ETV Bharat / spiritual

ఆ రాశివారికి పెళ్లి కుదిరే ఛాన్స్- వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన శుభకరం! - DAILY HOROSCOPE

2025 మే 16వ తేదీ (శుక్రవారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2025 at 12:01 AM IST

4 Min Read

Horoscope Today May 16th 2025 : 2025 మే 16వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది. విశ్రాంతి లేమి, అలసట బాధిస్తాయి. మీ కోపస్వభావంతో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. పనిలో నిర్లక్ష్య వైఖరి తగదు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. దక్షణామూర్తి ప్రార్ధన సత్ఫలితాన్నిస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా లేనందున కొత్త ప్రాజెక్టులు, అసైన్మెంట్ల జోలికి పోవద్దు. వృత్తి పరమైన ఆందోళనలు చికాకు పెడతాయి. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు అధికం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు ఫలవంతం అవుతాయి. దుర్గాదేవి ఆలయ సందర్శనం మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. ఆనందం కలిగించే అనేక సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలు లాభదాయకంగా ఉంటాయి. బుద్ధి బలంతో కీలక వ్యవహారాల్లో ముందంజ వేస్తారు. జీవిత భాగస్వామితో, సన్నిహితులతో విహార యాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఈ రోజు చాలా అదృష్టమైన రోజు. స్నేహితుల నుండి సహోద్యోగులు నుంచి సంపూర్ణ సహకారాలు అందుతాయి. పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చి పెడతాయి. మీ పై అధికారి మీ పనికి సంతృప్తి చెందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన శుభకరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంతానం పురోగతి పట్ల సంతోషంగా ఉంటారు. స్నేహితుల నుంచి ఆర్థిక లబ్ధి ఉండవచ్చు. అనవసరమైన ఆలోచనలతో సమయాన్ని వృధా చేయవద్దు. సమయాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటే మంచిది. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృధా ఖర్చులు నివారించండి. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో స్థానచలన సూచన ఉంది. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. గణపతి దర్శనం శుభకరం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇతరుల సహకారంతో ముందుకు సాగితే మెరుగైన ఫలితాలు ఉంటాయి. సొంత నిర్ణయాలు చేటు చేస్తాయి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. సోదరులతోనూ, రక్తసంబంధీకులతో సత్సంబంధాలు నెలకొంటాయి. తీర్థయాత్రలకు వెళతారు. ఆర్థిక సంబంధమైన సమస్యలు ఉండవచ్చు. విదేశాల నించి శుభవార్త అందుకుంటారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. శ్రేష్టమైన శుభ సమయం నడుస్తోంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉత్సాహవంతంగా సమయాన్ని గడుపుతారు. గత కొంతకాలంగా వాయిదా పడుతున్న పనులన్నీ చక్కగా పూర్తవుతాయి. పెద్దల సలహాలు పాటిస్తే మంచిది. ఆర్థికంగా మంచి యోగవంతమైన కాలం. మీ నిర్ణయం అందరికి శిరోధార్యం అవుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. చేపట్టిన పనుల్లో తరచుగా ఏర్పడే అవరోధాలతో విసిగిపోతారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా నష్టపోయే ప్రమాదముంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక సంఘటన విచారం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు ఏర్పడవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మనోబలాన్ని కోల్పోవద్దు. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేష్టం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుద్ధి బలంతో వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు అధిగమిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విదేశాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ధార్మిక , సామాజిక కార్యకలాపాల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. అనారోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. బంధువులతో బేదాభిప్రాయాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు, కొత్త అసైన్మెంట్లు తీసుకోవడానికి శుభప్రదమైన రోజు. వృత్తిపరంగా లబ్ది పొందుతారు. సామాజికంగా కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వృత్తి పరంగా ఒక సానుకూల సంకేతం అందుకుంటారు. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తొలగిపోతాయి. అవివాహితులకు వివాహం జరుగుతుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు ఆశాజనకంగా లేదు. మనోవిచారం కలిగించే అనేక సంఘటనలు చోటు చేసుకుంటాయి. చిన్న విషయాలకే బాధపడిపోతారు. ఇంటా బయటా ఏర్పడే ప్రతికూల పరిస్థితుల కారణంగా నిరాశపూరిత ఆలోచనలతో ఉంటారు. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. సంకట మోచన హనుమాన్ దర్శనం శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.