ETV Bharat / spiritual

ఆ రాశులవారికి ఈ రోజు అన్నీ మిశ్రమ ఫలితాలే- జాగ్రత్తగా ఉంటే మంచిది! - DAILY HOROSCOPE

2025 ఏప్రిల్ 22 తేదీ (మంగళవారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 22, 2025 at 12:01 AM IST

4 Min Read

Horoscope Today April 22nd 2025 : 2025 ఏప్రిల్ 22వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి పరమైన ఒత్తిళ్లు కొనసాగుతాయి. ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. కీలక వ్యవహారాల్లో శ్రద్ధ పెంచాలి. చేపట్టిన పనుల్లో దూకుడు తగ్గించి సహనం, ఓర్పుతో మెలగాల్సి ఉంటుంది. అనవసర ఖర్చుకు తగ్గించుకుంటే మంచిది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శనీశ్వరుని ధ్యానం మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు. మనోధైర్యంతో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకోడానికి ఈ రోజు అద్భుతమైన రోజు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో కొంత అనిశ్చితి నెలకొంటుంది. అనారోగ్య సమస్యలతో కొంత అశాంతిగా ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆదిత్య హృదయం పారాయణ సత్ఫలితాన్నిస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఈ రోజంతా సరదాగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలు ఉంటాయి. విదేశాల నుంచి సన్నిహితుల రాక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. వ్యాపారంలో లాభాలు వృద్ధి చెందుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు పని ప్రదేశంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధికారుల చొరవతో సమస్యలు పరిష్కారమవుతాయి. కీలక విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాలి. లక్ష్యాలు సాధించేవరకు నిర్విరామంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆర్థిక వృద్ధి ఉంది. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. వాదనలకు దూరంగా ఉండండి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహా మేరకు నడుచుకుంటే మంచిది. కోపతాపాలు అదుపులో ఉంచుకుని పెద్దలతో వినయంగా నడుచుకోవడం మేలు చేస్తుంది. చెడు విషయాల మీద మనసు పోకుండా జాగ్రత్త వహించండి. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. షేర్స్​లోనూ, స్టాక్స్ లోనూ పెట్టుబడులు పెట్టకండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం, ఆర్థికలాభాలు ఉంటాయి. కోపం అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే కుటుంబ సభ్యులతో కలహాలు తప్పవు. వ్యాపారంలో ఆశించిన లాభాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రద్ధ, ఏకాగ్రత పెంచడం ద్వారా పదోన్నతులు పొందవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఇది తగిన సమయం. నిరంతర కృషితో మీ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. దైవబలం అండగా ఉంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో సమయస్ఫూర్తితో ఆటంకాలు అధిగమిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శారీరక శ్రమ పెరుగుతుంది. ఒత్తిడి దరిచేరకుండా జాగ్రత్త పడండి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయడంపై దృష్టి సారించండి. అనుకోని రీతిలో వ్యాపారంలో నష్టాలు వస్తాయి. సన్నిహితుల సలహాలు మేలు చేస్తాయి. వృధా ఖర్చులు నివారించండి. కార్యసిద్ధి హనుమ ఆరాధన శుభప్రదం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. దైవబలంతో చేపట్టిన ప్రతి పనిలోనూ సానుకూలత ఉంటుంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశం ఉంది. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆర్థికవృద్ధి సాధిస్తారు. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభకరం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. క్రమశిక్షణ, సమయపాలనతో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఎంత గొప్పగా పనిచేస్తే అంత విజయం లభిస్తుంది. విశేషమైన ధనయోగం ఉంది. భూ, గృహ లాభాలున్నాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగుల మీద తీవ్రమైన ఒత్తిడి ఉండవచ్చు. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. అదనపు ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు. ఈశ్వరుని ఆలయ సందర్శనం మేలు చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.