ETV Bharat / spiritual

ఆ రాశి వారికి అన్నీ సత్ఫలితాలే- ఈశ్వరుడిని దర్శనం చేసుకుంటే బెటర్! - HOROSCOPE TODAY

2025 మే 25వ తేదీ (ఆదివారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 25, 2025 at 12:00 AM IST

4 Min Read

Horoscope Today May 25th 2025 : 2025 మే 25వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ ఉత్సాహంగా పూర్తిచేస్తారు. కుటుంబ వాతావరణం ఈ రోజంతా సుఖ శాంతిమయంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మాతృవర్గం నుంచి ఆర్ధికలబ్ధి ఉండవచ్చు. వృత్తి ఉద్యోగాలలో సన్నిహితుల సహాయంతో ఆర్ధికంగా లాభ పడవచ్చు. ఓ శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అంత ఆశాజనకంగా ఉండదు. అనేక రకాల సమస్యలు ఈ రోజు ఇబ్బంది కలిగిస్తాయి. ప్రియమైన వారికి మధ్య విబేధాలు కుటుంబ వాతావరణాన్ని అనిశ్చితికి గురిచేస్తాయి. ఆర్ధిక సమస్యలు తలెత్తవచ్చు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదాలతో అన్నింటా విజయం సాధిస్తారు. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగులు తమ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది. ఒక సంఘటన విచారం కలిగిస్తుంది. అవమానకర పరిస్థితులకు దూరంగా ఉండండి. దైవబలంపై విశ్వాసం ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లో సహనం కోల్పోవద్దు. ఖర్చులు మితిమీరే ప్రమాదముంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చు. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలు చేటు చేస్తాయి. సమిష్టి నిర్ణయాలతో స్థిరమైన ప్రగతి ఉంటుంది. ఆర్ధికంగా సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులకు బదిలీ ఉండవచ్చు. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కార్యసిద్ధి హనుమ ఆరాధన ఉత్తమం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడానికి అనువైన సమయం. నూతన భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోడానికి, నూతన పెట్టుబడులు పెట్టడానికి శుభసమయం. ఆర్ధిక లాభాలు సంతృప్తి కలిగిస్తాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. ఆరోగ్యం సహకరిస్తుంది. లక్ష్మీదేవి ఆలయ సందర్శనం శుభప్రదం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఉత్సాహంగా ముందుకుసాగితే సత్ఫలితాలు ఉంటాయి. నిరాశ, ప్రతికూల ఆలోచనలు విడిచి పెడితే మంచిది. మీ మాట తీరు కారణంగా శత్రువులు పెరుగుతారు. వివాదాలు, సమస్యలకు దూరంగా ఉంటే మంచిది. ఈశ్వరుని ఆలయ సందర్శనం మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా విజయం మీ వెన్నంటే ఉంటుంది. విశేషమైన ఆర్ధిక లాభాలు అందుకుంటారు. రుణభారం తగ్గుతుంది. దూరదృష్టితో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆస్తులు వృద్ధి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా శక్తివంతంగా భావిస్తారు. మీ విరోధులు ఈ రోజు వారి ఓటమిని అంగీకరిస్తారు. ఉద్యోగులకు తమ సహోద్యోగుల నుంచి సహాయం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. శివారాధన శ్రేయస్కరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచన మేరకు నడుచుకుంటే మంచిది. పిల్లల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆర్ధికంగా మేలైన సమయం. నవగ్రహ శ్లోకాలు పఠించడం ఉత్తమం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. పట్టుదలతో పనిచేసి ఆటంకాలు అధిగమిస్తారు. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. కుటుంబంలో చిన్నపాటి కలహాలకు ఆస్కారం ఉంది. కోపావేశాలు అదుపులో ఉంచుకోవడం అవసరం. అనవసర చర్చలకు, వాదనలకు దూరంగా ఉంటే మంచిది. గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు సమర్ధవంతంగా అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి పెరగవచ్చు. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యపై శ్రద్ధ పెట్టండి. శివపంచాక్షరీ మంత్రజపం శక్తినిస్తుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. శత్రుబలం పెరుగుతోంది కాబట్టిప్రతి పనిలోనూ ఆచి తూచి నడుచుకోండి. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోకపోతే శత్రువులు పెరుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకోవచ్చు. ఆర్ధిక సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. పెద్దల పట్ల గౌరవంతో మెలగడం అవసరం. ఆర్థిక సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్త వహించండి. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.