ETV Bharat / spiritual

ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చూసుకున్నారా? - DAILY HOROSCOPE

2025 జూన్ 14వ తేదీ (శనివారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : June 14, 2025 at 12:01 AM IST

4 Min Read

Horoscope Today June 14th 2025 : 2025 జూన్ 14వ తేదీ (శనివారం)మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఊహించని అనేక శుభ సంఘటనలు ఈ రోజు జరుగుతాయి. అదృష్టం వరించి ఐశ్వర్యవంతులవుతారు. కుటుంబ సమస్యలు తగ్గు ముఖం పడతాయి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన చర్చలు ఫలవంతంగా వుంటాయి. మాతృవర్గం నుంచి ఆర్ధికలబ్ధి ఉండవచ్చు. ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. ఇంటి అలంకరణ నిమిత్తం అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు. అనారోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శనం శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తిరీత్యా దూర ప్రదేశాలకు, ప్రయాణం చేసే అవకాశాలున్నాయి. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు అందుకుంటారు. వ్యాపారులు దూరప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి ఈ రోజు మంచి రోజు. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తీర్ధ యాత్రా సందర్శనతో సంతృప్తి పొందుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. గ్రహసంచారం అనుకూలంగా లేదు కాబట్టి ప్రయాణాలు వాయిదా వేయండి. అపరిచితులకు దూరంగా వుండండి. సమయానుకూలంగా నడుచుకోవడం మంచిది. అదనపు ఆదాయ వనరులు అందుబాటులో లేక ఆర్ధిక సమస్యలు తలెత్తుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఖర్చుల విషయంలో ఆచి తూచి నడుచుకోండి. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. ఆదిత్య హృదయం పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ధనలాభాలు ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపట్టడానికి, వాహనాల కొనుగోలుకు ఈ రోజు చాలా మంచి రోజు. బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో విహార యాత్రకి వెళ్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మంచి గుర్తింపు సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. జీవిత భాగస్వామి, సహచరుల సహకారం లోపించడంతో ఒత్తిడి పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు అంచనాలకు మించిన లాభాలను అందిస్తాయి. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి భుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వుంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు చికాకు పెడతాయి. సన్నిహితుల సహకారంతో ఆటంకాలు అధిగమించే ప్రయత్నం చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఖర్చులు పెరుగుతాయి. ఆశయ సాధనలో ఏకాగ్రత అవసరం. ఒత్తిడికి లోనుకాకుండా ఉండేందుకు ప్రయత్నించండి. షేర్స్ లోనూ, స్టాక్స్ లోనూ పెట్టుబడులు పెట్టకండి. ఈశ్వరుని ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయట వ్యతిరేక పరిస్థితులతో మానసికంగా విపరీతమైన ఒత్తిడి వుంటుంది. కుటుంబ సభ్యులతో కలహాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. జలగండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా వుండండి. ఆస్తి వ్యవహారాలతో డీల్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఆరోగ్యపై శ్రద్ధ పెట్టండి. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో అదృష్ట ఫలితాలు ఉంటాయి. ఈ రోజు జరిగే అన్ని సంఘటనలు మీ మనోబలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచేవే! సన్నిహితులతో ఈ రోజంతా ఆనందోత్సాహాలతో గడుపుతారు. బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు మెరుగయ్యే పరిస్థితి ఉంది. కీలక వ్యవహారాల్లో చర్చలు సఫలం అవుతాయి. ఆర్ధికంగా విశేషమైన లాభాలు ఉంటాయి. ప్రయాణాలు అనుకూలం. ఆరోగ్యం బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా శ్రమించాలి. ఉద్యోగులకు పని ఒత్తిడి, శ్రమ పెరగవచ్చు. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా జాగ్రత్త పడండి. కుటుంబ కలహాలు ఏర్పడకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆర్ధిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. ఎట్టి పరిస్థితుల్లో దైవారాధన మానవద్దు. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ రోజు పూర్తి ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి, పదోన్నతులు ఉంటాయి. ఉద్యోగంలో కావలసినంత ఆదాయం లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు లాభాదాయకంగా ఉంటాయి. కీలక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. ముందుచూపుతో వ్యవహరించి ఆర్ధికంగా విశేష లాభాలు అందుకుంటారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శనం శుభకరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో పురోగతి ఆనందం కలిగిస్తుంది. పెద్దల సలహాలు ఉపయోగకరంగా వుంటాయి. కొత్త స్నేహాలు, సంబంధాలు దీర్ఘ కాలం పాటు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఊహించని ధనలాభాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.