ETV Bharat / spiritual

ఆ రాశి వారు దూకుడు తగ్గించుకుంటే మంచిది- చిన్న సమస్యలే కదా అని వదిలేస్తే! - Daily Horoscope In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 16, 2024, 3:08 AM IST

Horoscope Today August 16th 2024 : ఆగస్టు​ 15న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

Horoscope Today August 16th 2024 : ఆగస్టు​ 16న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పనిభారం పెరగడం వల్ల అలసటగా ఉంటారు. ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలు లేకపోవడం వల్ల నిరుత్సాహంగా, ఏ పని మీద ఆసక్తి లేకుండా ఉంటారు. కుటుంబ విషయాలలో కొంచెం దూకుడు తగ్గించుకుంటే మంచిది. చిన్న సమస్యలు పట్టించుకోకుండా ఉంటే అవే సర్దుకుంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త వహించాల్సిన సమయం. నమ్మించి మోసం చేసే వారు పక్కనే ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారులకు ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. ఆదాయానికి సరిపడా ఖర్చులు కూడా ఉంటాయి. శ్రీరామనామ జపం శక్తినిస్తుంది.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది. ఆర్ధికంగా శుభ ఫలితాలు అందుకుంటారు. అవసరానికి ధనం సమకూరుతుంది. నూతన వస్తువాహనాలు కొంటారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళతారు. వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది. సామాజికంగా మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో సంతోషంగా గడుపుతారు. ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. పెట్టుబడులు, లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు ఈ రోజు చాలా మంచి రోజు. పదోన్నతులు ఉండే అవకాశం ఉంది. సహోద్యోగులు సహకరిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. శివారాధన శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో పురోగతి, ఆర్ధిక ప్రయోజనాలు మెండుగా ఉండడం వల్ల మీరు ఈ రోజు సంతోషంగా గడుపుతారు. రచయితలూ తమ వృత్తిలో అద్భుతంగా రాణిస్తారు. మీ కల్పనా శక్తి వెయ్యింతలవుతుంది. మీ సంతానం సాధించిన పురోగతి పట్ల సంతృప్తితో ఉంటారు. స్నేహితుల నించి ఆర్థికపరమైన లబ్ధి ఉండవచ్చు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలం కాదు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా మానసికంగా శారీరకంగా చాలా ఒత్తిడి అనుభవిస్తుంటారు. ప్రియమైన వారితో కలహాల కారణంగా అశాంతితో ఉంటారు. మీ తల్లి గారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ జాగ్రత్త పరచండి. జల గండం ఉండవచ్చు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటే మంచిది. అధిక ఖర్చులు ఉండవచ్చు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ శక్తి సామర్ధ్యాలను పూర్తిగా వెచ్చించి వృత్తి వ్యాపారాలలో తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటారు. ఉద్యోగులకు శుభ సమయం నడుస్తోంది. పని పట్ల మీ అంకితభావానికి ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. మీ సోదరులతోనూ, రక్త సంబంధీకులతోనూ అనుబంధాలు దృఢ పడతాయి. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళతారు. ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. విదేశాల నించి శుభవార్త అందుకుంటారు. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు శుభకరంగా ఉంది. శ్రీలక్ష్మిదేవిని పూజిస్తే మరిన్ని శుభ ఫలితాలుంటాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఆర్ధికంగా కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటారు. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగితే మనస్పర్థలు ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలి. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త ప్రాజెక్టులను అందుకుంటారు. ఆర్ధిక లబ్దిని పొందుతారు. బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యాలకు హాజరవుతారు. వైవాహిక జీవితం ఆనందదాయకంగా గడుస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి చేపట్టిన ప్రతి పనిలోనూ సవాళ్లు ఎదురవుతాయి. సహనంతో ఉంటూ సమయానుకూలంగా నడుచుకుంటే విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండవచ్చు. బంధువులతో మనస్పర్దలు ఏర్పడవచ్చు. వ్యాపారంలో శ్రమకు తగిన ఫలం లేక అశాంతితో ఉంటారు. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించని లాభాలతో సంతోషంగా ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. సమాజంలో ప్రతిష్ఠ, ప్రజాదరణ పెరగవచ్చు. ఉద్యోగంలో ప్రశంసలు, పదోన్నతులు ఉంటాయి. సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. శ్రీలక్ష్మీదేవి ఆరాధన శుభకరం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి. ఉన్నతాధికారులు మీ పనితీరుని ప్రశంసిస్తారు. వ్యాపార, సేవా రంగాల వారికి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. మారిన పరిస్థితుల పట్ల మీరు సంతోషంగా ఉంటారు. పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే సూచనలున్నాయి. శ్రీలక్ష్మిదేవిని పూజిస్తే మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.