Horoscope Today May 24th 2025 : 2025 మే 24వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆచి తూచి నడుచుకోవాలి. తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. సమయానుకూలంగా నడుచుకునే మేలు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు ఆలస్యమయినా సహనంతో ఉండండి. గ్రహసంచారం అనుకూలంగా లేదు కాబట్టి చట్టపరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఆర్ధిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక శుభవార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలవడం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారులకు ఈరోజు ఆశాజనకంగా ఉంది. పెట్టుబడులు పెట్టేముందు జాగ్రత్త వహించండి. చట్టపరమైన, కోర్టుకి సంబంధించిన విషయాలతో వ్యవహరించేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన సత్ఫలితాన్నిస్తుంది.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్ధికంగా ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల సంతృప్తి చెందుతారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. వ్యాపారులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. లాభాలు పెరగడమే కాకుండా, పాత బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల సందేహాలు, అనుమానాలు తొలగిపోతాయి. కెరీర్లో నూతన అవకాశాలు అందుకుంటారు. మీ పరోపకార గుణంతో సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. ఆర్ధికంగా ఎదగడానికి చేసే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. వృధా ఖర్చులు నివారించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. శివారాధన శ్రేయస్కరం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. శతృప్రభావం ఎక్కువగా ఉంటుంది. వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి. వృత్తి ఉద్యోగాలలో సమయానుకూలంగా నడుచుకోవడం వలన పనులు ఆలస్యం కావు. కుటుంబ వివాదాలకు అవకాశం ఉంది, కనుక కోపావేశాలు తగ్గించుకుని ప్రశాంతంగా ఉండండి. పరిస్థితిని అంచనా వేస్తూ పరిపక్వతతో వ్యవహరించండి. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. అన్ని విజయాలు ముందు నిర్ణయించినవే. మీ విజయరహస్యాలను ఇతరులతో పంచుకోండి. సామాజిక పరిచయాలు ఊహించని రీతిలో పెరుగుతాయి. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా మీడియా రంగం వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. పనిపట్ల మీ నైపుణ్యాన్ని చూసి అంతా ప్రశంసిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది. ఆర్ధికంగా సానుకూల ఫలితాలు అందుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపార సంబంధిత పనులపై ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. టీమ్ లీడర్‌గా ప్రమోషన్ పొందుతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు ఏర్పడే అవకాశముంది. అందరితో కలిసి మెలిసి ఉండడం మంచిది. వ్యాపారంలో డబ్బు నష్టం సంభవించకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి భుజంగ స్తోత్రం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. బంధు మిత్రుల నుంచి ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో రాబడి పెరుగుతుంది. ప్రజాసంబంధాలు మెరుగ్గా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. హనుమ చాలీసా పారాయణతో శుభ ఫలితాలు ఉంటాయి.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. చేపట్టిన పనుల్లో తోటివారి సహకారం ఉంటుంది. బంధువులతో సత్సంబంధాలు కొనసాగించండి. కోపావేశాలపై అదుపు సాధించండి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. వృత్తి నిపుణులు తమ తమ రంగాల్లో శుభ ఫలితాలు పొందుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. విశేషమైన ధనలాభాలు ఉంటాయి. పొదుపు ప్రణాళికలు చేపడతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతి ఆలయ సందర్శనం మేలు చేస్తుంది.