ETV Bharat / spiritual

మిథున సంక్రమణ రోజు ఏర్పడనున్న అరుదైన యోగం- ఈ రాశుల వారి పంట పండినట్లే! - MITHUNA SANKRANTI 2025

మిథున సంక్రమణ గురించి మీ కోసం!

Mithuna Sankranti 2025
Mithuna Sankranti 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : June 15, 2025 at 12:00 AM IST

3 Min Read

Mithuna Sankranti 2025 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ప్రతి నెల రాశి మారుతుంటాడు. ఈ నేపథ్యంలో సూర్యుడు జూన్ 15 వ తేదీ ఆదివారం రోజు మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ కారణంగా ఏర్పడనున్న అరుదైన యోగం కొన్ని రాశులకు శుభ ఫలితాలనివ్వబోతోంది. ఆ రాశులేమిటో ఈ కథనంలో చూద్దాం.

మిథునరాశిలో ఏర్పడనున్న త్రిగ్రాహి యోగం
మిథునరాశిలో సూర్యుని సంచారం ఈ నెల 15 వ తేదీ నుంచి మొదలు కానుంది. అదే సమయంలో ఇప్పటికే మిథునరాశిలో బుధ, గురు గ్రహాల సంచారం ఉన్నందున సూర్యుడు కూడా కలవడంతో మూడు గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఈ త్రిగ్రాహి యోగం ఏయే రాశులకు ఎలాంటి శుభ ఫలితాలు ఇవ్వనుందో చూద్దాం.

మిథున రాశి : మిథునరాశిలో సూర్యుడు మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. మిథునరాశి వారికి ఈ సూర్యసంచారం లాభదాయకంగా ఉంటుంది. సూర్యుడు, బుధుడు, బృహస్పతి కలయిక ద్వారా శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతోంది. ఈ సమయంలో వీరి ఆత్మవిశ్వాసం, రెట్టింపవుతుంది. వ్యాపారులకు శుభయోగాలుంటాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందవచ్చు. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉండవచ్చు. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగవుతాయి. సమాజంలో గౌరవం, పదవీయోగం, ప్రతిష్ట, ఆర్థిక ప్రయోజనాలను మెండుగా ఉంటాయి. ఈ నెలరోజులు ఆదిత్య హృదయం పారాయణ చేయడం శ్రేష్టం.

సింహరాశి : సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుని మిథున సంచారం సింహరాశి వారికి అనేక లాభాలను మోసుకొస్తుంది. నూతన ఆదాయ వనరులను ఏర్పడుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగులు తమ శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. పదోన్నతి అవకాశాలు ఉంటాయి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. లక్ష్యసాధనలో విజయం సాధిస్తారు. ఈ నెలరోజులు సూర్యాష్టకం పఠించడం ద్వారా శ్రేయస్సు కలుగుతుంది.

తుల రాశి : మిథునంలో సూర్య సంచారం తులారాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే సూచనలు ఉన్నాయి. ధనలాభాలు ఉంటాయి. విదేశీ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్థులకు పదోన్నతి లభిస్తుంది. తీర్ధయాత్రలు, ధార్మిక ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. ఈ నెలరోజులు క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేయడం సత్ఫలితాన్నిస్తుంది.

కుంభరాశి : మిథునంలో సూర్య సంచారం కుంభ రాశి వారికి ఫలప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారు సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు సత్వర ఫలితాన్నిస్తాయి. ఆకస్మిక ఆర్థిక లాభాలు, కొత్త ఆదాయ వనరులు కలుగవచ్చు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఈ నెలరోజులపాటు ప్రతిరోజూ ద్వాదశాదిత్యులను స్మరించుకోవడం శుభప్రదం.

ధనుస్సు : మిథునంలో సూర్య సంచారం ధనుస్సురాశి వారికి శుభ ఫలితాలనిస్తుంది. ఈ సంచారం వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని తెస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు, స్థానచలనం వంటి సానుకూల మార్పులు ఉండవచ్చు. ఆకస్మిక ధన లాభాలకు అవకాశాలు ఉన్నాయి. ఈ నెల రోజులపాటు సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే ఆరోగ్యం, శ్రేయస్సు కలుగుతాయి.

సూర్యుడు ప్రతినెలా ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు సాధారణంగా రాశిఫలితాలలో మార్పులు ఉంటాయి. అయితే ఈ ఫలితాలను ప్రామాణికంగా తీసుకుంటూనే, కృషి, దీక్ష, పట్టుదల ఉంటేనే చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుందని గుర్తెరగాలి.

శుభం భూయాత్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.