ETV Bharat / spiritual

ఆ రాశివారికి నేడు ప్రమోషన్ ఛాన్స్- ఇష్ట దేవతారాధన శుభకరం! - DAILY HOROSCOPE

2025 జూన్ 5వ తేదీ (గురువారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : June 5, 2025 at 12:00 AM IST

4 Min Read

Horoscope Today June 5th 2025 : 2025 జూన్ 5వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఆశించిన ఫలితాలు అందుకుంటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. లక్ష్మీకటాక్షంతో ఐశ్వర్యవంతులవుతారు. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి కోసం చేసే అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు, స్థానచలనం ఉండవచ్చు. వ్యాపారులు భాగస్వాముల ద్వారా ఆర్థికలబ్ధి పొందుతారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ వాక్చాతుర్యంతో అందరినీ మెప్పిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసే కృషి ఫలిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కీలక సమావేశాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సామాజిక పరపతి విస్తరిస్తుంది. ఖర్చులు పెరగవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. సహనం వహించండి. అనుకోని ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. శివారాధన శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంది. ఇష్టమైన వారిని కలుసుకుంటారు. అన్ని పనులు విజయవంతంగా పూర్తి కావడంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కుటుంబ సభ్యులతో చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సామాజిక పరపతి పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో శుభయోగాలున్నాయి. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. దూరప్రాంతాల్లో వ్యాపారాన్ని విస్తరిస్తారు. అనుకున్న పనులు నెరవేరడంతో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢ పడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మనోబలంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. విందువినోదాలలో పాల్గొంటారు. లక్ష్మీ దేవి అనుగ్రహంతో ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ప్రయాణాలు ప్రశాంతంగా సాగుతాయి. ఈ అదృష్టకరమైన ఘడియల్ని ఆనందించండి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయట ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనవసర చర్చల్లోకి దిగవద్దు. కుటుంబ సభ్యులతో కలహాలు ఏర్పడవచ్చు. పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగే పనులు చేయకండి. కోర్టు కేసులకు సంబంధించి జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మిక సాధన మీకు కఠిన సమయాల్లో సహాయం చేస్తుంది. గణపతి ఆరాధనతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఆశించిన సుఖసంతోషాలను అందుకుంటారు. వివాహ ప్రయత్నాలలో ఉన్నవారికి శుభప్రదమైన రోజు. వ్యాపారులు ఆర్థికపరంగా లాభపడవచ్చు. ఉద్యోగులు తమ ప్రతిభతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని సరదాగా గడుపుతారు. విహారయాత్రలకు వెళ్తారు. విందువినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాలు చక్కగా నిర్వహించుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. వ్యాపారులు తమ వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోడానికి అనువైన సమయం. వృత్తి పరంగా చేసే ప్రయాణాలు అనుకూలం. పిత్రార్జితం కలిసి వస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మనోబలంతో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. తారాబలం అనుకూలంగా ఉంది కాబట్టి ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి మంచి సమయం. ఆర్థిక ప్రణాళికలు అమలు చేయడానికి అనువైన రోజు. ఖర్చుల విషయంలో ఆచి తూచి నడుచుకోవాలి. కళాకారులు, రచయితలు మంచి నైపుణ్యం ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా రోజంతా కొన్ని ఇబ్బందులు ఒత్తిడి వుండే అవకాశం వుంది. కోపావేశాలు తగ్గించుకుని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. అవమానకర సందర్బాలను తప్పించుకోడానికి మౌనంగా వుండడం మంచిది. చట్టవిరుద్దమైన పనులు చేయవద్దు. మీ మాటతీరుతో ఇతరులు భాధపడే అవకాశం వుంది. ఇంట్లో ఒక శుభకార్యం మూలంగా ఖర్చులు పెరగవచ్చు. అభయ ఆంజనేయ స్వామి దర్శనం మేలు చేస్తుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి గ్రహగతులు అనుకూలంగా ఉన్నందున చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడానికి శుభ సమయం. ఉద్యోగంలో ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడండి. మీరు సాధించిన విజయాలతో సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. హనుమాన్ చాలీసా పారాయణతో సత్ఫలితాలుంటాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.