ETV Bharat / spiritual

ఆ రాశివారికి ఈరోజు ప్రయాణాలు ప్రమాదకరం! ఆర్థిక సమస్యలు ఉంటాయట! - DAILY HOROSCOPE

2025 మే 23వ తేదీ (శుక్రవారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 23, 2025 at 12:01 AM IST

4 Min Read

Horoscope Today May 23th 2025 : 2025 మే 23వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. కొన్ని సంఘటనలు విచారం కలిగిస్తాయి. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మికత వైపు మొగ్గుచూపుతారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. నమ్మకమైన సంస్థల్లో డబ్బు పెట్టుబడిగా పెట్టడానికి ఇది మంచిరోజు. దానధర్మాలు చేయడం వల్ల నష్టపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ఆత్మీయులతో మంచి సమయం గడుపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ఈ పరిచయాలు వృత్తి వ్యాపారాలకు ప్రయోజనం చేకూర్చవచ్చు. కుటుంబంతో చేసే ఒక చిన్న విహారయాత్ర చాలా సంతోషాన్నిస్తుంది. ఆదాయం పెరగడం ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా అనేక శుభ ప్రయోజనాలు అందుకుంటారు. అవివాహితులకు తగిన జీవిత భాగస్వామి దొరకవచ్చు. ఆర్ధిక ప్రయోజనాలకు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కొత్త పనులు మొదలు పెట్టడానికి, పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఒక మహిళ మూలంగా ఈ రోజు మీ జీవితం గొప్ప మలుపు తిరుగుతుంది. మాతృవర్గం నుంచి ఆర్ధికలబ్ధి ఉండవచ్చు. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్లడం ఆనందపరుస్తుంది. వృత్తిపరమైన ఆటంకాలు తొలగి పోవడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. స్నేహితులు, ప్రియమైన వారి సాంగత్యంలో సంతోషంగా ఉంటారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు పనులకు ఆటంకం కలిగిస్తాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వైద్యపరమైన వ్యయాలకు చాలా అవకాశం ఉంది. ఇబ్బంది పెట్టే ప్రతికూల ఆలోచనలు నుంచి దూరంగా ఉండాలి. ధ్యానం, ఆధ్యాత్మికతతో మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృధా ఖర్చులు నివారించండి. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో సులభంగా పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. వ్యాపారులకు, వారి భాగస్వాములకు మధ్య అనుకూలత ఉంటుంది. నూతన వస్తువులు సేకరిస్తారు. ఇష్టమైన వారికోసం ఖర్చు చేయడం మిమ్మల్ని సంతోషపరుస్తుంది. స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన పర్యటనలకు వెళ్లే అవకాశముంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శనం శుభప్రదం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. స్వయంకృషితో ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరమైన నిర్ణయాలతో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేతుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితాలు లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. ఇంటా బయటా ప్రశాంతమైన వాతావరణం కోసం ఘర్షణలకు దూరంగా ఉంటే మంచిది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేవారికి ఇది మంచిరోజు. ఆదాయవ్యయాలు సమంగా ఉంటాయి. కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన ఉత్తమం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అన్ని వైపులా నుంచి వ్యతిరేక పరిస్థితులు చుట్టుముడతాయి. కొన్ని సంఘటనలు విచారం కలిగిస్తాయి. ఆత్మీయులతో మనస్పర్థలు ఏర్పడుతాయి. సమయానుకూలంగా నడుచుకోవడం మంచిది. చట్టపరమైన డాక్యుమెంట్లు, ఆస్తికి లేదా వారసత్వానికి సంబంధించిన వాటితో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. ఎలాంటి వ్యతిరేకతలు లేని మంచిరోజు. అన్ని రంగాల వారికి చేపట్టిన పనులన్నీ సాఫీగా సాగిపోతాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్తారు. ఆస్తికి సంబంధించిన ఒప్పందాలు అదృష్టకరమైన ఫలితాలనిస్తాయి. స్థిరాస్తి కొనుగోలుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీరామ నామజపం మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనవసర కలహాలను ఆహ్వానించవద్దు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యాత్మక పరిస్థితులు ఉండవచ్చు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. సన్నిహితులతో అభిప్రాయభేదాలతో కలత చెందుతారు. ప్రయాణాలు ప్రమాదకరం కావచ్చు కాబట్టి వాయిదా వేయండి. ఆర్ధిక సమస్యలకు సంబంధించిన ఘర్షణలు కుటుంబంలోని శాంతి, ప్రశాంతతకు భంగం కలిగించవచ్చు. నవగ్రహ శ్లోకాలు పఠించడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు సృజనాత్మకంగా అలోచించి ఉన్నత స్థానంలో నిలుస్తారు. వృత్తి వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. అనవసర ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. బంధువుల ఇంట్లో శుభకార్యాలకు హాజరవుతారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఈశ్వరుని ఆలయ సందర్శనం శుభకరం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.