ETV Bharat / spiritual

'ఈ 3 వస్తువులు కలిపి చీమలకు పెట్టండి - మీ డబ్బు రెట్టింపు అవ్వడం ఖాయం!' - Money Remedies in Astrology

Astrology Remedies for Money : లైఫ్​లో ధనం సంపాదించడం ఒక ఎత్తైతే.. దాన్ని నిలబెట్టుకోవడం, రెట్టింపు చేసుకోవడం మరొక ఎత్తు. అయితే.. మనం కూడబెట్టుకున్న డబ్బు ఒకటికి పదిరెట్లు కావాలంటే కొన్ని శక్తి వంతమైన పరిహారాలను పాటించాలని ప్రముఖ జ్యోతిష్యుడు 'మాచిరాజు కిరణ్​ కుమార్​' చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2024, 12:13 PM IST

Money
Astrology Remedies for Money (ETV Bharat)

Money Remedies in Astrology : సంపన్నులు కావాలంటే.. ధనం సంపాదిస్తే సరిపోదు. దాన్ని నిలబెట్టుకోవాలి, రెట్టింపు చేసుకుంటూ వెళ్లాలి. కానీ.. చాలా మంది విషయంలో సంపాదన ఉన్నా.. నిలబెట్టుకోలేరు. వృద్ధి చేసుకోలేరు. ఇలాంటి వారు కొన్ని పరిహారాలు చేయడం వల్ల ధనవృద్ధి కలుగుతుందని ప్రముఖ జ్యోతిష్య పండితుడు 'మాచిరాజు కిరణ్​ కుమార్​' వివరిస్తున్నారు.

నల్లటి ఉట్టి : నల్లటి ఒక ఉట్టిని తీసుకువచ్చి వంటింట్లో వేలాడదీయాలట. ఏ ఇంట్లో అయితే, నల్లటి ఉట్టి వేలాడుతుంటుందో.. ఆ గృహంలో డబ్బు మల్టిపుల్​ టైమ్స్​ పెరుగుతుందని రహస్య పరిహార శాస్త్రంలో పేర్కొన్నారని ఆయన తెలిపారు.

గోధుమల్లో ఇవి కలపండి: చాలా మంది గోధుమ పిండి కోసం గోధుమలను మర ఆడించడానికి ఇస్తుంటారు. అయితే.. గోధుమలు మర ఆడించడానికి ఇచ్చేముందు అందులో 11 తులసి ధలాలు, రెండు పసుపుకొమ్ములు వేయండి. తర్వాత వాటిని మర ఆడించడానికి ఇవ్వాలట. అప్పుడు వచ్చిన గోధుమ పిండిని ఉపయోగిస్తే.. అనేక మార్గాల్లో ధనం వస్తుందట.

మేడిచెట్టు వేరు : ఈ చెట్టు వేరుకి చాలా శక్తి ఉంది. మీకు మేడిచెట్టు కనబడితే దాని వేరును ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసివచ్చినటువంటి రవి పుష్యయోగమున్న రోజు గానీ.. లేదా గురువారం పుష్యమి నక్షత్రం కలిసివచ్చినటువంటి గురు పుష్యయోగమున్న రోజు ఇంటికి తీసుకురండి. దానిని పూజ గదిలో ఉంచండి. ఇలా చేస్తే ఇంట్లో కనకవర్షం కురుస్తుందని మాచిరాజు కిరణ్​ కుమార్ తెలిపారు. వీలైతే మేడిచెట్టు వేరుని తాయత్తులాగా శరీరానికి కట్టుకోవాలని సూచిస్తున్నారు.

మర్రి చెట్టు ఆకులు : ఒకవేళ మీకు మేడిచెట్టు వేర్లు దొరకపోతే.. మర్రి చెట్టు ఆకులతో ఒక పరిహారాన్ని చేయవచ్చు. గురు పుష్యయోగమున్న రోజు లేదా రవి పుష్యయోగమున్న రోజున ఆరు మర్రిచెట్టు ఆకులను ఇంటికి తీసుకురండి. ఆ ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టండి. వాటిపై తడి పసుపుతో స్వస్తిక్​ గుర్తు వేసి పూజ గదిలో పెట్టి, అవి ఎండిపోయేంత వరకు అలానే ఉంచాలట. మర్రి చెట్టు ఆకులు ఇంట్లోని పూజగదిలో ఉండడం వల్ల ధనవృద్ధి కలుగుతుందని మాచిరాజు కిరణ్​ తెలిపారు.

మూడు వస్తువులు చీమలకు పెట్టండి: సహజంగా అందరూ చీమలకు చక్కెర పెడుతుంటారు. కానీ, ఇలా చేయడం కంటే.. వీలైతే ఉదయం నిద్రలేవగానే ఎండు కర్జూరపు పొడి, పంచదార, కొబ్బరి కలిపి చీమలకు పెట్టండి. ఇలా చేస్తే ధనవృద్ధి కలుగుతుందని సూచిస్తున్నారు.

ముడి పత్తి : ముడిపత్తిని తీసుకుని దానికి కొద్దిగా పసుపు రాయండి. 'శ్రీ హనుమతే నమః' అని 11 సార్లు చెప్పి ఉద్యోగులు ఆఫీస్​ టేబుల్లో పెట్టుకోండి. మీరు వ్యాపారం చేస్తుంటే.. గల్లా పెట్టెలో పెట్టుకోండి. ఇలా చేస్తే ఆదాయం, ధనవృద్ధి పెరుగుతుందని కిరణ్ కుమార్​ చెప్పారు.

Note: పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవి కూడా చదవండి :

బెడ్ మీద నుంచి కాలు కిందపెట్టగానే ఈ పని చేయండి - మీ జీవితం అద్భుతంగా సాగుతుంది!

అప్పుల బాధలు వేధిస్తున్నాయా? ఆ రోజు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే సమస్య తీరిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.