ETV Bharat / spiritual

ఆ రాశివారికి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్​- శివారాధన శ్రేయస్కరం! - HOROSCOPE TODAY APRIL 20TH 2025

2025 ఏప్రిల్ 20వ తేదీ (ఆదివారం) రాశిఫలాలు

Horoscope Today April 20th 2025
Horoscope Today April 20th 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 20, 2025 at 12:02 AM IST

4 Min Read

Horoscope Today April 20th 2025 : 2025 ఏప్రిల్ 20వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం అంత అనుకూలంగా లేదు ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో, ఆర్ధిక అంశాలలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికీ ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి పరమైన చికాకు, ఆందోళనలతో అవిశ్రాంతంగా ఉంటారు. ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కోపాన్ని, మాటలను నియంత్రణలో పెట్టుకోండి. చేపట్టిన పనుల్లో తీవ్ర ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి కొత్త పనులకు దూరంగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మనసుకు సంతోషం కలిగిచే అనేక సంఘటనలు జరుగుతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ చక్కని సమయాన్ని సంతోషంగా గడపండి. సన్నిహితులతో విందువినోదాలలో పాల్గొంటారు. వృత్తి పరంగా, ఆర్ధిక పరంగా శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. పని ప్రదేశంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పనిచేసి సత్ఫలితాలు అందుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. మాతృ వర్గం నుంచి అందిన శుభవార్త మీ ఇంటి వాతావరణాన్ని ఆనందభరితం చేస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు చేపట్టిన ప్రతిపనిలోను అనుకూలత ఉంటుంది. మనోబలంతో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు ఈ రోజు లాభాలు, అదృష్టం, సంపద లభిస్తాయి. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున ఈ రోజు ఊహించని సంపదలు కలుగుతాయి. కుటుంబ వాతావరణ ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఆటంకాలను అధిగమిస్తే సత్ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సహనంతో ఉండడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. హనుమాన్ చాలీసా పారాయణ శక్తినిస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టేందుకు, భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించేందుకు మంచి రోజు. బాల్య మిత్రులను కలుసుకుని సరదాగా గడుపుతారు. వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీర్తి ప్రతిష్టలు, గౌరవం పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయ సందర్శన శుభకరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దైవబలం అనుకూలిస్తోంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉన్నత ఆశయాలు నెరవేరుతాయి. ఆర్ధికంగా మేలు చేకూరుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెరిగే అవకాశముంది. వృత్తి నిపుణులు, ఉద్యోగులు పనిఒత్తిడి ఎదుర్కోవలసి ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. సకాలంలో పనులు పూర్తి కావడం కష్టతరం అవుతుంది. వృత్తి ఉద్యోగాలలో తీవ్రమైన కృషితోనే ఆశించిన ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. శత్రువుల నుంచి ఆపద పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి. వృధా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆటంకాలను సమయస్ఫూర్తితో అధిగమించి ముందుకెళ్తారు. మొహమాటం వల్ల ఖర్చులు పెరగవచ్చు. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరగకుండా జాగ్రత్త పడండి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. కుటుంబ వ్యవహారాల్లో సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. శివారాధన శ్రేయస్కరం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. ఇంటా బయటా మీ మాటకు తిరుగుండదు. సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అన్ని రంగాల వారికి సంపూర్ణ కార్యసిద్ధి ఉంది. మనోబలంతో చేపట్టిన పనుల్లో సత్ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశముంది. శ్రీరామ నామజపం శుభకరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. వ్యాపారం అద్బుతంగా సాగుతుంది. లాభాలు, ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఉద్యోగులు మెరుగైన పని తీరుతో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆదాయానికి తగిన ఖర్చులుంటాయి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.