What Happens After Death in Garuda Purana : హిందూ సంప్రదాయంలో అష్టాదశ పురాణాలు ఉన్నాయి. ఇవన్నీ భగవంతుని కథలు, భాగవతుల చరిత్రలు, పురాణం గాధలు, ఇతిహాసాలలో నిండి ఉంటాయి. అయితే మనిషి మరణానంతరం ఏమి జరుగుతుందో తెలిపే పురాణం గరుడ పురాణం. ఈ కథనంలో గరుడ పురాణంలో వివరించిన సంగతులను క్లుప్తంగా తెలుసుకుందాం.
గరుడ పురాణం
వ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణాల్లో గరుడపురాణం ఒకటి. ఇది వైష్ణవ సంప్రదాయానికి చెందినది. శ్రీ మహావిష్ణువు తనకు అత్యంత ఇష్టుడైన గరుత్మంతునికి ఈ పురాణాన్ని ఉపదేశించాడు. అందుకే ఈ పురాణానికి గరుడ పురాణం అని పేరు వచ్చింది. ఈ పురాణంలో మొత్తం18000 వేల శ్లోకాలు ఉన్నాయి. మానవుడు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు చేసిన పాప ఫలితాలు శిక్షలు ఎలా ఉంటాయో ఈ పురాణంలో వివరించి ఉంది.
మరణానంతరం ఏమి జరుగుతుంది?
మరణం అంటే అందరికి భయమే. కానీ, మరణించాక ఏమి జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరికి ఉంటుంది. గరుడపురాణం మనకు చాలా విషయాలు తెలుపుతుంది
గరుత్మంతుని సందేహం విష్ణువు సమాధానం
ఒకసారి గరుత్మంతుడు మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు. మనిషి బతికి ఉన్నప్పుడు చేసిన పాపాలకు ఏయే శిక్షలు పడతాయని విష్ణువును అడుగుతాడు. విష్ణుమూర్తి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాడు. ఆ సమాధానాలే గరుడ పురాణంగా ప్రసిద్ధి చెందాయి. మానవుడు తెలిసో తెలియకో చేసే పాపాలకు ఎలాంటి శిక్షలు విధిస్తారో గరుడ పురాణంలో వివరించి ఉంది. అతి భయంకరమైన ఈ శిక్షలు గురించి తెలిస్తే జీవితంలో ఎవరు పాపాలు చేయరు.
ఎలాగైతే రామాయణ మహాభారత భాగవత పురాణాలు చదివి, భగవంతుని కథల ద్వారా ప్రేరణ పొందుతామో అలాగే ప్రతిఒక్కరు గరుడ పురాణం కూడా చదవాలి. పాపాలు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసుకోవాలి. తద్వారా పాపాలు చేయడానికి భయపడాలి. దీనితో ప్రపంచంలో పాపాలు తగ్గుతాయి. సుఖశాంతులు నెలకొంటాయి. అప్పుడే పురాణాలు ప్రయోజనం నెరేవేరినట్లు.
సామాజిక మాధ్యమాలలో పంచుకోలేని పవిత్రమైన విషయాలు కొన్ని ఉంటాయి. కాబట్తి గరుడ పురాణం ఎవరికీ వారు చదువుకొని అందులో విషయాలు తెలుసుకోవడం మంచిది.
శుభం భూయాత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం