వాటిల్లో ఓ అద్భుతమైన శివాలయం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
లోపల వణికించే చలి, బయట మండించే ఎండ!
భారతదేశంలోని తూర్పు ప్రాంతంలో ఉషోగ్రతలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలలో ఒడిశా ఒకటి. ఈ రాష్ట్రంలోని కుంహద పర్వతం మీద ఉన్న శివాలయం ఎంతో ప్రత్యేకమైనది. ఈ పర్వతం మీద శివపార్వతుల ఆలయం ఉంది. ఆలయం వెలుపల విపరీతమైన వేడి ఉండగా, గర్భాలయంలో మాత్రం చలిగా ఉంటుంది. ఇంకా విచిత్రమేమిటంటే ఆలయం బయట వేడి పెరిగే కొద్దీ గుడి లోపల ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఈ ఆలయ విశేషాలు, స్థలపురాణం గురించి తెలుసుకుందాం.
భిన్న వాతావరణాలు ఒకేచోట
ఆదిదంపతులైన శివపార్వతుల ఆలయాలు ఎక్కువగా కొండకోనల్లో ఉంటాయి. ఇలాంటి ఆలయాల వెనుక అనేక పురాణ గాధలు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా కొన్ని ఆలయాల్లో సైన్స్ కూడా చేధించలేని రహస్యాలను గురించి వింటుంటే ఆశ్చర్యపోతాం. ఒడిషాలోని కుంహద పర్వతం మీద వెలసి ఉన్న ఈ శివపార్వతుల ఆలయం అనేక మిస్టరీలకు నిలయంగా ఉంది. కుంహద పర్వతం విపరీతమైన వేడిగా ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా శివాలయంలోని గర్భాలయంలో ఎముకలు కొరికే చలి ఉంటుంది. ఇంకా బయట వేడి పెరిగే కొద్దీ లోపల చలి మరింతగా పెరుగుతుంది. ఈ భిన్న వాతావరణాలు ఒకేచోట ఉండడానికి కారణం ఇప్పటివరకు ఎవరూ కనిపెట్టలేదు. మంచు కొండపై నివసించే శివయ్యకు అనుకూలంగా గర్భాలయంలో ఇలాంటి వాతావరణం ఉంటుందని భక్తుల కధనం.
అన్యోన్య దాంపత్యం సిద్ధినుంచే శివపార్వతుల దర్శనం
ఈ మిస్టరీ చేధించడానికి ఎంత ప్రయతించినా అంతు చిక్కలేదు. అయితే ఇక్కడ శివపార్వతులను దర్శించుకుంటే అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుందని విశ్వాసం. అందుకే ఒడిషా రాష్ట్ర ప్రజలతో పాటు, ఇరుగు పొరుగు రాష్ట్రాలైన బెంగాల్, ఆంధ్రరాష్ట్ర ప్రజలు కూడా ఈ ఆలయాన్ని దర్శించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. నిత్యం భక్తుల రద్దీతో సందడిగా ఉండే ఈ మిస్టరీ ఆలయాన్ని ఒక్కసారి దర్శించినా జీవితకాలపు అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.