ETV Bharat / spiritual

కార్తికంలో "దీపదానం" చేస్తున్నారా? - ఈరోజున దానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగమట! - DEEPA DANAM IN KARTHIKA MASAM

-కార్తిక మాసంలో దీపదానానికి ఎంతో ప్రాముఖ్యత -ఈ దీపం దానం చేస్తే రాజయోగం

Deepa Danam in Karthika Masam
How to Do Deepa Danam (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2024, 11:15 AM IST

How to Do Deepa Danam in Karthika Masam: పరమ పవిత్రమైన కార్తీక మాసం.. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసం ఆధ్యాత్మిక సాధనకు, మోక్షసాధనకు విశిష్టమైనది. ప్రత్యేకించి సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు, ఆ తర్వాత చేసే దానాలు, ఉపవాసాలకు గొప్ప శక్తి ఉందని స్కాంద పురాణ అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం వివరిస్తోంది. అయితే కార్తిక మాసంలో అన్ని దానాలు ఒక ఎత్తైతే దీపదానం మరో ఎత్తని చెబుతారు. ఎందుకంటే ఈ మాసంలో దీపదానానికి అంత విశిష్టత ఉంది. మరి ఈ మాసంలో దీపదానం ఎలా చేయాలి? ఏఏ తిథుల్లో చేస్తే మంచిది? ఎన్ని వత్తులు వేసి దానం చేయాలి? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

దీపదానం ఎలా చేయాలి: కార్తిక మాసంలో దీపదానం చేయడం వల్ల శివకేశవుల సంపూర్ణ అనుగ్రహంతో పాటు సంవత్సరం మొత్తం సకల శుభాలు సిద్ధిస్తాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. దీపం ఎలా తయారు చేయాలి? ఎక్కడ దానం ఇవ్వాలో కూడా చెబుతున్నారు. ఆ వివరాలు చూస్తే..

  • దీపదానం చేయాలనుకునే వారు తలస్నానం చేయాలి.
  • గోధుమపిండి తీసుకుని అందులో కొద్దిగా బెల్లం తురుము, ఆవుపాలు పోసుకుని కలుపుతూ పిండి దీపం తయారు చేయాలి.
  • ఆ తర్వాత పైడిపత్తి తీసుకుని స్వయంగా చేతిలో నలుపుతూ వత్తులు చేయాలి.
  • ఇలా తయారు చేసిన వత్తులను పిండి దీపంలో పెట్టి ఆవు నెయ్యి పోసి వెలిగించాలి.
  • ఇలా వెలిగించిన దీపాలను శివాలయం లేదా విష్ణు ఆలయం ప్రాంగణం, నదీ తీరం, రావి చెట్టు, తులసి కోట, ఉసిరి చెట్టు, మర్రిచెట్టు లేదా గృహంలో ఎక్కడైనా దీపదానం చేయవచ్చని మాచిరాజు చెబుతున్నారు.

ఎన్ని దీపాలు దానం చేస్తే ఎలాంటి ఫలితం:

  • కార్తిక మాసంలో ఒక దీపాన్ని వెలిగించి దానం ఇస్తే చిన్న చిన్న పాపాలు తొలగిపోతాయని చెబుతున్నారు.
  • పది దీపాలు వెలిగించి దానం ఇస్తే మహా పాపాలు తొలగిపోతాయని వివరిస్తున్నారు.
  • వంద దీపాలు వెలిగించి దానం ఇస్తే శివలోకం సిద్ధిస్తుందని చెబుతున్నారు.
  • వంద కంటే ఎక్కువ దీపాలు వెలిగించి ఇస్తే మోక్షం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పినట్లు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు.

ఎన్ని వత్తులు వేసి దీపం దానం చేస్తే ఎలాంటి ఫలితాలు:

  • కార్తిక మాసంలో ఒక వత్తి వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే అన్ని పాపాలు తొలగిపోతాయని చెబుతున్నారు.
  • నాలుగు వత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే రాజ యోగం కలుగుతుందని సూచిస్తున్నారు.
  • 10 వత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే చక్రవర్తిత్వం కలుగుతుందని అంటున్నారు. చక్రవర్తిత్వం అంటే మీరు ఏ వృత్తిలో ఉన్నా ఉన్నత స్థాయికి చేరుతారని చెబుతున్నారు.
  • 100 వత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే విష్ణు లోక ప్రాప్తి కలుగుతుందని అంటున్నారు.
  • 100 కంటే ఎక్కువ వత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే పునర్జన్మ ఉండదని.. మోక్షం లభిస్తుందని అంటున్నారు.

ఏ తిథిలో దానం చేస్తే ఎలాంటి ఫలితం: కార్తిక మాసంలో శుక్ల పక్షం లేదా బహుళ పక్షంలో అంటే పౌర్ణమికి ముందు లేదా పౌర్ణమి తర్వాత కొన్ని తిథులలో దీపాలను వెలిగించి దానం ఇస్తే మంచిదని స్కాంద పురాణంలో చెప్పినట్లు మాచిరాజు చెబుతున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే

  • పాడ్యమి లేదా చవితి తిథి రోజు దీపదానం చేస్తే ముత్తైదువులకు సౌభాగ్యం కలుగుతుందని చెబుతున్నారు.
  • విదియ రోజు దానం చేస్తే స్ససంతాన ప్రాప్తి కలుగుతుందని వివరిస్తున్నారు.
  • తదియ రోజు దీపదానం చేస్తే సకల సంపదలు లభిస్తాయని తెలుపుతున్నారు.
  • పంచమి రోజు దీప దానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి.
  • షష్ఠి తిథి రోజు దీపాన్ని దానం చేస్తే రాజకీయాల్లో బ్రహ్మండమైన పదవి లభిస్తుంది.
  • సప్తమి రోజు దీప దానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుందని సూచిస్తున్నారు.
  • చతుర్దశి రోజు దానం చేస్తే మానసిక అశాంతి తొలగిపోతుందని అంటున్నారు.
  • క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి రోజు దీప దానం చేస్తే మిగిలిన రోజుల్లో చేసిదాని కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుందని అంటున్నారు.

కార్తికమాసంలో దీపం దానం చేసేటప్పుడు చదవాల్సిన శ్లోకం: "సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ" అనే మంత్రాన్ని పఠిస్తూ దీపాన్ని దానం ఇవ్వాలి. శ్లోకం మొత్తం చదవలేని వారం "కార్తిక దామోదర ప్రీత్యర్థం" అనుకుంటూ దీపదానం ఇస్తే మంచి జరుగుతుందని అంటున్నారు.

NOTE: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

దుర్గుణరాశి 'నిష్టురి' కథ- నరక బాధలు అనుభవించిన కర్కశ- రెండో అధ్యాయం మీకోసం!

పరమ పవిత్ర కార్తిక మాసంలో పుణ్యస్నానాలు - ఇవి పాటిస్తే సకల పాపాలు విముక్తి!

కార్తీక మాసంలో ఈ పూజ చేస్తే చాలు - అశ్వమేధ యాగం చేసినంత ఫలం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.