Horoscope Today May 17th 2025 : 2025 మే 17వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో అన్ని పనులు చక్కబెడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఓ కీలక వ్యవహారంలో పురోగతి నిరాశ పరుస్తుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. రుణభారం, ఖర్చులు పెరగవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మంచి శుభ సమయం నడుస్తోంది. అన్నివైపుల నుంచి శుభ శకునాలు ఉంటాయి. ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిరీత్యా చేసే ప్రయాణాలు అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ద పెట్టండి. విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శుభ ఫలితాలు రాబట్టుతారు. ఊహించని ధనలాభాలతో సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వాహనయోగం ఉంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో విపరీతమైన ఆర్థిక లాభాలు అందుకుంటారు. ఇంటి వాతావరణం ఆనందోత్సాహాలతో ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కీలక విషయాలలో పెద్దల సలహా మేరకు నడుచుకుంటే మంచిది. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఉండవచ్చు. కోపాన్ని తగ్గించుకోండి. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు అనువైన సమయం. బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. హనుమాన్ చాలీసా పారాయణ శ్రేయస్కరం.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. సోమరితనం, బద్దకం కారణంగా చేపట్టిన పనుల్లో పురోగతి లోపిస్తుంది. ఇతరులను అర్థం చేసుకోవడం అవసరం. సొంత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. కొత్త పనులు ప్రారంభించే ముందు ఆచి తూచి అలోచించి ముందడుగు వేయాలి. కుటుంబ సభ్యులతో కలహాలకు అవకాశం ఉంది. ఈ రోజు ఆస్తికి సంబంధించి లేదా కోర్టుకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. గణపతి ప్రార్థనతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరగకుండా చూసుకోండి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం, విలువ ఇవ్వడం మంచిది. కోపావేశాలు అదుపులో ఉంచుకోవడం అవసరం. చెడు పనుల మీదకు దృష్టి మరలకుండా జాగ్రత్త పడండి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. భావోద్వేగాలు, పరుషమైన మాటలు అదుపులో ఉంచుకోండి. తారాబలం ఈ రోజంతా వ్యతిరేకంగా ఉంది. కుటుంబ వ్యవహారాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. మీరు పట్టిన పట్టు విడవకుండుట వలన వ్యవహారాలన్నీ చెడిపోతాయి. మీ మాటల్తో సన్నిహితుల్ని బాధపెడతారు. సహనంగా ఉండటం నేర్చుకోండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠించడం మంచిది.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కార్యసిద్ధి, ఆర్థిక అనుకూలత ఉంటాయి. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు. ఆదాయం పెరగడంతో ఆనందంగా ఉంటారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా శుభవార్తలు వింటారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. క్రమశిక్షణ, సమయ పాలనతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు పెడతారు. కోర్టు విషయాల్లో శ్రద్ద వహించండి. తీసుకునే నిర్ణయాలలో స్పష్టత ఉండేలా చూసుకోండి. రామాలయ సందర్శనం శుభకరం.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలమైన రోజు. వ్యాపారపరంగా ఈ రోజు చాలా మంచి రోజు. అధిక లాభాలు అందుకుంటారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుస్తారు. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఈ రోజు శుభప్రదం. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన శుభప్రదం.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు వ్యాపారపరంగా చాలా అద్బుతమైన రోజు. ఉద్యోగులు శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. మీ పై అధికారులు మీ పనికి తృప్తి చెందుతారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం సంతోషాన్ని కలిగిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శనం శుభకరం.