ETV Bharat / spiritual

కర్కాటకంలో కుజ చంద్రుల కలయిక- ఈ 3రాశులవారికి రాజయోగం- మీది ఉందేమో చెక్​ చేసుకోండి? - MAHA LAKSHMI YOGA

కర్కాటకంలో కుజ చంద్రుల కలయిక- ఆ రాశుల వారికి అదృష్టమోగం

Maha Lakshmi Yoga Zodiac Signs
Maha Lakshmi Yoga Zodiac Signs (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 11, 2025 at 6:56 AM IST

2 Min Read

Maha Lakshmi Yoga Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు 12 రాశులలో సంచారం చేస్తూ, ఒక నిర్ణీత సమయంలో తమ తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. గ్రహాల సంచారం, రాశుల్లో గ్రహాల సంయోగం వలన 12 రాశులపై మంచి, చెడుల ప్రభావం ఉంటుంది. ఈ నెలలో కర్కాటక రాశిలో జరుగనున్న కుజ చంద్రుల సంయోగం ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఈ కథనంలో చూద్దాం.

కర్కాటక రాశిలో మహాలక్ష్మీ రాజయోగం
త్వరలో కుజుడు తన రాశిని మార్చుకుని కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ప్రస్తుతం కర్కాటకంలో చంద్రుడు కూడా సంచరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుజ చంద్రుల సంయోగంతో కర్కాటక రాశిలో మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడనుంది. ఈ మహాలక్ష్మి రాజయోగం వల్ల కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు ఏది పట్టినా బంగారం అవుతుంది. అదృష్టవంతులు అవుతారు. వీరు ఏ పని మొదలు పెట్టినా విజయవంతం అవుతుంది. ఆ రాశులు ఏమిటో చూద్దాం.

కన్యా రాశి: కర్కాటకంలో ఏర్పడిన మహాలక్ష్మి రాజయోగం కన్యా రాశి వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరు ఏ పని మొదలు పెట్టినా విజయాన్ని సాధిస్తారు. ఊహించని విధంగా ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వ్యాపారులకు కొత్త వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. అన్ని రంగాల వారు శ్రమకు తగిన ఫలితాన్ని అందుకుంటారు. లక్ష్మీదేవి కటాక్షంతో అన్ని కోరికలు నెరవేరుతాయి. శ్రీలక్ష్మి అష్టోత్తరం పఠించడం శుభప్రదం.

తులా రాశి: కర్కాటకంలో ఏర్పడిన మహాలక్ష్మి రాజయోగం వల్ల తులా రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగులు మంచి విజయాన్ని అందుకుంటారు. కొత్త అవకాశాలు, ఆదాయ వనరులు ఏర్పడతాయి. చాలా కాలం నుంచి పరిష్కారం కాని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని రంగాల వారికి శుభ సమయం. ఆస్తిని వృద్ధి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. కనకధారా స్తోత్ర పారాయణం శుభకరం.

మకర రాశి: కర్కాటకంలో ఏర్పడిన మహాలక్ష్మి రాజయోగం వల్ల ప్రయోజనం పొందే మరో రాశి మకర రాశి. ఈ రాశి వారు కూడా మహాలక్ష్మి రాజ యోగం వల్ల శుభ ఫలితాలను అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. మునుపెన్నడూ చూడని ఆర్ధిక లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్థులు ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు. పదోన్నతులు, జీతం పెంపు వంటి ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కృషికి తగిన గుర్తింపుని పొందుతారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అష్టలక్ష్మి స్తోత్రం పఠించడం ఉత్తమం.

గ్రహాల స్థాన మార్పుల వల్ల సంభవించే ఫలితాలు తాత్కాలికమే! "కృషితో నాస్తి దుర్భిక్షం" అని పెద్దలు అన్నట్లుగా ఏది సాధించాలన్నా చేసే పని పట్ల గౌరవం, పట్టు వీడని కృషి అవసరం.

శుభం భూయాత్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.