Horoscope Today April 15th 2025 : 2025 ఏప్రిల్ 15వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆహారవిహారాల మీద, ఖర్చుల మీద అదుపు ఉంచాలి. వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలు ఉంటాయి. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదాయం ఆశించిన మేరకు ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు రోజంతా ఫలవంతంగా ఉంటుంది. అన్ని అనుకున్నట్లుగా జరగడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సహచరుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి అనుకూలమైన సమయం. తల్లిదండ్రుల నించి శుభవార్త అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఇంటా బయటా అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఉండవచ్చు. కొత్త పనులు ప్రారంభించడానికి పరిస్థితులు సహకరించవు. కుటుంబ సభ్యుల అనారోగ్యం నిమిత్తం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు నిరాశ కలిగిస్తాయి. ఏ పని ముందుకు సాగదు. కుటుంబసభ్యులతో గొడవలు పెరుగుతాయి. ప్రయాణాలలో డబ్బు పొగొట్టుకునే పరిస్థితి ఉంది కాబట్టి ప్రయాణాలు వాయిదా వేయండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణతో సత్ఫలితాలు ఉంటాయి.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. కీలక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారస్తులు తమ పోటీ దారులపై విజయం సాధిస్తారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఆర్థిక సంబంధమైన లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి మంగళకరమైన రోజు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు మంగళకరమైన రోజు. ప్రారంభించిన పనులు మంచి ప్రణాళికతో పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి ఉంది. రుణభారం తగ్గుతుంది. సన్నిహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఉద్యోగస్తులు కొత్త అవకాశాలు అందుకుంటారు. వ్యాపారంలో ఆటంకాలున్నప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పదండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కార్యసిద్ధి హనుమ ఆరాధన ఉత్తమ ఫలితాలనిస్తుంది.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది.అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆత్మ విశ్వాసంతో జటిల సమస్యలు పరిష్కరిస్తారు. మీ పనితీరుతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వినోదాల కోసం ఖర్చు చేస్తారు. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. సూర్యాష్టకం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బంధువులతో మాట పట్టింపులు, గొడవలు ఏర్పడే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో విశేషంగా కలిసి వస్తుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త ఆలోచనలతో అభివృద్ధి దిశగా పయనిస్తారు. ఆర్ధిక లాభాలు మెండుగా ఉన్నాయి. గణపతి ఆలయ సందర్శనం శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు లాభదాయకమైన రోజు. కుటుంబజీవితాన్ని సంపూర్ణంగా ఆనందిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు స్వస్థానప్రాప్తి ఉంది. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ఆటంకాలను అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపార అవసరాల కోసం చేసే ప్రయాణం ఫలిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం అంతగా సహకరించదు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి దేవి ఆలయ సందర్శన శుభప్రదం.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి ఉద్యోగాలలో కొన్ని ప్రమాదకర పరిస్థితులకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఓ సంఘటన మనోవిచారం కలిగిస్తుంది. ప్రయాణాలలో అనేక ఆటంకాలుంటాయి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశముంది. కోర్టు వ్యవహారాలు, ముఖ్యమైన పనులు వాయిదా వేయండి. కోపం అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్య సంబంధమైన విషయంలో జాగ్రత్త వహించాలి. శివారాధన శ్రేయస్కరం.