Horoscope Today June 15th 2025 : 2025 జూన్ 15వ తేదీ (ఆదివారం)మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తిపరంగా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులు కీలక వ్యవహారాల్లో పై అధికారులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. ప్రభుత్వం ప్రాజెక్టుల నుంచి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. వృత్తి పరమైన ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు అవసరమైన నిధులు సమకూర్చి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. భవిష్యత్తు కోసం వేసే ప్రణాళికలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఎదగడానికి అనుసరించే వ్యూహాలు, ప్రణాళికలు ఫలప్రదం అవుతాయి. ఆర్థిక లాభాలు మెండుగా ఉంటాయి. విదేశీయానానికి అవకాశం ఉంది. తీర్ధయాత్రలు, దైవ దర్శనం ద్వారా ఆధ్యాత్మికతను బలోపేతం చేసుకుంటారు. అనారోగ్య సమస్యలు పనులకు ఆటంకం కలిగించవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కాలం అనుకూలిస్తోంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తే సత్ఫలితాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. వివాదాలు, వాదనలకు దూరంగా ఉండండి. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆదిత్య హృదయం పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మనోబలంతో ముందుకు సాగితే వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలు ఉంటాయి. బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. కుటుంబ సౌఖ్యం, శ్రేయస్సు ఉంటాయి. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ధనలాభాలు ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఇష్ట దేవతారాధన శుభకరం.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఈ రోజు తారాబలం మిశ్రమ ఫలితాలు చూపిస్తుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి చేపట్టిన పనుల్లో ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో పనిభారం, ఒత్తిడి పెరుగుతాయి. ముఖ్యమైన చర్చలకు దూరంగా ఉంటే మంచిది. కోపావేశాలు కుటుంబంలో వాదనలకు కారణమవుతాయి. కొత్త కార్యక్రమాలు, పెట్టుబడులు వాయిదా వేయండి. ప్రయాణాలలో ప్రమాదాలు ఉండవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో ఆలస్యం జరిగే అవకాశముంది. సహనంతో ఉండాలి. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాల కోసం బాగా కష్టపడాలి. మానసికంగా విపరీతమైన ఒత్తిడి వుంటుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చుల విషయంలో ఆచి తూచి నడుచుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. కొత్త వెంచర్స్, ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి అనుకూలమైన సమయం. ఆర్థికంగా శుభఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆచి తూచి అడుగేయాలి. అధికారులతో వినయంగా నడుచుకోవాలి. అనవసరంగా నిందలు పడే అవకాశముంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి భుజంగ స్తోత్రం పఠించడం శుభకరం.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మంచి మనసుతో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. వృత్తి ఉద్యోగాలు లాభదాయకంగా ఉంటాయి. ఒక సంఘటన మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబంలో ప్రశాంతత నెల్లకొంటుంది. విదేశాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతానం పురోగతి సంతృప్తి కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శనం శుభకరం.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇతరుల సహకారంతో వాయిదా పడ్డ పనులు పూర్తి చేస్తారు. ఒక వ్యవహారంలో మోసపోయే ప్రమాదముంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ధార్మిక, ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. ప్రమాదకర పరిస్థితులకు దూరంగా ఉంటే మంచిది. అనారోగ్య సూచనలున్నాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. ముఖ్యమైన సమావేశాలు, చర్చల్లో మీ వాక్చాతుర్య నైపుణ్యం అద్బుతాలు చేస్తుంది. మీ వాక్పటిమకు, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకెళ్లి వృత్తి ఉద్యోగాలలో విజయం సాధిస్తారు. వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. మీ ప్రయత్నాలు, బాధ్యతలు, కర్తవ్యాలూ అన్నీ ఫలిస్తాయి. సామాజిక పరపతి పెరుగుతుంది. ప్రమోషన్ లభించే సూచనలున్నాయి. మొహమాటంతో ఖర్చులు పెరగవచ్చు. గృహంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.