ETV Bharat / spiritual

ఆ రాశివారికి ఈరోజు నీటిగండం- జీవిత భాగస్వామితో మనస్పర్థలు! - DAILY HOROSCOPE

2025 మే 18వ తేదీ (ఆదివారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 18, 2025 at 12:10 AM IST

4 Min Read

Horoscope Today May 18th 2025 : 2025 మే 18వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఆనందం కలిగించే అనేక సంఘటనలు జరుగుతాయి. కుటుంబ సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. ముఖ్యమైన చర్చలు ఫలవంతంగా వుంటాయి. మాతృవర్గం నుంచి ఆర్థిక లబ్ది ఉండవచ్చు. వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా దూరప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో తీర్ధయాత్రలకు వెళ్తారు. వ్యాపారస్థులకు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి, వ్యాపార విస్తరణకు అనుకూలం. ఉద్యోగస్థులకు నూతన అవకాశాలు అందుకుంటారు. ధనలాభాలు ఉంటాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఇంటా బయటా వ్యతిరేక పరిస్థితులు ఏర్పడుతాయి. ఇంట్లో గొడవలు కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో పురోగతి లోపిస్తుంది. ఆర్థిక సమస్యలు అశాంతి కలిగిస్తాయి. మీ కోపావేశాలతో, దూకుడు స్వభావంతో పరువుపోయే సందర్భాలు ఏర్పడవచ్చు. జాగ్రత్తగా ఉండండి. వృథా ఖర్చులు నివారించాలి. ఆరోగ్యం క్షీణిస్తుంది. శనీశ్వరునికి ప్రదక్షిణాలు చేస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. దూరదేశాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. సన్నిహితులతో సరదాగా గడుపుతారు. నూతన వస్తువులు సేకరిస్తారు. వృత్తి వ్యాపార ఉద్యోగాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారంలో లాభాలు వృద్ధి చెందుతాయి. పరువు ప్రతిష్ఠలు పెరుగుతాయి. నూతన వాహనయోగం ఉంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. శారీరక శ్రమ, పని ఒత్తిడి పెరుగుతాయి. మనోధైర్యంతో అవరోధాలను అధిగమిస్తారు. కుటుంబంలో చిన్నపాటి కలహాలు ఉండవచ్చు. మాట పట్టింపులకు పోకుండా సామరస్యంతో ఉంటే మంచిది. ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేష్టం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు రావడానికి సమయం పట్టవచ్చు. సహనంతో ఉండడం మంచిది. ఆర్థికంగా కఠిన పరిస్థితులు ఉంటాయి. సంతానం పురోగతి ఆందోళన కలిగిస్తుంది. గ్రహసంచారం అనుకూలంగా లేనందున ఈ రోజు పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్లో, స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టేముందు ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలి. శివారాధనతో సత్ఫలితాలు ఉంటాయి.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని సంఘటనల కారణంగా విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు. భావోద్వేగాలు అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో మనస్పర్థలు, ఆభిప్రాయ భేదాలు చికాకు కలిగిస్తాయి. నీటిగండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా వుండండి. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తారాబలం అనుకూలంగా ఉంది. అదృష్టం వరిస్తుంది. అన్ని పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలలో నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. కొత్త వెంచర్లు మొదలుపెట్టడానికి ఈ రోజు మంగళకరమైన రోజు. కుటుంబ సభ్యులతో, రక్త సంబంధీకులతో జరిపే ముఖ్యమైన చర్చలు సఫలం అవుతాయి. విశేషమైన ఆర్థిక లాభాలు ఉంటాయి. అన్ని వైపులా అదృష్టం, అనుకోని విజయం వరిస్తాయి. ఈ శుభ సమయాన్ని ఆనందించండి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పట్టుదలతో ఉంటే విజయం సిద్ధిస్తుంది. మనశ్శాంతిని తగ్గించే అనేక సంఘటనలు చోటు చేసుకుంటాయి. మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరిని తొందరగా నమ్మకండి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడుతాయి. శివపంచాక్షరీ మంత్రజపం శ్రేయస్కరం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక సంబంధమైన కార్యకలాపాలలో గడుపుతారు. ఉద్యోగ వ్యాపారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి.సంఘంలో పరపతి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన విచారం కలిగిస్తుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభ సమయం నడుస్తోంది. ఏ పని మొదలు పెట్టినా వేగంగా పూర్తవుతుంది. మీ వాక్చాతుర్యం ఈ రోజు అద్బుతాలు చేస్తుంది. ముఖ్యమైన సమావేశాల్లో మీ వాక్పటిమకు ప్రశంసలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. కనకధారా స్తోత్రం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందుతారు. సంతానంకు సంబంధించి శుభవార్తను వింటారు. కొత్త వ్యక్తులతో పరిచయం భవిష్యత్తులో ప్రయోజనం కలిగిస్తుంది. సామాజిక కార్యక్రమాల కోసం కొత్త ప్రదేశాలకు వెళ్తారు. వృత్తి పరంగా, ఆర్థిక లాభాలకు అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. హనుమాన్ చాలీసా పారాయణ శుభకరం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.